I&PR

I&PR Information & Public Relation Department DIPRO_ELURU
Eluru,Andhra Pradesh,India

08/05/2026

8.5.2026_కేవలం పథకాలు మాత్రమే కాదు, రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తోంది. సకాలంలో ఆర్థిక సాయంతో పాటు, వినూత్న సాగు పద్ధతులు మరియు మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరుస్తూ అన్నదాతను రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.







08/05/2026

8.5.2026_పేదింటి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీగా 'దీపం' పథకాన్ని అమలు చేస్తోంది. సురక్షితమైన వంట ఇంధనాన్ని చేరువ చేయడం ద్వారా పేద కుటుంబాల్లో సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రగతికి పునాది అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.







08/05/2026

8.5.2026_విద్యే సమాజ మార్పుకు బలమైన పునాది. ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. ఈ ఏడాది IITలు, IIMలు, NITల్లో మన విద్యార్థులు సాధించిన ఫలితాలు గర్వకారణం. ఇక లక్ష్యం మరింత పెద్దది — ప్రతి వర్గానికి చెందిన పిల్లలు ఉన్నత విద్యలో రాణించేలా స్కేలింగ్ చేయాలి. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ఐక్యత… ఇవే అభివృద్ధికి నిజమైన మార్గాలు.







08/05/2026

8.5.2026_భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. మార్చి 2027 నాటికి సర్వే, సెక్యూరిటీ ప్రింటింగ్, బ్లాక్‌చైన్, QR కోడ్ ఆధారిత 100% పారదర్శక భూ వ్యవస్థను అమలు చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నాం. 22A భూముల పరిష్కారం, ప్రభుత్వ వివాదాస్పద భూముల క్లియరెన్స్, టోకనైజేషన్ ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే దిశగా ముందుకు సాగుతున్నాం.







08/05/2026

రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు నెలవారీ మానిటరింగ్ వ్యవస్థతో అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.

08/05/2026

9.5.2026_అటవీ శాఖలో డేటా సేకరణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
టింబర్, అటవీ నిర్వహణతో పాటు గిరిజనులు సేకరించే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్‌పై పూర్తి స్థాయి నమోదు జరగాలి.

వుడ్ ఇండస్ట్రీ సహా మొత్తం విలువను సమగ్రంగా అంచనా వేస్తే జిల్లాల ఆర్థిక సామర్థ్యం మరింత పెరుగుతుంది.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.

08/05/2026

8.5.2026_ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందడం వెనుక ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతమైన పనితీరు ఉంది.

రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ద్వారా ఉద్యోగుల పనితీరును, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వ్యవస్థలో పూర్తి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తున్నాం. డేటా ఆధారిత పర్యవేక్షణతో పనుల జాప్యాన్ని నివారిస్తూ, మెరుగైన ప్రజా సేవలను అందిస్తున్నాం.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.






Progress
AndhraPradesh

08/05/2026

8.5.2026_ప్రజల సమస్యలను స్వీకరించడమే కాకుండా, వాటిని డిజిటల్ రూపంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలి.

ఇది ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతను తెలియజేయడమే కాకుండా ప్రజలకు భరోసా కల్పించనుంది.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.







08/05/2026

8.5.2026_వాట్సాప్‌ మనమిత్ర సేవల్ని ప్రజలు ఉపయోగించుకునేలా గైడ్‌ చేయాలి. అందుబాటులో ఉన్న అన్ని పౌర సేవల్ని ప్రజలకు వివరించాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వ సేవల్ని సకాలంలో పొందుతారు.

7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.







08/05/2026

8.5.2026_అల్లూరి సీతారామరాజు జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

హార్టికల్చర్, పశుసంవర్ధక రంగాలు జిల్లాకు ఆధారాలుగా నిలుస్తుండగా, టూరిజం మరియు సేవల రంగాల్లో అవకాశాలను గుర్తించారు.

డేటా ఆధారిత ప్రణాళికలతో ప్రతి రంగంలో చర్యలు చేపడుతూ, స్థానిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు కృషి జరుగుతోంది.

Address

Deputy Executive Information Engineer, I&PR Dept.
Eluru
534001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

08812231061

Website

Alerts

Be the first to know and let us send you an email when I&PR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share