Telugu Desam Party: Gannavaram.P

Telugu Desam Party: Gannavaram.P Official Page of TDP P.Gannavaram constituency Dr.B.R Ambedkar Konaseema Zilla

02/06/2026

జగన్ రెడ్డి పీఏ కేఎన్‌ఆర్ ఇంట్లోనే వేల కోట్ల రూపాయల బినామీ ఆస్తులు బయటపడ్డాయి. పీఏకే ఇన్ని బినామీ ఆస్తులు ఉంటే, ఇక అసలు సూత్రధారికి ఇంకా ఎన్ని వేల కోట్ల బినామీ ఆస్తులు ఉంటాయో?


02/06/2026

ఏఐ యుగంలో పోటీని ఎదుర్కోవాలంటే యువత నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలి. రీసెర్చ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆ విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉంది.



02/06/2026

ప్రజల విశ్వాసమే అభివృద్ధికి అసలైన మూలధనం. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు, భూ యజమానులకు న్యాయమైన నష్టపరిహారం, పారదర్శక విధానం ఉంటేనే ప్రజల మద్దతు లభిస్తుంది. 1995 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే నమూనాను చంద్రబాబు గారు విజయవంతంగా అమలు చేశారు.



02/06/2026

ఒక ఆడియో చూపించి డీఎస్సీపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ వ్యక్తి SAP ఉద్యోగి కాదు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా కాదు..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆడియో సందేశాలు వెలుగులోకి వచ్చిన వెంటనే క్రీడల శాఖ స్వయంగా స్పందించి, 2025 జూలై 28న పల్లెకోన పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో బొంత రోశయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నాం.

02/06/2026

డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.

నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.

మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.

కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.

02/06/2026

స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్టును దాచేశారని చేస్తున్న ఫేక్ ప్రచారం పచ్చి అబద్ధం..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 382 మంది జాబితా మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

02/06/2026

ప్రజా నాయకులు.. ఎప్పుడూ ప్రజలతోనే..

పరదాలు ఉండవు... ప్రజలపై ప్రేమ ఉంటుంది..
గొడ్డలి వేట్లు ఉండవు... గుండెల్లో ప్రేమ ఉంటుంది..


100కు పైగా ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, హైకోర్టు పరీక్షలు వంటివి నిర్వహించిన టీసీఎస్ ఐయాన్ నేతృత్వంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్...
02/06/2026

100కు పైగా ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, హైకోర్టు పరీక్షలు వంటివి నిర్వహించిన టీసీఎస్ ఐయాన్ నేతృత్వంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో మెగా డీఎస్సీ నిర్వహించబడింది. సిస్టమ్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన ప్రశ్నపత్రాలు పరీక్ష సమయంలో మాత్రమే డీక్రిప్ట్ అవుతాయి. ప్రతి అభ్యర్థికి ప్రశ్నల ఆర్డర్ జంబుల్ రూపంలో వెళ్తుంది. అందువల్ల పేపర్ లీకేజీకి ఏమాత్రం అవకాశం ఉండదు.

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం ...
02/06/2026

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

• నియోజకవర్గాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

• రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం.. ముంబయి సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ఉపాధ్యాయ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఎండగడుతూ విశాఖ తీరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులు

• కోటిమంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలు యోగాంద్ర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QE0HV


దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుతో రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల ప్రక్రియ అత్యంత వేగవంతం కానుంది. ఈ జోన్...
01/06/2026

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుతో రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల ప్రక్రియ అత్యంత వేగవంతం కానుంది. ఈ జోన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల కొత్త రైల్వే లైన్ల విస్తరణతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


Address

Gannavaram
533240

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Gannavaram.P posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Gannavaram.P:

Share