Ryakala Srinivas BRS

Ryakala Srinivas BRS సేవే లక్ష్యం సహాయమే ఆయుధం...

29/04/2026
గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అందులో భాగంగా తాజ్ పూర్ గ్రా...
29/04/2026

గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అందులో భాగంగా తాజ్ పూర్ గ్రామానికి చెందిన రాచకొండ లహరికి ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తాజ్ పూర్ గ్రామంలో మొత్తం స్టూడెంట్స్ 100 శాతం ఉత్తీర్ణత పొందినందుకు ఆర్థిక శుభాకాంక్షలు...

ఇట్లు...
ర్యాకల సంతోషా శ్రీనివాస్
సర్పంచ్ తాజ్ పూర్

తాజ్ పూర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫారం పాండు పని వద్ద సౌకర్యాలలో భాగంగా ఈరోజు తాజ్ పూర్  గౌరవ సర్పంచ...
27/04/2026

తాజ్ పూర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫారం పాండు పని వద్ద సౌకర్యాలలో భాగంగా ఈరోజు తాజ్ పూర్ గౌరవ సర్పంచ్ శ్రీమతి ర్యా కల సంతోష శ్రీనివాస్ గారు ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గారు వార్డు సభ్యులు బొమ్మర రామకృష్ణ గారుఎస్కే హైమత్ గారు మరియు సామాజికవేత్త డాక్టర్ ర్యా కల శ్రీనివాస్ గారు పంచాయతీ కార్యదర్శి బి నరేందర్ నాయక్ గారు బొమ్మరపు బాలరాజ్ ఈరోజు పని ప్రదేశంలో కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చిమంచినీటి సౌకర్యం నీడ ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఫారం పాండు పని వద్ద కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనిన సిబ్బంది ఆశా వర్కర్ బింగి అరుణ ఫీల్డ్ అసిస్టెంట్ పి రామస్వామి కారోబార్ జి సుగుణాకర్ ఉపాధి కూలీలు పాల్గొనడం జరిగింది అలాగే పాలకవర్గానికి ఉపాధికూలీలు కృతజ్ఞలు తెలియజేయడం జరిగింది

తాజ్ పూర్ గ్రామంలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్...
27/04/2026

తాజ్ పూర్ గ్రామంలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్థులకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అదే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ఏర్పడి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసిందని అన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచిందని, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టిందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిందని, కానీ ప్రస్తుతం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబి యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మరపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కే హైమద్ తదితరులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...
27/04/2026

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...

*తాజ్ పూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా, బి. ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు*💐💐 ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ *ర్య...
14/04/2026

*తాజ్ పూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా, బి. ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు*💐💐
ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ *ర్యాకల సంతోష శ్రీనివాస్* గారు
ముఖ్య అతిధులుగా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ *CI గారు మరియు SHO గారు*

~ఈ రోజు *డా, బి. ఆర్ అంబేద్కర్* గారి జయంతి ని పురస్కరించుకొని తాజ్ పూర్ లో గ్రామ సర్పంచ్ *ర్యాకల సంతోష శ్రీనివాస్* గారు మరియు *పాలకవర్గం* ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా స్థానిక CI శ్రీ చంద్రబాబు గారు, SHO అనీల్ కుమార్ గారు పాల్గొని నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు....ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, దళిత పీడిత బహుజన వర్గాల స్వేచ్ఛ కోసం వారు రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడారు... ఈ కార్యక్రమం లో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి, నరేందర్, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాల్ రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, మరియు మాజీ సర్పంచ్ లు,అన్ని కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.. 💐💐

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర...
14/04/2026

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.

Address

Bhongir

Telephone

+919948694445

Website

Alerts

Be the first to know and let us send you an email when Ryakala Srinivas BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share