ITDP Chittoor Parliament

ITDP Chittoor Parliament Official Handle of iTDP Chittoor Parliament

31/05/2026

చెవిరెడ్డి అక్రమార్జనకు బలి పశువులు అవుతున్న ప్రభుత్వ అధికారులు....

అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న చెవిరెడ్డి...


30/05/2026






తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలో ఉన్న శ్రీ యోగ నరసింహస్వామి ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్...
29/05/2026

తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలో ఉన్న శ్రీ యోగ నరసింహస్వామి ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారితో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శ్రీ గురజాల జగన్ మోహన్ గారు, శ్రీ కె. మురళీ మోహన్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.





చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్ర...
29/05/2026

చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి పిలుపు మేరకు నిర్వహించిన మన అందరి పసుపు పండుగ “మహానాడు” కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్‌లో ఘన విజయవంతం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి కృషి వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైంది. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ వెంట నిలబడి నమ్మకంగా పని చేసిన ప్రతి కార్యకర్తకు నేను ఎప్పటికీ అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

మన ఐక్యత, మన కృషి, మన నిబద్ధతే తెలుగుదేశం పార్టీ బలము.

మీ
పులివర్తి నాని
చంద్రగిరి ఎమ్మెల్యే





29/05/2026

మహానాడులో పార్టీకి రూ.19 లక్షల విరాళం అందజేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు..





చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలంలో రెండవ రోజు మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది : ఎమ్మెల్యే పులివర్తి నాని ...
28/05/2026

చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలంలో రెండవ రోజు మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది : ఎమ్మెల్యే పులివర్తి నాని గారి సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు.

వేదాంతపురం,తిరుచానూరు,కాలూరు, మంగళం లోని క్లస్టర్ లలో జరిగిన మహానాడు కార్యక్రమానికి హాజరైన టీడీపీ పార్టీ కుటుంబసభ్యులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించిన పులివర్తి సుధా రెడ్డి గారు.

పార్టీ వ్యవస్థాపకులు , విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం మంగళగిరి ప్రధాన పార్టీ కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో డిజిటల్ స్క్రీన్పై పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన పులివర్తి సుధా రెడ్డి గారు.

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం దామలచెరువు, మనిపిరెడ్డి పల్లి క్లస్టర్ 3,4 లలో జరుగుతున్న మహానాడు 2026 కార్యక...
28/05/2026

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం దామలచెరువు, మనిపిరెడ్డి పల్లి క్లస్టర్ 3,4 లలో జరుగుతున్న మహానాడు 2026 కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూలక్ష్మి గారు.

కార్యక్రమానికి ముందుగా పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి పార్టీ కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు... అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కష్టపడ్డ ప్రతి పార్టీ కార్యకర్తకు అధిష్టానం సముచిత న్యాయం కల్పిస్తుంది : ఎమ్మెల్యే గారు.

నా గెలుపుకు మీ సహాయ సహకారాలు మరువలేను... మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా... వెన్నంటే ఉంటా.

ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేద్దాం .

పార్టీ గెలిచిన రెండు సంవత్సరాల కాలంలో మన అధినాయకుల సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధిని చేసి చూపుతున్నాను.

అనంతరం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో డిజిటల్ స్క్రీన్ లపై పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు.

28/05/2026

చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో పసుపు పండుగ మహానాడు కార్యక్రమం.

మహానాడుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారి తనయుడు పులివర్తి వినీల్ గారు..







#నాతెలుగుదేశంనాబాధ్యత


చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట లో జరిగిన మహానాడు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, స్టేట్ పార్టీ ఆర్...
28/05/2026

చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట లో జరిగిన మహానాడు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూలక్ష్మి గారు.

కార్యక్రమానికి ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు.

పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి ఒక్క కుటుంబసభ్యుడికి నేనెప్పుడూ వెన్నంటే ఉంటా : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

మన పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేద్దాం... మన సమస్యలను మనమే పరిస్కరించుకొందాం... వేరే వారికి అవకాశం ఇవ్వకండి.

కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం మన పార్టీ కల్పిస్తుంది... మీకు నేను అండగాఉంటా : ఎమ్మెల్యే గారు.

అనంతరం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో డిజిటల్ స్క్రీన్ లపై కుటుంబసభ్యులతో కలసి వీక్షించారు.

Address

Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Chittoor Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Chittoor Parliament:

Share