Telangana State Education Employment and Reservation Society TS MEER

  • Home
  • India
  • Dulapalli
  • Telangana State Education Employment and Reservation Society TS MEER

Telangana State Education Employment and Reservation Society TS MEER Telangana State Education Employment and Reservation Society (TS MEER) State President
Professor Dr. Ghanapuram Mallesham Mudiraj

First American (India) Pvt Ltd Pool campus virtual/ online recruitment  drive for B.Tech-2022 Passed outs  (CSE,IT,ECE, ...
07/11/2022

First American (India) Pvt Ltd Pool campus virtual/ online recruitment drive for B.Tech-2022 Passed outs (CSE,IT,ECE, EEE With 60% and above & M.Tech ( Computer Science & Engineer, Information Technology , Cyber Forensic & Information Security, VLSI & Embedded Systems, Power Electronics, Digital Communication )!
Company will share the test link to eligible students only!

Drive organised by Placement cell-Marri Laxman Reddy institute of Technology & Management, Hyderabad.

Dear Sir/ Madam

Greetings from Marri Laxman Reddy institute of Technology & Management,Hyderabad.

it gives us a pleasure to inform you that

First American (India) Pvt Ltd Pool campus virtual/ online recruitment drive for B.Tech-2022 Passed outs (CSE,IT,ECE, EEE With 60% and above ! company will share the test link to eligible students only! Drive organized by Placement cell-Marri Laxman Reddy institute of Technology & Management, Hyderabad.

Note : Company HR will shortlist the students out of Total registered students and test link will be shared by the company to the shortlisted students only. College will not be responsible for shortlisting the students. No queries about the same will be entertained.

If the candidate does not receive the mail till the last date, it will indicate that company has not shortlisted the candidate. Non shortlisted candidates should not contact anybody. It will be completely company's decision to shortlist the students (Company has not revealed all the details and want to reserve the right solely to shortlist the candidates).

Registration Link:

https://docs.google.com/forms/d/e/1FAIpQLSe-PoD9iv1wuVnFlpv8LDpoNSVlfJWcD_GQMn5q4QAqgvpZdg/viewform?vc=0&c=0&w=1&flr=0&usp=mail_form_link

Please find the below details:

Profile: Technical Trainee

Eligible Batch : 2022

Eligible Degree :- B.E. / B.Tech, MCA & M.Tech

Eligible Branch : CSE/IT/ ECE/EEE
Salary: INR 4,40,000 ( Both UG &PG)
Joining Location: Hyderabad
UG -BE- Branches considered for Campus hiring
1. Computer Science,
2. Information Science,
3. Information Technology
4. Electronics & Communication
PG- M.Tech Branches considered for Campus hiring

1. Computer Science & Engr,
2. Computer Network Engr,
3. Cyber Forensic & Information Security,
4. VLSI & Embedded Systems,
5. Power Electronics, Digital Communication

Selection procedure
1 Online Test
2. Technical Round Interview
3. Managerial Round Interview
4. HR Interview

Mode of test (Online/Paper pen) : Online
Pattern of test (Please provide the sections/modules included in the test Eg. Quants, Logical, Verbal, Technical -MCQs,Technical - Coding)
1. Quantitative Ability
2. English Comprehension
3. Logical Ability
Job Description :
1. Should have an aggregate of 60% and more
2. Excellent written and verbal communication skills
3. Good analytical skills and a penchant to learn cutting edge technology
4. Quick on the feet and go-getter attitude
5. Basic concepts of programming languages
6. Basic knowledge of OOPS, Data Structures and Algorithms
7. Prior training/projects in Microsoft Technologies would be an added advantage.
Competencies:
1. Understands and meets stated needs & requirements of the stakeholders, brings contextual nuances in deliverables and work output to truly partner with all concerned stakeholders.
2. Adapts to other cultures and unfamiliar situations, thinks on the feet & displays sense of urgency for completion of deliverables.
3. Displays excellent verbal and written communication skills and interpersonal skills required to interact with colleagues including customer, onshore counterpart, supervisors, team members, business analysts and business teams.

Type of Job offered ( Full Time /Internship cm Full Time/Only Internship) : Full Time Only

Dear Sir/ Madam Greetings from Marri Laxman Reddy institute of Technology & Management,Hyderabad. it gives us a pleasure to inform you that First American (India) Pvt Ltd Pool campus virtual/ online recruitment drive for B.Tech-2022 Passed outs (CSE,IT,ECE, EEE With 60% and above ! company will shar...

13/10/2022

Dr. Mallesham Ghanapuram

12/10/2022

*తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల సమితి(TS MEER) గ్రామాల పర్యటనలో భాగంగా మరో భారీ కార్యక్రమం.*
ఈరోజు బందారం దర్గా గ్రామంలో గ్రామ ముదిరాజ్ బంధువులు మరియు
ముదిరాజ్ సోదరులతో సమావేశం కావడం జరిగింది.
ఈ సమావేశంలో ముదిరాజులకు విద్య ఉద్యోగాల యొక్క ఆవశ్యకత మరియు ముదిరాజులు ఐక్యంగా ఒకే మాట పై ఉండి ముదిరాజ్ జాతి అభివృద్ధికి తోడ్పడాలని, తెలంగాణ రాష్ట్ర జనాభాలో సుమారు 52 లక్షల జనాభా కలిగినటువంటి ముదిరాజులు రాజ్యాధికారం వైపు ప్రయాణించాలంటే గ్రామస్థాయిలోని ముదిరాజుల ఐక్యంగా ఉండి పోరాటం చేసినప్పుడే మన హక్కులు సాధించుకోవడం సాధ్యమైతుందని వివరించడం జరిగింది.
ఈ గ్రామాల పర్యటనలో భాగంగా ఈరోజు ముదిరాజు బంగారం దర్గా గ్రామ ముదిరాజులకు కొన్ని విషయాలపై అవగాహన కలిగిస్తూ దిషానిర్దేశం చేయడం జరిగింది.

దీనితోపాటు గ్రామస్థాయిలో ఒక ఐక్య కార్యాచరణ కమిటీ(JAC)ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పెద్దమ్మ తల్లి సాక్షిగా కొండపాక గ్రామ ముదిరాజ్ ప్రజలు ప్రమాణం చేయడం జరిగింది.
దర్గా గ్రామంలో ముదిరాజ్. J. A. C ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ విద్య ఉద్యోగ రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గణపురం మల్లేశం ముదిరాజ్, ఉపాధ్యక్షులు పడిగే భాస్కర్ ముదిరాజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సురేష్ ముదిరాజ్, సిద్దిపేట జిల్లా కార్యదర్శిలు అంకుష్ ముదిరాజ్ గణపురం యాదగిరి ముదిరాజ్, లీగల్ సెల్ అధ్యక్షులు అడ్వకేట్ బాబు ముదిరాజ్, కొండపాక మండల కమిటీ సభ్యులు ముద్దపురం బిక్షపతి కొండపాక జేఏసీ అధ్యక్షులు చెన్న హరికృష్ణ ముదిరాజ మరయు వీరి ఆధ్వర్యంలో దర్గా ముదిరాజ్ jac కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది . అధ్యక్షులుగా మైలారం శేఖర్ ముదిరాజ్ ల ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
పై కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ విద్య ఉద్యోగ రిజర్వేషన్ల సమితి ( TS MEER) వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గణపురం మల్లేశం ముదిరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించడం జరిగింది.

29/01/2022
*ప్రశ్నార్థకంగా మారునున్న ముదిరాజ్ భావితరాల భవిష్యత్తు?* "పావు సేరు సారా పావుకిలో కార" పేరుతో ముదిరాజుల రిజర్వేషన్లు, రా...
29/01/2022

*ప్రశ్నార్థకంగా మారునున్న ముదిరాజ్ భావితరాల భవిష్యత్తు?*

"పావు సేరు సారా పావుకిలో కార" పేరుతో ముదిరాజుల రిజర్వేషన్లు, రాజ్యాధికారాన్ని ప్రశ్నార్థకంగా మార్చి రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన నా జాతిని మీ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న పాలకవర్గ పాలకులారా.....!

ఇంటి దొంగను ఈశ్వరుడెరుగడు అన్న చందంగా, తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన చందంగా... కొందరు జాతి జన బలాన్ని అడ్డుపెట్టుకుని అందలమెక్కి, మీ స్వలాభాలకోసం, స్వార్థపూరిత రాజకీయాల కోసం, నామినేటెడ్ పదవుల కోసం జాతి ఆత్మగౌరవాన్ని, ఆశయాలను పాలకవర్గం పాదాలవద్ద తాకట్టు పెట్టిన నీతి జాతి లేని నయవంచక నాయకుల్లారా.....!

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగస్తులై ఉన్నత పదవులనుభవిస్తూ పే బ్యాక్ టు యువర్ సొసైటీ అనే పదానికి అర్ధాన్ని మరచిన ఉపాధ్యాయ, ఉద్యోగస్తులా రా......!
వ్యాపార, పారిశ్రామిక వేత్తలు గా ఎదిగి మీ స్వలాభాలకోసం జాతి శ్రేయస్సు మరచి, పాలక వర్గ పాదాలచెంత ప్రణమిల్లు తున్న వ్యాపారవేత్తలారా.......!

ప్రపంచ చరిత్రలో విద్యార్థిలోకం తమ భుజస్కంధాలపై ఎత్తుకున్న ఏ ఉద్యమమైనా నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని తెలిసి కూడా మీస్వలాభాలకోసం అనుబంధ సంఘాలు గా మారి .. జాతి కోసం జాతీయ ఉద్యమాన్ని భుజాల ఎత్తుకోవడం మరచి రాజకీయ నాయకుల అడుగులకు మడుమలొత్తుతున్న విశ్వవిద్యాలయ విద్యార్థులారా......!
హీనాతి, హీనమైన, దీనస్థితిలో బ్రతుకు వెళ్లదీస్తున్న మన జాతి బిడ్డల ఆర్తనాదాలు వినిపిస్తున్నా.... జాతిని మేల్కొలిపి ఉద్యమాలకు ఊపిరి పోయాల్సిన మీరు మీ స్వప్రయోజనాల కోసం రాజకీయ నాయకులకు భజన మండలులు గా మారిన కవులు, కళాకారులారా....! జాతిని మేల్కొలిపే మీ కళాలు, గళాలు మూగ పోయాయా....!
రాష్ట్ర రాజకీయాల్నే కాక దేశ రాజకీయాలను సైతం మీ కలం గళం ద్వారా మార్చగలిగే మహోన్నత శక్తి కలిగిన మీడియా మిత్రులారా......!
ఇకనైనా మీ స్వార్థపూరిత స్వప్రయోజనాలకు స్వస్తి చెప్పి నిరాశా, నిస్పృహలకు లోనై నిరుద్యోగ, అవిద్య ఆకలిదప్పులతో అలమటిస్తున్న మన జాతి ఘన చరిత్రను, ఘనమైన చరిత్రను, పూర్వవైభవాన్ని పుణికిపుచ్చుకునే కార్యక్రమాన్ని మీ భుజస్కంధాలకు ఎత్తుకుంటారని ఆశిస్తూ ......,....
మీ
*ప్రొఫెసర్ డాక్టర్ ఘనపురం మల్లేశం ముదిరాజ్*
తెలంగాణ రాష్ట్ర విద్య ఉద్యోగ రిజర్వేషన్ల సమితి( *TS MEER* ) రాష్ట్ర అధ్యక్షులు
Ph.no: 9866003091
[email protected]

*అధికార పార్టీపై ముదిరాజుల లో అసంతృప్తి* శ్రీ ఈటెల రాజేందర్ గారిని మంత్రివర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి తొలగించడం, ము...
18/01/2022

*అధికార పార్టీపై ముదిరాజుల లో అసంతృప్తి*
శ్రీ ఈటెల రాజేందర్ గారిని మంత్రివర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి తొలగించడం, ముదిరాజ్ మత్స్యకారులను ఇబ్బంది పెట్టే విధంగా జీవో నెంబర్ 74 మరియు జీవో నెంబర్ 43 ల ను తీసుకురావడం, ముదిరాజులకు బిసి వర్గీకరణలో జరిగిన అన్యాయాన్ని తొలగించే దిశలో గౌరవ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నడుస్తున్న కేసులో, ప్రభుత్వం తరఫున స్పందన లేకపోవడం మొదలైన అంశాలు రాష్ట్రంలో అత్యధిక జన సంఖ్య కలిగిన ముదిరాజ్ జాతికి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని భావన పురికొల్పింది శ్రీ ఈటెల రాజేందర్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని ముదిరాజులందరికీ వారి సమస్యల అయినటువంటి విద్య ఉద్యోగం రిజర్వేషన్లు మరియు జనాభా దామాషా పద్ధతిన రాజ్యాధికారంలో వాటా కోసం ఐక్యంగా ఉద్యమించడా నికి అవకాశం ఏర్పరిచింది.

దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా విద్య ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో తమకు రావలసిన కనీస ఫలాలు లేదనే ఆవేదన లో ఉన్న ముదిరాజులను టిఆర్ఎస్ కుటుంబ పాలన తట్టిలేపింది. వ్యక్తిగత ప్రలోభాలకు కు లుంగి పోయి చుట్టేస్తూ వస్తున్న ముదిరాజులు సొంత సామూహిక సమస్యలయిన విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లు మరియు రాజ్యాధికారంలో వాటా లపై సోయి తెచ్చుకుంటున్నారు. ముదిరాజుల ఓటు బలాన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. కానీ ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కంటే ముందు ఉద్యమంలో మరియు ఉద్యమం తర్వాత మీ వెంట నడిచిన సుమారు 15 శాతం రాష్ట్రవ్యాప్త ఓటు బలం గల ముదిరాజులను టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని అన్న కత్తి ప్రయత్నం చేస్తుందని ముదిరాజ్ జాతిలో బలంగా నాటుకుపోయింది.

తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 25 నియోజకవర్గాల్లో గెలవగలిగి 20 నియోజకవర్గాలలో గెలుపోటములను శాసించే శక్తి ముదిరాజుల లో ఉందని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ సమితి( TS MEER) బలంగా విశ్వసిస్తోంది.
నేటికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది గ్రామాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి గాని ఒక డాక్టర్ గాని ఒక పారిశ్రామికవేత్త గానీ లేరు ముదిరాజ్ జాతి తరఫున లేరు.
ఉదాహరణకు స్వయం వానమన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వగ్రామము చింతమడక లో 2,400 ఓట్లలో 1,600 ఓట్లు ముదిరాజులవే, నేటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగి గాని ఒక డాక్టర్ గాని ఒక పారిశ్రామికవేత్త గాని లేరు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల వెనుకబాటుతనానికి ఇంతకంటే ఇంకా పెద్ద ఉదాహరణ ఏమి చూపించాలి.

మిమ్మల్ని అడగని ముస్లిం రిజర్వేషన్ల గురించి కేంద్రానికి నివేదించిన మీరు, రాష్ట్రంలోని ముస్లింల కంటే ఎస్సీ ఎస్టీల కంటే సంఖ్యలో ఏమాత్రం తీసిపోని ముదిరాజుల విద్య ఉద్యోగ రిజర్వేషన్లలో వారి భాగస్వామ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు. వాతం లక్ష్మమ్మ పాలు తాగి పెరిగానని చెప్పుకునే మీలాంటి రాజకీయ రాజకీయవేత్తకు.

2004లో కనుచూపుకందనంత దూరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దెనె క్కించేందుకు నాడు స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ముదిరాజులను బి సి - డి నుండి బి సి - ఏ లోకి మారుస్తానని వాగ్దానం చేయడం ద్వారా అధికారంలోకి వచ్చిన సంగతి మన కళ్ల ముందు ఉంది.

నేడు ముదిరాజులకు విద్య ఉద్యోగ రిజర్వేషన్లు మరియు రాజ్యాధికారం లో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించిన పార్టీల గద్దెను కదిలించగల అనేది సుస్పష్టము. అధికార పార్టీలో చట్టసభల్లో అత్యధిక జనాభా గల ముదిరాజులకు ప్రాతినిధ్యం లేకపోవడమనేది వారిని ఎంత ఆవేదనకు, ఆక్రోశానికి గురిచేస్తుందో అర్థం చేసుకోగలరని భావిస్తూ.
మీ
*ప్రొఫెసర్ డాక్టర్ గణపురం మల్లేశం ముదిరాజ్*
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ విద్య ఉద్యోగ రిజర్వేషన్ల సమితి( *TS MEER* ) రాష్ట్ర అధ్యక్షులు.
9866003091
[email protected]

14/01/2022

రాజకీయ వ్యవస్థలో నాయకత్వం అనేది కులాల పునాదులపైనే ఏర్పడుతుంది. దీనికి ఎలాంటి అత్యున్నత అర్హతలు అవసరం లేదు. కేవలం క్షేత్ర స్థాయిలో స్వయా నుభవంతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ, అన్వేషిస్తూ, పరిశీలిస్తూ, పరిశోధిస్తూ ముందుకెళితే సరిపోతుంది. ఇక్కడ స్వప్రయోజనాలను ఆశించకుండా సమాజ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తే జనం మెచ్చిన నాయకుడు అవుతాడు అనే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో 2023 లో వచ్చే ఎన్నికలలో కుల సంఘాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సమిష్టి పని తత్వాన్ని అలవర్చుకొని దృఢంగా కుల సంఘ నిర్మాణం చేసుకుంటూ పోతే, కుల జనాభా ప్రాతిపదికన అవకాశాలు వచ్చే అవకాశం కలదు దీని ద్వారా అభివృద్ధితోపాటు సమాజ అభివృద్ధి జరిగే అవకాశం కలదు.

ముదిరాజులకు రాజకీయ అవకాశాలు రాకపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది వివిధ రాజకీయ పార్టీలు మరియు అగ్రవర్ణాలు ముదిరాజులను విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పాటించడం వలన సరైన అవకాశాలు రాక రాజకీయాలకు ముదిరాజులు కూతవేటు దూరంలో నిలిచిపోయారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ముదిరాజ్ జాతి కోసం పని చేస్తున్నటువంటి వివిధ సంస్థలు/ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఐక్యకార్యాచరణ ఏర్పాటు చేసి సంఘాలు/సంస్థల నాయకులు వారి స్వప్రయోజనాలకు విలువనివ్వకుండా తన జాతి అభివృద్ధి కోసం పాటుపడుతూ ముదిరాజు ఆత్మ బంధువుల ప్రేమాభిమానాలను నమ్మకాన్ని పొందిన రోజు మన జాతికి రాజకీయంగా అవకాశాలు వచ్చే అవకాశం కలదు మరియు తద్వారా ఉద్యోగ మరియు రిజర్వేషన్లు సాధించుకునే అవకాశం లభిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కుల సంఘాలు అనేటివి 1920లలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ కాలంలోనే ఏర్పాటు అయినవి. తెలంగాణ ముదిరాజ్ జాతి జనాభా పెరుగుదల కారణంగా వివిధ సంఘాలు సంస్థల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఈ పరిణామం స్వాగతించదగ్గదే అయినప్పటికీ ఆయా సంస్థలు సంఘాలలో ఐక్యత కొరవడి ఉమ్మడి కార్యాచరణ చేపట్టకపోవడం అనేది మన జాతికి ఒక శాపంగా మారింది.

ప్రస్తుతం మన ముదిరాజులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ముఖ్యమైనవి *విద్య, ఉద్యోగం రిజర్వేషన్లు, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో వెనుకబాటుతనం* . పై సమస్యల సుడిగుండములో నుండి మన జాతిని రక్షించుకోవాలంటే ఏదో ఒక సంస్థ లేదా సంఘం వల్ల అయ్యే పని కాదు.

2009లో తెలంగాణ మలిదశ పోరాటములో లాగ వివిధ ముదిరాజ్ సంస్థలు సంఘాలు వారి వారి జెండాలు, అజెండాలు పక్కనపెట్టి *పైన పేర్కొన్నటువంటి ఉమ్మడి సమస్యల సాధన కోసం ఐక్యకార్యాచరణ ( JAC) చేపట్టి ఉమ్మడి కార్యాచరణను* ఏర్పరచుకొని విద్యార్థి లోకాన్ని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ప్రణాళికాయుతంగా అమలు పరుస్తూ ఒక మహోద్యమంగా మార్చగలిగిన నాడు మన జాతిలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించే అవకాశాలు కలవని నా నమ్మకం

ఇట్లు
మీకు సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలతో
మీ
*ప్రొఫెసర్ డాక్టర్ గణపురం మల్లేశం ముదిరాజ్. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ విద్య ఉద్యోగ రిజర్వేషన్ల సమితి (TS MEER) రాష్ట్ర అధ్యక్షులు*
9866003091, 7981083988
email: [email protected]

06/01/2022

Address

Dulapalli
500010

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana State Education Employment and Reservation Society TS MEER posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category