03/02/2026
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి
ఇది ఆరోపణ కాదు..
సిట్ నిర్ధారించిన వాస్తవం..
భక్తుల విశ్వాసంతో ఆడుకున్న వారికి శిక్ష తప్పదు...
భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారణ చేపట్టారు,
#జనసేన_గల్ఫ్_జాతీయ_కన్వీనర్ #శ్రీ_కంచన_శ్రీకాంత్ గారు కువైట్ నుంచి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయం సిట్ దర్యాప్తులో పూర్తిగా నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేశారు. సిట్ నివేదిక ప్రకారం, లడ్డూ తయారీలో వాడిన నెయ్యి పాలతో సంబంధం లేకుండా రసాయనాలతో తయారైన సింథటిక్ నెయ్యి అని, అందులో జంతు కొవ్వు నుంచి ఉత్పన్నమైన రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారని తెలిపారు. మోనోగ్లిజరైట్స్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, బీటా కెరోటిన్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి రసాయనాలతో నెయ్యి తయారుచేసి సుమారు 20 కోట్ల లడ్డూలు రూపొందించారన్నారు. 2019–2024 మధ్య టిటిడికి నెయ్యి సరఫరా కాంట్రాక్టుల్లో తీవ్రమైన అవినీతి చోటుచేసుకుందని, డెయిరీ వ్యాపారం లేని సంస్థలకు నిబంధనలు మార్చి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ కేసులో పలువురు నిందితులుగా గుర్తించబడ్డారని, హవాలా మార్గంలో రూ.12.55 కోట్ల అక్రమ లావాదేవీలకు ఆధారాలు లభించాయని చెప్పారు. వాస్తవాలు బయటపడుతుండటంతోనే వైసీపీ నాయకులు ఎదురుదాడులకు దిగుతున్నారని విమర్శించారు. పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఈ ఘోర అపచారానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు, ఈ సమావేశంలో గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ శ్రీ కంచన శ్రీకాంత్ గారితో పాటు బాణపతి రామచంద్రనాయక్ గారు,పగడల అంజన్ కుమార్ గారు, జగిలి ఓబులేసు గారు, అల్లం ప్రేమ్ కుమార్ గారు, చవ్వకుల రెడ్డిమణి గారు, కొమ్మినేని బాలాజీ,చలపతి గారు తదితరులు పాల్గొన్నారు.
Ram Talluri