15/05/2026
పూతలపట్టులో మే 22న భారీ జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ
చిత్తూరు, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో పూతలపట్టు నియోజకవర్గంలో మే 22, 2026 (శుక్రవారం) నిర్వహించనున్న జాబ్ మేళా–2026 పోస్టర్లను జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఆవిష్కరించారు.
ఈ జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సుమారు 1,500కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండగా, అర్హత మరియు ఉద్యోగాన్ని బట్టి వార్షిక వేతనం రూ.6 లక్షల వరకు ఉండనుంది.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా@, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన వారు (పాస్/ఫెయిల్) ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. ఫ్రెషర్స్, అనుభవజ్ఞులు, ఉద్యోగార్థులు మరియు కోర్సులు పూర్తిచేస్తున్న విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు.
ఐటీ, బీపీఓ, తయారీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, రిటైల్, లాజిస్టిక్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.
జాబ్ మేళా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పి.కొత్తకోట, చిత్తూరు జిల్లాలో నిర్వహించబడుతుంది. నమోదు పూర్తిగా ఉచితం.
ఆసక్తి గల అభ్యర్థులు ముందస్తుగా నమోదు చేసుకుని, సంబంధిత విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 8465830771, 8866661096, 9988853335.cmo andhrapradesh