06/08/2018
స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని యువతను కదిలించి కార్యొనుముఖుల్ని చేసి ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాలతో పాటు,సామాజిక కార్యక్రమాల వైపు శ్రీ జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటగా 1992 లో “వివేకానంద యువజన సంఘం”స్థాపించడం జరిగింది.అదే స్పూర్తితో సామాజిక కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తు 1997 లో రంగారెడ్డి జిల్లా యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేయడం జరిగింది, అప్పుడు లభించిన ప్రోత్సాహం ,ప్రజాదరణతో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రం లోని యువజన సంఘాలన్నింటిని కలిపి 2000 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి లో“యువజన సంఘాల సమితి గా" జిట్టన్న అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
యువజన సంఘాల సమితి ద్వారా చేసిన అనేక సేవ కార్యక్రమాలను గుర్తించిన భారత ప్రభుత్వం జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారికి“జాతీయ ఉత్తమ యువజన సేవ పురస్కారం” అందించడం జరిగింది.
అలాగే అప్పుడప్పుడే వెళ్ళూనుకుంటున్న“మలిదశ తెలంగాణ"ఉద్యమంలో మేము సైతం అంటూ యువజన సంఘాలన్నింటికి దిశానిర్దేశం చేస్తూ యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని,ఆంధ్ర,రాయలసీమ ప్రాంత యువజన సంఘాలన్నింటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించి,వారిని ఒప్పించి తెలంగాణ యువజన సంఘాలన్నింటిని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడం జరిగింది.
ఒక దిక్కు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ,మరో దిక్కు పేద విద్యార్థులకు సైతం మెరుగైన సౌకర్యాలను అందించాలనే తపనతో 2003 వ సంవత్సరం లో అమెరికాలో స్థిరపడిన వారి మేనమామ డాక్టర్ చిలుముల రామచంద్రా రెడ్డి గారి సహకారంతో అధునాతన సౌకర్యాలతో కోటి 20 లక్షల రూపాయలతో భువనగిరి లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించిన సంగతి మీ కందరికి తెలుసు.
సామాజిక సేవ,తెలంగాణ ఉద్యమం తో పాటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తన బాధ్యతను విస్తరిస్తూ నల్గొండ జిల్లా భువనగిరి ప్రజలతో పాటు మూసి పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు చూసి కాలుష్యనీటితో మూసి ని నింపుతున్న చోద్యం చూసి,మూసి నది ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి ఏప్రిల్ 10,2005 నుండి ఏప్రిల్ 17,2005 వరకు దాదాపు 200 కిలోమీటర్లు, వలిగొండ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి,అప్పటి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి 902 కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన పనులు ప్రారంభించేలా చేయడం జరిగింది.
ఒక వైపు మూసి ప్రక్షాళన కోసం శ్రమిస్తూనే,ఆ పాదయాత్రతో గ్రామగ్రామాన తిరిగినప్పుడు,ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య,మరో వైపు మూసి కాలుష్యంతో తాగేటందుకు గుక్కెడు మంచినీళ్ళు కరువై,తినే తిండి కూడా విషమై తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా ఈ భూమ్మిద పడితే ఏ రోగమొస్తుందో అని భయపడేంత దౌర్భాగ్య స్థితిలో.....అప్పట్లో నీళ్ళు కొనుక్కొని తాగలేక ,మూసికాలుష్యం ఇంకిన నీళ్ళు తాగితే ఎప్పుడు ఏ అనారోగ్యం దాపురిస్తదో, శారీరక పటుత్వం కోల్పోయి బ్రతకల్సి వస్తదో అని బాధపడుతున్న పరిస్థితిని చూసి చలించి దానికి తాత్కాలిక పరిష్కార మార్గం కొరకు 2006 సంవత్సరం నుండి దాదాపు 100 కు పైగా గ్రామాలలో పేద ప్రజలకు త్రాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసారు శ్రీ జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారు...
అదే విధంగా బీబీనగర్ వద్ద ఉమ్మడి 5 జిల్లాల పేద ప్రజలకు వైద్య సేవలు అందించగలిగే నిమ్స్ యూనివర్సిటీకి 2005 సంవత్సరం లో అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసి వదిలేస్తే ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారి నాయకత్వంలో అనేక ఆందోళనలు చేసిన తరువాత పనులు ప్రారంభించేట్టు చేసి 2009 సంవత్సరం మార్చిలో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు అయినా అది ప్రజలకు అందుబాటులోకి రాలేదు.2009 నుండి మిగిలిన పనులను పూర్తి చేసి తెలంగాణ లోని ఉమ్మడి 5 జిల్లాల పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని అనేక ఉద్యమాలు చేసి ఒక సందర్భంలో 3 రోజులు జైలుకు కూడా వెళ్లారు జిట్టన్న...ఆనాటి నుండి ఈ నాటి వరకు కూడా నిమ్స్ హాస్పిటల్ ని కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగించడానికి,షూటింగ్ లకు అద్దెకివ్వడం లాంటి పనులకు ఈ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికి జిట్టన్న అధ్వర్యంలో పోరాటం చేస్తూ అడ్డుకోవడం జరిగింది..నిమ్స్ హాస్పిటల్ ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా జిట్టన్న చేసిన పోరాట ఫలితంగా ఇక తప్పదు అని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి బీబీనగర్ లొనే ఎయిమ్స్ ఆసుపత్రిగా ప్రతిపాదించి ఇటివల అనుమతులు పొందడం జరిగింది....
ఇక వలసపాలనలో మరుగున పడిన మన యాస,భాష, కట్టు,బొట్టు,వంటకాలను, జీవన శైలిని ప్రతిభింభించే తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రపంచానికి మరోసారి పరిచయం చేయాలని 2007 మార్చి 3 నుండి మార్చి 5 వరకు 3 రోజుల పాటు భువనగిరిలో ఏకశిలగా ఉన్న భువనగిరి ఖిల్లాను అద్భుతమైన లైటింగ్ తో అలంకరించి తెలంగాణ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి భువనగిరి కీర్తిని మరోసారి పతాక స్థాయిలో నిలబెట్టిన భువనగిరి బిడ్డ మన జిట్టన్న...
అదే స్ఫూర్తితో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో 2007 మార్చి 23 నుండి మార్చి 27 వరకు 5 రోజుల పాటు తెలంగాణ సంబురాలు పేరుతో నిర్వహించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి మరోసారి ఎలిగెత్తి చాటిన తెలంగాణ బిడ్డ మన జిట్టన్న....వీటితో పాటు
2010 నుండి ఉదృతంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి “యువ తెలంగాణ" పేరుతో అనేక రకాల ఆందోళనలు,ధర్నాలు,రాస్తారోకోలు,బహిరంగ సభలు,సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూనే, JAC చేపట్టిన అనేక రకాల ఆందోళనలలో యువతను భాగస్వాములు అయ్యేటట్టు చేయడం జరిగింది....
ఒక వ్యక్తిగా,ఒక నాయకుడిగా కంటే,ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజాసేవకు మరింత అవకాశం ఉంటుంది అని భావించినా,రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలకు ,డబ్బుకు,ప్రలోభాలకు దాసొహమయి ఆఖరి నిమిషంలో చేసిన మోసం తెలిసిందే....అయినప్పటికీ భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో 2009 లో,2014 లో భువనగిరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి రెండవ స్థానంలో నిలవడం జరిగింది.....
ఈ పరిణామాలను అన్ని గమనించిన తరువాత అర్ధం అయ్యింది ఏమిటి అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు సామాజిక దృక్పథం సేవే లక్ష్యంగా పని చేయాలనుకునే యువతకు,మహిళలకు కనీస ప్రాధాన్యతను ఇవ్వట్లెదు.కేవలం ధన బలం ఉన్న వారికే అవకాశాలు ఇస్తున్నారు..ప్రజాసేవే లక్ష్యంగా ఉండే వాళ్లకి అవకాశం లేకుండా పోయింది,అందుకే మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
సామాజిక దృక్పథం ఉన్న యువత రాజకీయాల్లోకి వస్తే చట్ట సభల్లో కి వెళ్ళే అవకాశం ఉంటే,ప్రజా సంక్షేమం కొరకు ప్రజల పక్షాన మన గళాన్ని వినిపించగళం.ప్రజలకు ఇచ్చినా హామీలను విస్మరించి పాలకులు చేస్తున్న మోసాలను ప్రశ్నించగలం.అందుకే నిస్వార్ధమైన యువతకు,మహిళలకు సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీ,కౌన్సిలర్,కార్పొరేటర్, ఎమ్మల్యే,ఎంపీ,వరకు అవకాశం రావాలంటే రాజకీయ ప్రక్షాళన జరగాలి....
అందుకే మనకు సొంత రాజకీయ పార్టీ అవసరం...కాబట్టి“యువ తెలంగాణ" ను సంపూర్ణ రాజకీయ పార్టీ గా రూపొందించి,25 ఏండ్ల సామాజిక సేవ చేసిన,రాజకీయ అనుభవంతో తెలంగాణ రాజకీయ చరిత్ర లో ఒక కొత్త ఒరవడికి శ్రీకరం చుట్టాలని గౌరవ యువ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారి నాయకత్వం లో యువ తెలంగాణ ను రాజకీయ పార్టీగా అవతరింపజెయలని నిర్ణయించాము.....దీనికి యువత సంపూర్ణ మద్దతు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం
దీని పై మీ అభిప్రాయాలు సలహాలు తెలుపగలరు......
ఇట్లు,
డాక్టర్ కూన వేణుగోపాలక్రిష్ణ,
యువజన సంఘాల సమితి, రాష్ట్ర అధ్యక్షులు.