13/06/2022
*93 వ రోజు ప్రారంభమైన షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర...*
*ఆళ్లపాడు నైట్ క్యాంప్ నుండి మొదలు-పాదయాత్రలో షర్మిల వెంట నడుస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల(కె కె డి)...*
*సాయంత్రం ముష్టికుంట్ల గ్రామస్థులతో మాట-ముచ్చట కార్యక్రమం..*
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో 93 వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం బోనకల్ మండలం ఆళ్లపాడు నైట్ క్యాంప్ నుండి షర్మిల పాదయాత్ర ప్రారంబించారు.మండలంలోని రావినూతల,బోనకల్,ముష్టికుంట్లలో పాదయాత్ర కొనసాగనుంది.సాయంత్రం ముష్టికుంట్లలో గ్రామస్థులతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొననున్నారు.ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మొదలుపెట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఎండను సైతం లెక్కచేయకుండా వందలమంది ప్రజలు షర్మిల వెంట అడుగులు వేస్తున్నారు. గ్రామాలలో తాము పడుతున్న సమస్యలను షర్మిలకు విన్నవిస్తున్నారు.మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ కిషోర్ కుమార్ దొంతమాల(కె కె డి) షర్మిలతో పాదయాత్రలో పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారు.నియోజకవర్గంలోని చింతకాని,ముదిగొండ మండలాల్లో మరో మూడు రోజులు పాదయాత్ర కొనసాగనుంది.