02/06/2026
ఈ మాలోకాని పిడుగురాలలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని పార్టీ మారి వైసీపీలోకి వెళ్లాడు.
ఇప్పుడు వైసీపీలో కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అక్కడి నుంచి అద్దంకికి వచ్చాడు. అక్కడ కూడా "మనకు అద్దంకికి పంపడానికి ఇంకెవ్వరూ దొరకలేదు కదా" అని వాళ్ళ పార్టీ భావించి ఇతనికి అవకాశం ఇచ్చారు.
అద్దంకికి వచ్చాక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండటంతో అక్కడి ప్రజలు కూడా ఇతన్ని పట్టించుకోవడం మానేశారు. అందుకే ఎలాగైనా హైలైట్ కావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుల వీడియోలతో రీల్స్ చేసుకుంటూ ప్రచారం పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
దొనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఒక డాక్టర్‌పై, అక్కడే పనిచేస్తున్న ఓ ముస్లిం మహిళ గత కొంతకాలంగా గొట్టిపాటి లక్ష్మి గారికి ఫిర్యాదు చేస్తూ వస్తే, ఆమె అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. అందులో తప్పేముంది?
"ఏ అధికారంతో వెళ్లారు?" అని అడుగుతున్నావు కదా. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును పరిశీలించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. ఈ విషయం కూడా తెలియకుండా రాజకీయాల్లో ఎలా ఉన్నావు,
ఒక ముస్లిం మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె అభ్యర్థనపై ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గొట్టిపాటి లక్ష్మి గారు వెళ్లారు.
అక్కడ డాక్టర్ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇంకా జగన్ ఫోటో ఉంచడం గమనించి, "ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదు?" అని ప్రశ్నించారు. అందులో డాక్టర్ మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి? కళ్లముందు కనిపిస్తున్న విషయాన్నే అడిగారు.
అక్కడ డాక్టర్ తన విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఫింగర్ ప్రింట్ వేసి ఆసుపత్రి నుంచి వెళ్లిపోతున్నాడని స్థానిక ప్రజలు చాలా కాలంగా గొట్టిపాటి లక్ష్మి గారికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, ఒక బాధ్యత గల పౌరురాలిగా లక్ష్మి గారు ఆసుపత్రిని సందర్శించారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై స్పందించడం తప్పు కాదు, ప్రజా సేవకురాలుగా మరియు బాధ్యత గల పౌరురాలిగా ఆమె కర్తవ్యం.
మీ జగన్ ఫోటో తీసేయమన్నందుకే ఈ కపట నాటకాలు ఆడుతున్నావా?
మళ్లీ కామెంట్ రూపంలో నిన్ను ప్రజలు ఎండ కడతారని తెలుసుకొని కామెంట్ చేయడానికి ఆప్షన్ లేకుండా చేసావ్!! ఇంత పిరికివాడికి వీడియోలు ఎందుకో??
నువ్వు మర్చిపోయిన విషయం ఏంటంటే, గొట్టిపాటి లక్ష్మి గారు కూడా కష్టపడి చదివి డాక్టర్ అయిన వ్యక్తే. ఒక డాక్టర్‌ను ఎలా గౌరవించాలో ఆమెకు తెలియదా? నువ్వు మాత్రం పెద్ద పెద్ద సూక్తులు చెబుతున్నావు!
గొట్టిపాటి లక్ష్మి గారు ఇలాంటి ఉడత ఊపులకు భయపడే రకం కాదు అని తెలుసుకో. కనీసం నీలాంటి వాళ్ళని పట్టించుకునే వ్యక్తి కూడా కాదు!!