Janasena chittoor

Janasena chittoor ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే ?

30/06/2024
చిత్తూరు చరిత్రలోనే సంచలనం చిత్తూరు పుర వీధుల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి మార్నింగ్ వాక్ విత్ చిత్తూరు సిటిజెన్....
30/06/2024

చిత్తూరు చరిత్రలోనే సంచలనం

చిత్తూరు పుర వీధుల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి మార్నింగ్ వాక్ విత్ చిత్తూరు సిటిజెన్.

ఇవాళ ఉదయాన్నే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 31, 32వ డివిజన్లలోని స్థానిక రాంనగర్ కాలనీ మరియు వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు మరియు చిత్తూరు నగర పురపాలక అధికారులతో కలిసి ఆ ప్రాంత వీధుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన మరియు ఇప్పుడు తన దృష్టికి వస్తున్న తాగు నీరు, డ్రైనేజీ కాలవలు, వీధులు, వీధి దీపాలు వంటి సమస్యలను, ఇతర సమస్యలను చిత్తూరు నగర పురపాలక కమిషనర్ మరియు ఇతర అధికార యంత్రాంగానికి వివరించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించవల్సిందిగా సూచనలు చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు.

చిత్తూరు నగరపాలక సంస్థ 31 వ డివిజన్ లో పారిశుధ్యం పై సమీక్షించిన డివిజన్ జనసేన ఇంచార్జీ లోచన్ శ్రీరామ్ శుక్రవారం చిత్తూర...
28/06/2024

చిత్తూరు నగరపాలక సంస్థ 31 వ డివిజన్ లో పారిశుధ్యం పై సమీక్షించిన డివిజన్ జనసేన ఇంచార్జీ లోచన్ శ్రీరామ్ శుక్రవారం చిత్తూరు నియోజక వర్గ శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికుల తో సమీక్షించి వారి సాధక బాధకాలు అడిగితెలుసుకున్న లోచన్ శ్రీరాం అక్కడ కార్మికులకు పుష్కాట్ మరియు డస్ట్ బిన్ లు సక్రమం గా లేవని గుర్తించారు అలాగే స్థానికులకు చెత్త బండి వచ్చినప్పుడు చెత్త వేయాలి కానీ రోడ్డులో ఇతరులకు ఇబ్బంది కల్గించరాదని కోరారు పరిశీలనలో తెలిసిన విషయాలు MLA దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చేపడతామని కార్మికులకు స్పష్టం చేశారు.

*చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు  నగరం రామనగర్ కాలనీ 32 వ డివిజన్ లో ఆ డివిజన్ జనసేన పార్టీ ఇంచార్జి ఆరణి అంజలి ఉమ్మడి అభ్...
02/05/2024

*చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు నగరం రామనగర్ కాలనీ 32 వ డివిజన్ లో ఆ డివిజన్ జనసేన పార్టీ ఇంచార్జి ఆరణి అంజలి ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు*

చిత్తూరు నియోజికవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ గురజాల జగన్ మోహన్ గారి సతీమణి శ్రీమతి ప్రతిమ గారు, ఎన్నికల...
26/04/2024

చిత్తూరు నియోజికవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ గురజాల జగన్ మోహన్ గారి సతీమణి శ్రీమతి ప్రతిమ గారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరం రాంనగర్ కాలనీ 31, 32వ వార్డుకు విచ్చేయగా, జనసేన పార్టీ నాయకులు అరణి అంజలి గారు, లోచన్ శ్రీరామ్ గారు, ధీరజ్ దుద్ది గారు జనసేన పార్టీ , తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమం లో పాల్గోన్నారు.


జనసేన పార్టీ
చిత్తూరు నియోజికవర్గం

*పారదర్శకమైన ఎన్నికల నిర్వాహనకు జిల్లా ఎస్పీ గారిని కోరిన చిత్తూరు జనసేన పార్టీ నాయకులు*ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు...
20/04/2024

*పారదర్శకమైన ఎన్నికల నిర్వాహనకు జిల్లా ఎస్పీ గారిని కోరిన చిత్తూరు జనసేన పార్టీ నాయకులు*

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు నియోజికవర్గం లో వైఎస్సార్‌సీపీ వల్ల పలుచోట్ల ఓటర్లను ప్రభావితం చేసే అక్రమ పనులు, ఉద్రిక్త పరిస్థితులు తల ఎత్తే అవకాశాలు ఉన్నందున ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు వినయోగించుకొనేలా, అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని చిత్తూరు జనసేన పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం అందజేసి కోరడమైనది.

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు ధీరజ్ దుద్ది, తేజ యాదవ్, దీపక్ రాయల్, నిఖిల్, హర్ష పాల్గొన్నారు.

--
జనసేన పార్టీ
చిత్తూరు నియోజికవర్గం.

చిత్తూరు నియోజికవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ గురజాల జగన్ మోహన్ గారి సతీమణి శ్రీమతి ప్రతిమ గారు, ఎన్నికల...
19/04/2024

చిత్తూరు నియోజికవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ గురజాల జగన్ మోహన్ గారి సతీమణి శ్రీమతి ప్రతిమ గారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరం 19వ వార్డుకు విచ్చేయగా, చిత్తూరు నగరం జనసేన పార్టీ 19వ వార్డు ఇంఛార్జి శ్రీమతి వనిత మురళి గారు జనసేన పార్టీ , తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమం లో పాల్గోన్నారు.

Jai janasena
24/01/2024

Jai janasena

*నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఘన  నివాళులు అర్పించిన చిత్తూరు జనసేన*భగత్ సింగ్ యూనియన్ నాయకులు  M.  చైతన్య రాయల్ గారి ...
23/01/2024

*నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఘన నివాళులు అర్పించిన చిత్తూరు జనసేన*

భగత్ సింగ్ యూనియన్ నాయకులు M. చైతన్య రాయల్ గారి అధ్వర్యం లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన చిత్తూరు జనసేన పార్టీ. స్వాతంత్య్ర సమర యోధుడిని గుర్తు చేసుకుంటూ ఆయన అస్థికలను రెంకోజీ నుండీ మన దేశం ఎర్ర కోటకు తీసుకురావాలనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష త్వరలో సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చిత్తూరు జనసేన నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ అఫ్ కాంటాక్ట్ చిత్తూరు ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి ఆరణి కవిత, రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ కార్యదర్శి ఎ. కె శరవణ, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్, రూరల్ నాయకులు మూర్తి, ప్రభాకర్, జనసేన యువ నాయకులు వీరం వినోద్, హర్ష, చైతన్య, దీపక్ రాయల్, మురుగ, నిఖిల్, ప్రకాష్ పాల్గొన్నారు.

ఇట్లు
జనసేన పార్టీ
చిత్తూరు

*చిత్తూరు జనసేన పార్టీ కమిటీల పై శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో చర్చ*ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు Dr. పసు...
07/01/2024

*చిత్తూరు జనసేన పార్టీ కమిటీల పై శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో చర్చ*

ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు Dr. పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు గౌరవనీయులు PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కలిసి దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని చిత్తూరు నియోజకవర్గ మరియు నగర సమస్యలు, ధౌర్జన్యాలు, భూ అక్రమణల పై వారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార మార్గాలు నియోజక వర్గ అభివృద్ధి ప్రాణాలికలను వారితో చర్చించడం తో పాటు చిత్తూరు నియోజకవర్గం మరియు నగర కమిటీల పై వారి ఆదేశాలు తీసుకొని రావడం జరిగింది.

అనంతరం చిత్తూరు ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు Dr.డి. బి. రాజేంద్ర నాయుడు గారిని PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జనసేన పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరియు చిత్తూరు POC ఆరణి కవిత, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ వుయ్యాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ కార్యదర్శి ఎ. కె శరవణ, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డేగల యుగంధర్, నానబాల లోకేష్, ఆవుల రమేష్, చిత్తూరు జనసేన నాయకులు శ్రీ రామ్ లోచన్, ధీరజ్ దుద్ధి, వీరం వినోద్, దీపక్ రాయల్ పాలుగొన్నారు.

--జనసేన పార్టీ
చిత్తూరు

30/12/2023

చిత్తూరు నగరం లోని కాజూరులో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జనసేన పార్టీ సబ్యుడు శ్రీ జయశంకర్ గారి అద్వర్యం లో పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదం తో ప్రజల్లో చైతన్యం నింపుతు చిత్తూరు నగర ప్రధాన కూడలి అయిన గాంధీ సర్కిల్ వద్ద స్టిక్కర్లు పంపిని చెయ్యడం జరిగింది.

ప్రజలు, వాహనదారులు, ఆటో సోదరులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ స్టిక్కర్లు తీస్కోని వారి వారి వాహనాలకు అంటించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికీ చిత్తూరు నియోజికవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు, ముఖ్య నాయకులు, యువనాయకులు, జనసైనికులు, పాల్గొన్నారు.

జై జనసేన
జై హింద్..!

తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్వర్యంలో జరుగుతున్న *“బీసీలకు ప్రభుత్వం నమ్మక ద్రోహంపై ఐక్యపోరాటం”* కార్యక్రమం. అఖిల పక్...
21/11/2023

తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్వర్యంలో జరుగుతున్న *“బీసీలకు ప్రభుత్వం నమ్మక ద్రోహంపై ఐక్యపోరాటం”* కార్యక్రమం.

అఖిల పక్షాల ఆహ్వానం మేరకు రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జ్ చిత్తూరు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఆరణి కవిత గారు , రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి A K శరవణ మరియు చిత్తూరు జనసేన నాయకులు శ్రీరామ్ లోచన్, వీరం వినోద్, ధీరజ్ దుద్ది, K P శ్రీధర్, నరసింహ కురవ గౌడు, అరణి గిరీష్, మోహన్ యాదవ్, బాల, హర్ష , మురుగ పాల్గొన్నారు.

- జనసేన పార్టీ
చిత్తూరు

Address

Chittoor

Alerts

Be the first to know and let us send you an email when Janasena chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category