Bobbili Municipality

Bobbili Municipality Bobbili Municipality is 2nd largest ULB in the Vizianagaram District of A.P. it is spread over an area of 25.60 Sq,Kms with a population of 56877

20/03/2023
Happy Republic DayMunicipal Department Govt of Andhra pradesh          ♻
26/01/2023

Happy Republic Day

Municipal Department Govt of Andhra pradesh






తే. 03.12.2022దిన మునిసిపల్ కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారి క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మర...
03/12/2022

తే. 03.12.2022దిన మునిసిపల్ కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారి క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ లతో మెయిన్ మార్కెట్, చింతాడ వీధి, యాత వీధి, సిద్దా వీధి, కుమ్మరి వీధి మరియు గౌడ వీధి ఏరియాలలో పర్యటించారు. కుమ్మరి వీధి మరియు గౌడ వీధిలలో ఇంటింటి చెత్త సేకరణ పరిశీలించారు. కాలువలు మరియు కల్వర్టులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశించారు. మార్కెట్లో రోడ్లపైన చెత్తలను తొలగించాలని ఆదేశించారు.

తే. 18.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారి అవుట్డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీరు ...
18/11/2022

తే. 18.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారి అవుట్డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీరు మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో రావు వారి వీధి, సంఘ వీధి, ఆర్.సి.యం స్కూల్ రోడ్ మరియు పాత బొబ్బిలి ఏరియాలలో పర్యటించారు.

రావు వారి వీధిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు, సంఘ వీధి మరియు చాకలి వీధులలో శానిటేషన్ పరిశీలించారు. కొళాయిలు ప్రతిరోజు వస్తున్నది లేనిది మరియు వీధి దీపములు వెలుగుతున్నది లేనిది ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్క్రాప్ షాప్ ను పరిశీలించి స్క్రాప్ ఏ విధంగా కొనుగోలు చేస్తున్నది అడిగి తెలుసుకున్నారు, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు తరలించారని ఆదేశించారు, తదుపరి పాత బొబ్బిలిలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో సంబంధిత వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ పై తీవ్రంగా మండిపడ్డారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు

తే. 17.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారి అవుట్డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీర్ల...
17/11/2022

తే. 17.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారి అవుట్డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీర్లతో మస్తరు కార్యాలయం సందర్శించి పారిశుద్ధ్య కార్మికుల యొక్క హాజరును పరిశీలించారు తదుపరి అన్ని వార్డు సచివాలయాల శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో మరియు సూపర్వైజర్లతో సమావేశం ఏర్పాటు చేసి వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు మరియు సూచనలు జారీ చేశారు.

తదుపరి ఇన్చార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్లతో ఇటీవల నాయుడు కాలనీలో నూతనంగా నిర్మించిన సి.సి. రోడ్లను పర్యవేక్షించారు అక్కడ ఉన్న ప్రజలు అదనపు రోడ్లు నిర్మించాలని కోరగా పరిశీలిస్తామని తెలియజేశారు, అక్కడ ఒక చిన్న పిల్లవాడు చిత్తు కాగితములు ఏరుకుంటున్నట్లుగా గుర్తించి అతని తల్లిని పిలిపించి మందలించారు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నట్లుగా తెలుసుకొని అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నార.

తదుపరి రామన్న దొర వలస లో ఉన్న సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కును సందర్శించారు. సీసీ కెమెరా లను పరిశీలించి క్యూబ్ బయో ఎనర్జీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తడి చెత్త నుండి ఎరువులు తయారుచేసే విధానాన్ని పరిశీలించారు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని మరియు ఇతర కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.

తే. 10.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారు అవుట్డోర్ విధుల్లో భాగంగా పర్యావరణ ఇంజనీరు మరియు వార్డు శానిటేషన్...
10/11/2022

తే. 10.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారు అవుట్డోర్ విధుల్లో భాగంగా పర్యావరణ ఇంజనీరు మరియు వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో గొల్లపల్లి దాడి తల్లి కాలనీ, కృష్ణాపురం డంపింగ్ రోడ్డు ఏరియా మరియు వైయస్సార్ విగ్రహం ఏరియాలో పర్యటించారు.

దాడి తల్లి కాలనీలో ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు వస్తున్నది లేనిది మరియు ఎక్కడైనా నీరు నిలిచిపోయి ఉన్నదా కాలువల సరిగ్గా పూడికలు తొలగిస్తున్నారా అన్న విషయాలను అక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణాపురం డంపింగ్ రోడ్డు ఏరియాలో ఇటీవలి లెగసి వేస్ట్ ను తొలగించుటకు ఒప్పందం కుదుర్చుకున్న తరుణ్ అసోసియేట్స్ వారు పనిని ప్రారంభించింది లేనిదే పరిశీలించారు. వైయస్సార్ విగ్రహం వద్ద ఉన్న స్క్రాప్ షాపులో ఉన్న స్క్రాప్ ను ఎప్పటికప్పుడు తొలగించాలని దుకాణ యజమానికి ఆదేశించారు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా స్క్రాప్ ను వేసినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొబ్బిలి బలిజిపేట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నూతనంగా నిర్మించిన కాలువలను పరిశీలించి అవుట్ ఫ్లో సక్రమంగా నిర్మించింది లేనిదీ పరిశీలించారు.

తే: 09.11.2022దిన కమిషనర్ శ్రీ యస్.  శ్రీనివాసరావు గారి అవుట్డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీరు...
09/11/2022

తే: 09.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారి అవుట్డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీరు మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో జండా వీధి, అంట్యాకుల వీధి, కాసా వారి సంధులు, కోరాడ వీధి, గంగుల వీధి కొత్త ఎరుకల వీధి ఏరియాలలో పర్యటించారు.

గంగుల వీధిలో ఇంటింటి చెత్త సేకరణ పరిశీలించి రోజు పారిశుధ్య కార్మికులు వస్తున్నది లేనిది అక్కడ ఉన్న మహిళను అడిగి తెలుసుకున్నారు, వీధులను మరియు కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని ఎప్పటికప్పుడు చెత్తలను తొలగించాలని సంబంధిత వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ వారికి ఆదేశించారు. ఎరుకుల వీధిలో కాలువపై ఏర్పాటుచేసిన బయో రెమిడేషన్ అనగా కాలువలలో ప్రవహిస్తున్న మురుగునీటిలో కెమికల్ని కలపడం ద్వారా చెరువులలోకి వెళ్లే నీరు కలుషితం కాకుండా చూసే విధానాన్ని పరిశీలించారు. తదుపరి కమ్యూనిటీ టాయిలెట్ ను పరిశీలించారు.

తే. 08.11.2022దిన కమిషనర్ శ్రీ యస్.  శ్రీనివాసరావు గారు అవుట్ డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీర...
08/11/2022

తే. 08.11.2022దిన కమిషనర్ శ్రీ యస్. శ్రీనివాసరావు గారు అవుట్ డోర్ విధుల్లో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ ఇంజనీర్ మరియు వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో మల్లంపేట రైల్వే అండర్ బ్రిడ్జి, ద్వారకా నగర్ కాలనీ మరియు మల్లంపేట ఏరియాలలో పర్యటించారు.

రైల్వే అండర్ బ్రిడ్జిలో నిల్వ ఉండే నీటిని తోడే పంపు షెడ్ను పరిశీలించారు, ద్వారకా నగర్ లో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా ఉండడంపై వెంటనే అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చెత్తలను తొలగించవలసిందిగా సంబంధిత శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి ఆదేశించారు. కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా శానిటరీ ఇన్స్పెక్టర్ వారికి ఆదేశించారు.

Address

Bobbili
535558

Alerts

Be the first to know and let us send you an email when Bobbili Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bobbili Municipality:

Share