𝐏𝐀𝐖𝐀𝐍𝐈𝐒𝐌

𝐏𝐀𝐖𝐀𝐍𝐈𝐒𝐌 యుద్ధం దశాబ్దం... శబ్దం శతాబ్దం 𝐉𝐀𝐍𝐀𝐒𝐄𝐍𝐀 𝐏𝐀𝐑𝐓𝐘 🎌 జనసేన పార్టీ 🎌

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమన్వయ కమిటీ
05/09/2026

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమన్వయ కమిటీ

పిఠాపురం ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రావణ మాస కానుక•10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ •శ్రీ పురు...
04/09/2026

పిఠాపురం ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రావణ మాస కానుక

•10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ
•శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
•అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం
•భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు
•భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళలు

పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా నియోజక వర్గంలోని ఆడపడుచులతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు మరోసారి చాటి చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమలను శ్రావణ మాస కానుకగా అందించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆడపడుచుల కోసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారిని పూజించారు.

• భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాచరణ
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్యక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మీ దేవిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి (బాబు), పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం గణపతి పూజ, కలశ పూజతో పాటు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, వరలక్ష్మీ స్తోత్రాలు, షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వరలక్ష్మీ వ్రత మహిమను వివరిస్తూ వ్రతకథను భక్తులకు వినిపించారు. నాలుగు విడతలుగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ మరియు మున్సిపల్ సిబ్బంది, జనసేన పార్టీ వాలంటీర్లు, సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా అందుబాటులో ఉంచారు.

• ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతమాచరించిన మహిళలు
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు వేలాది మంది మహిళా భక్తులు తరలిరావడంతో వేద పండితులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళలతో ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేశారు. తొలి విడతలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రెండో విడతను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. మూడో విడతలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, నాలుగో విడతలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, ఐదో విడత 10 గంటల నుంచి 11 వరకు వేద పండితులు మహిళలతో వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహింపజేశారు. ఏటా జరిగే విధంగానే సంప్రదాయాన్ని గౌరవిస్తూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించిన ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పసుపు, కుంకుమ, చీరలను కానుకగా పంపించారు.

ఈ కానుకలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండం దొరబాబు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పర్యవేక్షించారు. (1/2)

04/09/2026

నువ్వు చెప్పేది ప్రతిదీ నమ్మడానికి మేము YSRCP గొర్రెలం కాదు 🫵

జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు - JanaSena Chief shri Pawan Kalyan
02/09/2026

జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు - JanaSena Chief shri Pawan Kalyan

02/09/2026

⭐⭐⭐⭐⭐

02/09/2026

The Birthday Special Card for our beloved is here ! ❤️‍🔥

A heartfelt shoutout to our Power Fan for this stunning creation! ✨


02/09/2026

お誕生日おめでとうございます!

Firing Up Soon 🔫🔫🔫🔫

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి Birthday Wishes 🥰
02/09/2026

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి Birthday Wishes 🥰

సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇ...
02/09/2026

సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..


నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.

మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.

ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.

ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…

మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

అన్నయ్య
చిరంజీవి

"జై కొట్టు" - జనసేన పార్టీ యువజన విభాగం
02/09/2026

"జై కొట్టు" - జనసేన పార్టీ యువజన విభాగం

Address

Eluru
534002

Alerts

Be the first to know and let us send you an email when 𝐏𝐀𝐖𝐀𝐍𝐈𝐒𝐌 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to 𝐏𝐀𝐖𝐀𝐍𝐈𝐒𝐌:

Shortcuts

Share