22/07/2020
పేదలకు అందని ఇళ్ళు - లబ్ధిదారులకు అందించేవరకూ ఉద్యమిస్తామంటున్న బిజెపి - జనసేన....
గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాల వల్లే నిరుపేదలకు కేంద్రం ఇస్తున్న ఇళ్ళు చేరటంలేదని ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన, బిజెపి పార్టీలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి.
ది 22-07-2020, బుధవారం ఉ. 10 గం.కు స్తానిక పోణంగి రోడ్డులోని పేదలకు నిర్మించిన 6400 ఇళ్ళ PMAY హౌసింగు కాలనీ వద్ద జరిగిన "ధర్నా" కార్యక్రమానికి స్తానిక జనసేనపార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు మరియూ జనసైనికులు, పెద్దఎత్తున వచ్చి పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జన సైనికుడు విధిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ పాల్గొనటం జరిగింది.
కేంద్రంలో బిజెపి పార్టీ వచ్చిన తరువాత ఇళ్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో మనరాష్ట్రానికి 3 లక్షల 10 వేల ఇళ్లకు 22 వేల కోట్ల రూపాయలలో 10 వేల 700 కోట్లను గత టిడిపి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ళ నిర్మాణం సక్రమంగా జరగలేదు కానీ, ఇళ్లను నిర్మించినట్టు చెప్పుకుంటున్న గత టిడిపి ప్రభుత్వం మరి లబ్ధిదారులకు ఎందుకు పంచలేదో చెప్పాల్సిన అవసరం ఉందని జనసేన బిజెపి పార్టీలు సంయక్తంగా ప్రశ్నించాయి.
ప్రస్తుత ప్రభుత్వం పేదలకు కట్టించిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా 14 నెలలుగా నిర్లక్ష్యంచేస్తూ రావడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర నలుమూలలా కట్టిన 241368 గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో కాలనీలన్నీ గడ్డి మొక్కలు మొలిచి అడవులను తలపిస్తున్నాయి. నిర్మించిన బిల్డింగులు అన్ని శిథిలావస్థకు చేరుకుని పాములకు, జంతువులకూ ఆవాసాలుగా మారుతున్నాయి.
ఈ విధమైన పీఎంఏవై స్కీమ్ ద్వారా నిర్మించబడిన బిల్డింగులు మూడు కేటగిరీలుగా నిర్వహించబడ్డాయి 300 చ.అడుగులు 365 చ.అడుగులు , 430 చ.అడుగులుగా ఉన్న ఈ బిల్డింగులు 6:50 లక్షలు , 8 లక్షలు , 9 లక్షల రూపాయలుగా నిర్ణయించబడినవి. వాటికి సంబంధించి కేంద్రం 1 .5 లక్షల రూపాయలు, రాష్ట్రం 1 లక్ష రూపాయలు, మిగిలినవి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అతని పేరున కంట్రిబ్యూషన్ గా బ్యాంకు నుంచి రుణం ఇప్పించడం జరిగింది.
మరి ఈ నిర్మించబడిన గృహాలను లబ్ధిదారులకు సమయానికి ఇవ్వకపోతే వారు ఆ రుణానికి సంబంధించిన అసలును, వడ్డీలను కట్టుకుంటూ ఒకవైపు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ మరోవైపూ నలిగిపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారి ఇబ్బందులను గమనించి వారికి తొందరగా ఆ గృహాలను ఇవ్వవలసిందిగా జనసేన బిజెపి పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
ఈ విషయం మీద చర్య తీసుకోనకపోతే లబ్ధిదారుల న్యాయం కోసం జనసేన బిజెపి పార్టీలు ఇంకా గట్టిగా ఉద్యమిస్తామని స్తానిక జనసేనపార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు తెలియజేసారు. ఈ ధర్నా కార్యక్రమంలో నగర అద్యక్షుడు నాగిరెడ్డి కాశీ నరేష్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీసాగర్, మరియు బొండా రాము, పి.లక్ష్మణ్ రావు, ములికి శ్రీనివాస్, భాస్కర్, వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, నాని, దిలీష్, ప్రకాష్, వెంకటేష్, రాకేష్, చందు, ధీరు, రమేష్, చిరంజీవి, సాయికుమార్, పండు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు: జనసేన పార్టీ కార్యాలయం. ఏలూరు. Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni JanaSena Veera Mahila