Telugu Desam Party: Chintalapudi

Telugu Desam Party: Chintalapudi Official Page of TDP Chintalapudi

30/05/2026

తమ హయాంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించలేని అసమర్థులు, ఇప్పుడు శాస్త్రీయం గా జరుగుతున్న నియామక ప్రక్రియ పై ప్రజల్లో అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఎంతో పకడ్బందీగా చేపట్టిన 'స్పోర్ట్స్ డీఎస్సీ-2025' నియామక ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే విధంగా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. వాటి ఆధారంగా తప్పుడు వార్తలు రాసి తమ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. 'స్పోర్ట్స్ డీఎస్సీ-2025' నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించబడింది. క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం శాప్‌కు లేదు. అవి కేవలం సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా మాత్రమే జారీ చేయబడతాయి. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సర్టిఫికెట్‌ను, అది జారీ చేసిన సంస్థకు పంపి, అధికారికంగా జెన్యూనిటీ ధృవీకరించిన తర్వాతే మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ధృవీకరణ లేని ఏ సర్టిఫికెట్‌ను ఎంపిక ప్రక్రియలో ఉపయోగించలేదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు పై 25.07.2025న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు FIR No.75/2025 (BNS సెక్షన్ 319(2), IT Act సెక్షన్ 66-D) నమోదు చేశారు. స్థానిక/స్థానికేతర స్థితికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. క్రీడా మెరిట్ ధృవీకరణ మాత్రమే శాప్ పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లు, రోస్టర్ అమలు మరియు పోస్టుల కేటాయింపులు పూర్తిగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం జరిగాయి. స్పోర్ట్స్ డీఎస్సీ-2025, శాప్, విద్యా శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తులు, మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు సహా కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. స్పోర్ట్స్ డీఎస్సీ-2025 పై తప్పుడు వార్తల్ని ఎవరూ నమ్మవద్దు.


హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు  గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొ...
30/05/2026

హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేసాడు. కుట్రలో భాగంగా రూ.1.25 కోట్లను మిగతా నిందితులకు ఇచ్చాడు. ఈలోపు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.



30/05/2026

మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.





#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026
సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో  ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు త...
30/05/2026

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

సమాజం పట్ల బాధ్యత లేనివాళ్లే యువతను, మహిళలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి వారి శక్తి సామర్థ్యాల గురించి బాగా తెలుసు. అందుకే మొదటినుంచీ రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహిస్తుంది టీడీపీ. దానికి కొనసాగింపే ఇప్పుడు చట్టసభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్.




#నాతెలుగుదేశంనాబాధ్యత

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW



తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మ...
29/05/2026

తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలుగొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వ...
29/05/2026

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలు

గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది. ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది టీచర్లను అనుమానిస్తోంది.


29/05/2026

ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న సత్సంబంధాల పై గిట్టని వాళ్ళు అనేకం అనుకోవచ్చు. కానీ ఈ బంధం వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడింది. విశాఖ రైల్వే జోన్ సాకారమైంది. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, AMCA వంటి ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయి. ఐదేళ్ళ విధ్వంసం నుండి వికాసం వైపుకు ఏపీ పయనిస్తోంది.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

ఐదేళ్ళ జగన్ పాలన చూసాక ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకుంటుందా అనిపించింది. ఆ ఐదేళ్లు జగన్ కూల్చిన వ్యవస్థలు మళ్ళీ నిలిచి ప్రజలకు సేవలందిస్తాయా అనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా రెండేళ్లలోనే విధ్వంసం నుంచి కోలుకుని వికాసం వైపుకు ఏపీ దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబుగారు, మంత్రి లోకేష్ గార్ల పాలనా సామర్థ్యాలకు ఇదే నిదర్శనం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

Address

Chintalapudi

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Chintalapudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Chintalapudi:

Share