17/08/2024
Nara Chandrababu Naidu గారిని విజయవాడ లోని ఆయన క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్బంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని సమస్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలపడం జరిగింది.
నంద్యాల జిల్లా లో ఆళ్ళగడ్డ కు నవోదయ స్కూలు కావాలని సీఏం చంద్రబాబు గారికి వినతి పత్రం ద్వారా అడగడం జరిగింది.
ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని గండ్లేరు రిజర్వాయర్ ప్రస్తుతానికి 0.3 కేపాసిటి లో ఉందని దీనిని 0.8 కేపాసిటి గా పెంచాలని, పెంచడం ద్వారా రైతులకు ప్రజలకు సాగునీరుకు గానీ త్రాగునీరుకు గాని ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారని తెలపడం జరిగింది.
దీనిపై సానుకూలంగా స్పందించినా చంద్రబాబు నాయుడు గారు అడిగిన సమస్యలను విని వినతి పత్రాన్ని స్వీకరించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు...