Telugu Desam Party Gonegandla Mandal

Telugu Desam Party Gonegandla Mandal Official Page of TDP Gonegandla Mandal

29/05/2026

💛 iTDP Official Gonegandla ✌️
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా గోనెగండ్ల మండల అధ్యక్షులు రాంపురం రఫీక్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న మహానేత అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేర్చడంలో సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
అలాగే పార్టీ కార్యకర్తలు MyTDP App, సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకొని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐటీడీపీ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గార...
29/05/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా గోనెగండ్ల మండలంలోని వివిధ క్లస్టర్లలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు My TDP App లో Attendance నమోదు విధానం, Access Activity, ఇతర సాంకేతిక కార్యక్రమాల వినియోగంపై క్లస్టర్ టెక్నికల్ కో-ఆర్డినేటర్ iTDP రాంపురం రఫీక్ అవగాహన కల్పించారు.

పార్టీ కార్యక్రమాలను డిజిటల్ విధానంలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు యాప్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గోనెగండ్ల మండలంలోని వివిధ క్లస్టర్లలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు MyTDP App లో...
27/05/2026

గోనెగండ్ల మండలంలోని వివిధ క్లస్టర్లలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు MyTDP App లో అటెండెన్స్ నమోదు చేసే విధానాన్ని క్లస్టర్ టెక్నికల్ కోఆర్డినేటర్, iTDP రాంపురం రఫీక్ వివరించారు.

ఈ సందర్భంగా యాప్ వినియోగంపై దశలవారీగా అవగాహన కల్పిస్తూ, ప్రతి కార్యకర్త తమ హాజరును సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. డిజిటల్ విధానాల ద్వారా పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు.

*గోనెగండ్ల మండలంలో క్లస్టర్-6,7,8 లో మహానాడు ఘనంగా నిర్వహణ*ఎన్టీఆర్ జయంతి సందర్భంగా డిజిటల్ మహానాడు వీక్షణతెలుగుదేశం పార...
27/05/2026

*గోనెగండ్ల మండలంలో క్లస్టర్-6,7,8 లో మహానాడు ఘనంగా నిర్వహణ*

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా డిజిటల్ మహానాడు వీక్షణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా గోనెగండ్ల క్లస్టర్-7 పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమరావతిలో జరుగుతున్న డిజిటల్ మహానాడును స్థానికంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి స్క్రీన్‌ల ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.

మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరావతి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు చేసిన ప్రసంగాలను ఆసక్తిగా వీక్షించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని నినాదాలతో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ నాయకులు, మండల నాయకులు, యువత, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.@

💛 iTDP Official Gonegandla ✌️తెలుగుదేశం పార్టీ మహానాడు – విజయవంతం చేయండిరాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ...
25/05/2026

💛 iTDP Official Gonegandla ✌️
తెలుగుదేశం పార్టీ మహానాడు – విజయవంతం చేయండి
రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలతో ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మే 27 & 28 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేసి మహానాడుకు భారీగా తరలిరావాలని కోరారు.
📌 మూడు క్లస్టర్లలో కార్యక్రమాలు నిర్వహణ
🔸 క్లస్టర్ 06 – హెచ్ కైరవడి
🔸 క్లస్టర్ 07 – గోనెగండ్ల
🔸 క్లస్టర్ 08 – పిల్లిగుండ్ల
ఈ సమావేశాలకు ముఖ్య క్లస్టర్ ఇంచార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, డైరెక్టర్లు, యూనిట్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు, KSSలు, నాయకులు, కార్యకర్తలు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అనుబంధ కమిటీ సభ్యులు తప్పక హాజరై మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
⚠️ ముఖ్య గమనిక:
మహానాడు కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ సభ్యత్వ కార్డు మరియు పసుపు చొక్కాతో తప్పక హాజరు కావాలని నాయకులు సూచించారు.
🔥 “ప్రతి కార్యకర్తే పార్టీకి బలం… మహానాడు విజయమే తెలుగుదేశం విజయానికి నాంది” 🔥
💛

జయన్న చల్లని చూపే ఎమ్మిగనూరు ప్రజల పాలిట స్వర్ణదీపం🔥ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు…ప్రతి ఇంటికి అండగా నిలిచే అభి...
23/05/2026

జయన్న చల్లని చూపే ఎమ్మిగనూరు ప్రజల పాలిట స్వర్ణదీపం🔥

ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు…
ప్రతి ఇంటికి అండగా నిలిచే అభివృద్ధి దీపం…
మన జయన్న నాయకత్వమే ఎమ్మిగనూరుకు బంగారు భవిష్యత్తు 💛🔥

21/05/2026

నిజాయితీకి మారుపేరు మన ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి అన్న… 💛🔥
ప్రజల కోసం నిత్యం కష్టపడే నాయకుడిని తప్పుడు ప్రచారాలతో ఆపాలని చూసే వాళ్లు ఎంత ప్రయత్నించినా ప్రజల ప్రేమను తగ్గించలేరు.
అబద్ధాల ప్రచారాలు, ఉడత బెదిరింపులు, రాజకీయ కుట్రలు చూసి వెనక్కి తగ్గే వ్యక్తి కాదు మన అన్న.
నిజం కోసం నిలబడటం ఆయన నైజం… తప్పు చేసే వాళ్లను ఎప్పటికీ ఉపేక్షించరు.
ప్రజల నమ్మకమే ఆయన బలం… ధైర్యమే ఆయన ఆయుధం… సేవే ఆయన లక్ష్యం.
ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకుడు మన జయ నాగేశ్వర్ రెడ్డి అన్న. ✊💛

_*ప్రశాంతమైన ఎమ్మిగనూరులో అలజడి సృష్టించడం మంచి పద్ధతి కాదు*_ - _రాజకీయ లబ్ధి కోసం కోతుల బావి ఆలయాన్ని వివాదాల్లోకి లాగు...
17/05/2026

_*ప్రశాంతమైన ఎమ్మిగనూరులో అలజడి సృష్టించడం మంచి పద్ధతి కాదు*_

- _రాజకీయ లబ్ధి కోసం కోతుల బావి ఆలయాన్ని వివాదాల్లోకి లాగుతున్నారు_
- _ఎమ్మెల్యేతో కూర్చుని శాశ్వత పరిష్కారం చూసుకోవాలి_
- _ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు_
- _తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్ట దావా వేస్తా :- భాస్కర్ల చంద్రశేఖర్ గారు_
- _కూటమి నాయకులు ఆగ్రహం_

_*300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కోతుల బావి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం విషయమై కొందరు కావాలనే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని, సమస్యలను కేవలం చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, రాజకీయ స్వార్థం కోసం రచ్చ చేయడం మంచి పద్ధతి కాదని కూటమి నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు, కురువ మద్దిలేటి, కామర్తి మిన్నప్ప, దామా నర్సింహులు, తొగట నరసింహులు, విజయలక్ష్మి, మాచాని మహేష్, రంగస్వామి గౌడ్, కల్లిముల్లా, బండా నర్సప్ప, రామకృష్ణ నాయుడు, చిన్న ఈరన్న, తెలుగు వెంకటేష్, రవిప్రకాష్, జటప్ప, అబ్దుల్లా, వినయ్ రాజేష్ లు పేర్కొన్నారు. ఆదివారం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా అక్కడ ఉన్న డబ్బాలను ఖాళీ చేయించి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని భావించినప్పుడు.. కొందరు నాయకులు అకస్మాత్తుగా దేవాలయంపై ప్రేమ నటిస్తూ రంగంలోకి దిగారని విమర్శించారు. ఇన్నాళ్లూ కనిపించని దేవాలయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని వారు నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు మారి వలస వెళ్లిన కొందరు నాయకులు, స్థానిక ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ఈ దేవాలయం కేంద్రంగా అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పట్టణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారిపై, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారిపై అనవసరంగా అసత్య ఆరోపణ చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. మీరు ఎవరొచ్చి అడిగినా ఏ దేవరానికైనా నిర్మాణానికి సహాయ సహకారాలు చేసే వ్యక్తుల గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. మాజీ కౌన్సిలర్లు మధుబాబు, దయ సాగర్, నాగేశప్పలు సొంతంగా దేవాలయ కమిటీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. గతంలో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిల్పాలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆలయ కమిటీలు వేసుకుని డ్రామాలు ఆడుతున్నారని మాజీ కౌన్సిలర్ మధుబాబుపై విమర్శలు చేశారు. కోతుల బాబి స్థలం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న చిన్న అంశమని దీన్ని వారు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి చర్చించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేయాలి గాని.. దేవాలయాలన్నీ అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం ప్రజలు ఎవరు నమ్మరు అని తెలిపారు. వ్యాపారస్తుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని, దమ్ముంటే ఆధారాలు నిరూపించాలని సవాల్ విసిరారు. రాజకీయాలు ప్రజాక్షేత్రంలో చేయాలి కానీ, దేవాలయాలను అడ్డుపెట్టుకుని చేసే రాజకీయాలను ప్రజలు నమ్మరని హితవు పలికారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.*_

మహానాడు సభ విజయవంతం కోసం సమన్వయ సమావేశం…కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు సభను ఘన విజయవంతం చేయడం పై ఎ...
15/05/2026

మహానాడు సభ విజయవంతం కోసం సమన్వయ సమావేశం…

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు సభను ఘన విజయవంతం చేయడం పై ఎమ్మెల్యే గౌ. శ్రీ డా. బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ గారు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా చర్చించారు.

మహానాడుకు భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు..

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా మహానాడు నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

📍 iTDP Official Gonegandla















✌️💛

టీడీపీ సభ్యత్వ ప్రమాద బీమా కింద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ధృవపత్రాలు అందజేసిన డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారుతెలుగు...
11/05/2026

టీడీపీ సభ్యత్వ ప్రమాద బీమా కింద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ధృవపత్రాలు అందజేసిన డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు

తెలుగుదేశం పార్టీ సామాన్యులకు భరోసా కల్పించే పార్టీ అనే విషయం మరోసారి నిరూపితమైంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాల ఎర్రన్న గారు, అలాగే గోనేగండ్ల మండలం బి. అగ్రహారం గ్రామానికి చెందిన పి. చంద్ భాషా గార్ల నామినీలు శ్రీమతి మాల మారెమ్మ గారికి మరియు శ్రీమతి పి. చాకినా బీ గారికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా నిధులు మంజూరయ్యాయి. బీమా కంపెనీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమయ్యాయి.

ఈ రోజు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు మృతుల కుటుంబ సభ్యులకు నారా లోకేష్ గారి సంఘీభావ సందేశ పత్రం మరియు బ్యాంకు నగదు జమ ధృవపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సకాలంలో పార్టీ అధిష్ఠానానికి అవసరమైన వివరాలు పంపించడంతో ఈ ప్రమాద బీమా నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే కార్యకర్తల కుటుంబాలకు ఈ బీమా నిధులు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, టీడీపీ మండల కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Address

Gonegandla

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party Gonegandla Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party Gonegandla Mandal:

Share