Jogulamba Gadwal Cyber Security Bureau

Jogulamba Gadwal Cyber Security Bureau To report cyber crime, Dial 1930 or log in to https://cybercrime.gov.in

➤ APK ఫైల్ మోసాలకు బ్రేక్: అప్రమత్తతతో బాధితులకు 100% న్యాయం  ➤  గోల్డెన్ అవర్‌లో  ఫిర్యాదు - 100% డబ్బు రికవరీతో నేరగాళ...
20/04/2026

➤ APK ఫైల్ మోసాలకు బ్రేక్: అప్రమత్తతతో బాధితులకు 100% న్యాయం

➤ గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు - 100% డబ్బు రికవరీతో నేరగాళ్లకు చెక్ : జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గారి ఆదేశాలు, నిరంతర పర్యవేక్షణతో గద్వాల జిల్లా పోలీసులు సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు సైబర్ మోసాల కేసుల్లో జిల్లా సైబర్ సెల్ సిబ్బంది అసాధారణమైన చురుకుదనం, సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితులకు నష్టం లేకుండా 100 శాతం డబ్బును తిరిగి రికవరీ చేయడం విశేషం.

సైబర్ మోసాల్లో డబ్బు కట్ అయిన వెంటనే వచ్చే మొదటి 1 గంటను “గోల్డెన్ అవర్” అంటారు. ఈ సమయంలో వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే బ్యాంకులు ఖాతాను ఫ్రీజ్ చేసి, డబ్బును తిరిగి రికవరీ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

మొదటి ఘటనలో, గద్వాల పట్టణానికి చెందిన జయన్న అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా వచ్చిన ఫేక్ APK ఫైల్‌ను ఓపెన్ చేయడంతో, సైబర్ నేరగాళ్లు అతని మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేసి, అతని క్రెడిట్ కార్డు ద్వారా రూ.44,921ను అక్రమంగా దోచుకున్నారు. డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ రావడంతో అప్రమత్తమైన బాధితుడు వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయంలోని సైబర్ సెల్‌ను ఆశ్రయించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సైబర్ సెల్ సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్ క్షణాల్లో స్పందించి, సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు సంబంధిత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. దర్యాప్తులో ఆ మొత్తంతో ఫ్లిప్‌కార్ట్‌లో రెండు మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేసినట్లు గుర్తించి, వెంటనే ఫ్లిప్‌కార్ట్ అధికారులతో సమన్వయం చేసి ఆ ఆర్డర్‌ను రద్దు చేయించారు. ఫలితంగా రూ.44,921 మొత్తాన్ని పూర్తిగా బాధితుడి ఖాతాలోకి తిరిగి జమ చేయగలిగారు.

ఇక రెండో ఘటనలో, ధరూర్‌కు చెందిన బి. కృష్ణకు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి, KYC పేరుతో ఫేక్ APK ఫైల్ పంపించారు. ఆ ఫైల్‌ను ఓపెన్ చేయడంతో అతని ఫోన్ హ్యాక్ అయి, కొద్దిసేపటికే రూ.15,696 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు జిల్లా సైబర్ సెల్‌ను సంప్రదించగా, సిబ్బంది వేగంగా స్పందించి సంబంధిత బ్యాంకులకు సమాచారం అందించి, నేరగాళ్లు డబ్బును విత్‌డ్రా చేయకముందే ఖాతాను ఫ్రీజ్ చేయించారు. దీంతో మొత్తం రూ.15,696ను సురక్షితంగా తిరిగి బాధితుడి ఖాతాలో జమ చేయించారు.

ఈ రెండు ఘటనలలో బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి స్వయంగా వచ్చి, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గారిని కలిసి, సైబర్ సెల్ సిబ్బంది వేగవంతమైన స్పందనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై స్పందించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, సైబర్ సెల్ సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్‌లను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే స్పూర్తితో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.

సైబర్ మోసాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులు, APK ఫైళ్లు, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

💥సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న రూ.1.75 లక్షలు రికవరీ-జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు..✍️గద్వాల (మార్చి 06): జోగుళాంబ గద్వ...
09/03/2026

💥సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న రూ.1.75 లక్షలు రికవరీ

-జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు..✍️

గద్వాల (మార్చి 06): జోగుళాంబ గద్వాల జిల్లాలో నమోదైన రెండు వేర్వేరు సైబర్ నేరాల కేసుల్లో బాధితులు కోల్పోయిన మొత్తంలో మొత్తం రూ.1,75,244 ను విజయవంతంగా రికవరీ చేసి వారి ఖాతాల్లో జమ చేయించామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.కోర్టు ఆదేశాలు, పోలీస్–బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో ఈ మొత్తాన్ని తిరిగి సాధించడం బాధితులకు పెద్ద ఊరటనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల్లో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గద్వాల్ న్యాయమూర్తి ధరావత్ ఉదయ నాయక్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అలంపూర్ న్యాయమూర్తి ఆర్.వి.ఎస్.ఎస్. మిధున్ తేజ రిఫండ్ ఆర్డర్లు జారీ చేశారు.
పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వచ్చిన లోన్ ప్రకటనను నమ్మి ఫీజుల పేరుతో రూ.88,244 చెల్లించి మోసపోయాడు. మరో ఘటనలో గద్వాల్ టౌన్ పరిధిలో టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెట్టి మోసం చేశారు.
బాధితులు 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కోర్టు మరియు బ్యాంకుల సహకారంతో మొత్తం రూ.1,75,244 ను రికవర్ చేసి బాధితుల ఖాతాల్లో జమ చేయించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజులు లేదా పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు సమాచారం అందిస్తే త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ రికవరీ ప్రక్రియలో కీలకంగా పనిచేసిన డిస్ట్రిక్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌చార్జ్ ఎస్సై తేజస్విని, సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, సైబర్ వారియర్లు ప్రహ్లాద్ రెడ్డి, రాజు లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్పీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Personal Cyber Hygiene For Citizens.Cyber cell Gadwal.
24/01/2026

Personal Cyber Hygiene For Citizens.
Cyber cell Gadwal.

గద్వాల పోలీసుల సత్వర చర్య : సైబర్ బాధితునికి 4.33 లక్షలు రికవరీ - జిల్లా ఎస్పీ.*జోగుళాంబ గద్వాల్ జిల్లా, మల్దకల్ పోలీస్ ...
09/12/2025

గద్వాల పోలీసుల సత్వర చర్య : సైబర్ బాధితునికి 4.33 లక్షలు రికవరీ - జిల్లా ఎస్పీ.*
జోగుళాంబ గద్వాల్ జిల్లా, మల్దకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ కేసులో బాధితుడు కోల్పోయిన అమౌంట్ లో రూ.4,33,000 మొత్తాన్ని విజయవంతంగా రికవర్ చేసి రిఫండ్ చేయించామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.
సైబర్ మోసంలో పోయిన ఈ మొత్తం, కోర్టు ఆదేశాలు మరియు పోలీసులు—బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో తిరిగి సాధించబడటం బాధితుడికి పెద్ద ఉపశమనంగా నిలిచింది.
ఈ కేసులో రిఫండ్ ఆర్డర్‌ను ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ ఎన్.వి.హెచ్ పూజిత జారీ చేశారు. అనంతరం డిస్ట్రిక్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్ సంబంధిత బ్యాంకు అధికారులతో సంప్రదించి మొత్తాన్ని బాధితుడి ఖాతాలో జమ చేయించారు.
క్రైమ్. నంబర్ 171/2025 గా నమోదు ఈ కేసులో, దర్యాప్తు మరియు ఫాలోఅప్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను, మల్దకల్ ఎస్‌ఐ నందీకర్, సైబర్ వారియర్ అడ్డాకుల నవీన్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ జ్యోతికాంత్ కీలక పాత్ర పోషించారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ, ఇలాంటి రికవరీలు ప్రజలలో నమ్మకం పెంపొందిస్తాయని, సైబర్ అవగాహన అనివార్యమని ఎస్పీ గారు పేర్కొన్నారు. సమయోచిత స్పందన, కోర్టు సహకారం కలిసి బాధితుడికి వేగంగా న్యాయం అందించాయని అన్నారు.
ఈ సందర్భంగా బాధితుడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఫిర్యాదుదారుడు ఒక ఫిర్యాదులో ఐదు లక్షల పైచిలుకు, మరొక ఫిర్యాదులు ఐదు లక్షలు పోయినట్టు ఫైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయగా అందులో గోల్డెన్ హవర్ లో అందిన ఫిర్యాదులో 4,33,000/- రికవరీ చేయడం జరిగింది. సైబర్ నేరం జరిగిన వెంటనే, మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే రికవరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ మొదటి గంటను “గోల్డెన్ అవర్” అంటాము అని ఎస్పీ గారు తెలిపారు.
ఈ కేసులో కీలక సేవలందించిన డి-4-సి సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, మల్దకల్ సైబర్ వారియర్ అడ్డాకుల నవీన్‌లను ఎస్పీ గారు అభినందించారు........పి ఆర్ ఓ
జిల్లా పోలీస్ కార్యాలయం,
జోగులాంబ గద్వాల జిల్లా.

*గద్వాల పోలీసుల సత్వర చర్య : సైబర్ బాధితునికి 4.33 లక్షలు రికవరీ - జిల్లా ఎస్పీ.*

జోగుళాంబ గద్వాల్ జిల్లా, మల్దకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ కేసులో బాధితుడు కోల్పోయిన అమౌంట్ లో రూ.4,33,000 మొత్తాన్ని విజయవంతంగా రికవర్ చేసి రిఫండ్ చేయించామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.

సైబర్ మోసంలో పోయిన ఈ మొత్తం, కోర్టు ఆదేశాలు మరియు పోలీసులు—బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో తిరిగి సాధించబడటం బాధితుడికి పెద్ద ఉపశమనంగా నిలిచింది.

ఈ కేసులో రిఫండ్ ఆర్డర్‌ను ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ ఎన్.వి.హెచ్ పూజిత జారీ చేశారు. అనంతరం డిస్ట్రిక్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్ సంబంధిత బ్యాంకు అధికారులతో సంప్రదించి మొత్తాన్ని బాధితుడి ఖాతాలో జమ చేయించారు.

క్రైమ్. నంబర్ 171/2025 గా నమోదు ఈ కేసులో, దర్యాప్తు మరియు ఫాలోఅప్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను, మల్దకల్ ఎస్‌ఐ నందీకర్, సైబర్ వారియర్ అడ్డాకుల నవీన్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ జ్యోతికాంత్ కీలక పాత్ర పోషించారు.

సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ, ఇలాంటి రికవరీలు ప్రజలలో నమ్మకం పెంపొందిస్తాయని, సైబర్ అవగాహన అనివార్యమని ఎస్పీ గారు పేర్కొన్నారు. సమయోచిత స్పందన, కోర్టు సహకారం కలిసి బాధితుడికి వేగంగా న్యాయం అందించాయని అన్నారు.

ఈ సందర్భంగా బాధితుడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఫిర్యాదుదారుడు ఒక ఫిర్యాదులో ఐదు లక్షల పైచిలుకు, మరొక ఫిర్యాదులు ఐదు లక్షలు పోయినట్టు ఫైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయగా అందులో గోల్డెన్ హవర్ లో అందిన ఫిర్యాదులో 4,33,000/- రికవరీ చేయడం జరిగింది. సైబర్ నేరం జరిగిన వెంటనే, మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే రికవరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ మొదటి గంటను “గోల్డెన్ అవర్” అంటాము అని ఎస్పీ గారు తెలిపారు.

ఈ కేసులో కీలక సేవలందించిన డి-4-సి సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, మల్దకల్ సైబర్ వారియర్ అడ్డాకుల నవీన్‌లను ఎస్పీ గారు అభినందించారు.
.......పి ఆర్ ఓ
జిల్లా పోలీస్ కార్యాలయం,
జోగులాంబ గద్వాల జిల్లా.

ఈ దీపావళికి మీ ఇంట్లో సంతోషాల దీపాలు వెలిగించండి. సైబర్ నేరాలపై మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. వారికి మోసాలపై అవగాహన పెం...
18/10/2025

ఈ దీపావళికి మీ ఇంట్లో సంతోషాల దీపాలు వెలిగించండి. సైబర్ నేరాలపై మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. వారికి మోసాలపై అవగాహన పెంచండి. కుటుంబాలను నాశనం చేసే బెట్టింగ్ భూతానికి దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. సంతోషాల వెలుగుల మధ్య దీపావళి సెలబ్రేట్ చేసుకోండి.
# Jogulamba Gadwal District Police

సైబర్ క్రైమ్  లో డబ్బులు పోగొట్టుకున్న  61 మంది బాధితులకు 17,26,363/- రూపాయాల రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేత.* సైబర్ క్రైమ్...
15/09/2025

సైబర్ క్రైమ్ లో డబ్బులు పోగొట్టుకున్న 61 మంది బాధితులకు 17,26,363/- రూపాయాల రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేత.*
సైబర్ క్రైమ్ కు గురై 69,06,133 రూపాయల పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా రిఫండ్ ఆర్డర్ కాపీలను అందజేసారు. ఇందులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అథారిటి కోర్ట్ ద్వారా 22 మందికి, జె.ఎఫ్.సి.ఎం. ఆలంపూర్, ప్రిన్సిపల్ జె.ఎఫ్.సి.ఎం. గద్వాల్, అదనపు జె.ఎఫ్.సి.ఎం. గద్వాల్ కోర్టులలో 39 మందికి రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేయటం జరిగింది.
సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 కు లేదా సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం ద్వారా ఆయా పోలీస్ స్టేషన్ లలో ఉన్నా సైబర్ వారియర్స్, జిల్లా సైబర్ క్రైమ్ బ్యూరో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాదితుల డబ్బును, సంబంధిత బ్యాంక్ అకౌంట్ లలో అమౌంట్ ను ఫ్రీజ్ చేసి, గద్వాల జిల్లాలోని వివిధ కోర్ట్ ల ద్వారా Rs. 17,26,363/- సంబంధించిన రిఫండ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా సైబర్ క్రైమ్ బ్యూరో వారు మాట్లాడుతూ ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సంబంధ పోలీస్ స్టేషన్లో గంటల్లోపు ఫిర్యాదు చేసే పోగొట్టుకున్న అమౌంట్ తిరిగి పొందేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ టౌన్ ఎస్సై కల్యాణ్, గద్వాల్ రూరల్ ఎస్సై శ్రీకాంత్, గట్టు ఎస్సై కే. టి. మల్లేశ్, ఆలంపూర్ ఎస్సై వెంకటస్వామి, కోదండపూర్ ఎస్సై మురళి, ఇటిక్యాల ఎస్సై రవి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కానిస్టేబుల్, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం
జోగులాంబ గద్వాల్ జిల్లా

Not every "friend request" is friendly!  predators are targeting children and teens know the signs, stay protected.     ...
11/08/2025

Not every "friend request" is friendly!

predators are targeting children and teens know the signs, stay protected.

వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే ఇన్వెస్టిమెంట్‌ టిప్స్‌ను నమ్మి అస్సలు మోసపోవద్దు. ఫేక్‌ స్క్రీన్ షాట్స్‌, నకిలీ ల...
31/07/2025

వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే ఇన్వెస్టిమెంట్‌ టిప్స్‌ను నమ్మి అస్సలు మోసపోవద్దు. ఫేక్‌ స్క్రీన్ షాట్స్‌, నకిలీ లింక్స్ తో మోసాలు చేస్తుంటారు జాగ్రత్త. పెట్టుబడులు అనేవి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అపరిచితులు చెప్పినవి నమ్మి ముందడుగు వేయొద్దు.
Dial 1930.

కేవలం మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఇంట్లో ఉంటూనే వేలు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మకండి. వర్క్‌ ఫ్రమ్‌ హోం జాబ్స్‌ విష...
31/07/2025

కేవలం మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఇంట్లో ఉంటూనే వేలు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మకండి. వర్క్‌ ఫ్రమ్‌ హోం జాబ్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ టాస్క్‌లు, మార్కెటింగ్‌తో డబ్బులు రావు. ఇలాంటి మోసాలపై అవగాహన పెంచుకోండి.
Dial 1930

Address

Gadwal
509125

Alerts

Be the first to know and let us send you an email when Jogulamba Gadwal Cyber Security Bureau posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category