30/05/2026
*పోలీసు విభాగంలో సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.*
*పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష*
పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ఈ రోజు పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు మరియు పోలీస్ అధికారులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.
*పదవీవిరమణ పొందిన వారి వివరాలు:*
1. శ్రీ కె. వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా పోలీసు కార్యాలయం, భీమవరం.
2. శ్రీ ఎన్. హరిబాబు, సబ్ ఇన్స్పెక్టర్ - 1182, పాలకోడేరు పోలీస్ స్టేషన్.
3. శ్రీ టి.వి.జి రాజు, సబ్ ఇన్స్పెక్టర్ - 1222, భీమవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
4. శ్రీ పి. విజయ్ కుమార్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ - 1420, పోడూరు పోలీస్ స్టేషన్.
5. శ్రీ పి. సింగరాజు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ - 1430, తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
6. శ్రీ ఎం. గోవిందరావు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ - 1204, తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
7. శ్రీ పి. శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ - 111, పెనుమంట్ర పోలీస్ స్టేషన్.
8. శ్రీ పి. రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్, జిల్లా పోలీస్ కార్యాలయం, భీమవరం.
9. శ్రీ కె. నాగ మునీంద్ర రావు, హెడ్ కానిస్టేబుల్ - 342, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, భీమవరం.
10. శ్రీ కె. సువర్ణ రాజు, హెడ్ కానిస్టేబుల్ - 1091, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, భీమవరం.
11. శ్రీ వై. ప్రభాకర్, హోమ్ గార్డ్, పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ....,
సుమారు 35 నుండి 40 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో వ్యక్తిగత సుఖాలను, కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి, అహోరాత్రులు ప్రజా రక్షణ కోసం శ్రమించి, ఎటువంటి విమర్శలకు తావులేకుండా సగర్వంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
పోలీసు వ్యవస్థలో ప్రతి ఉద్యోగి అందించే సేవలను శాఖ ఎప్పటికీ స్మరించుకుంటుందని, నిత్యం సవాళ్లతో కూడుకున్న విధుల్లో ఉన్నప్పుడు సిబ్బందికి వెన్నుదన్నుగా నిలిచిన వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పదవీ విరమణ కేవలం విధులకు మాత్రమేనని, పోలీసు కుటుంబంతో మీ అనుబంధం శాశ్వతమని భరోసా ఇచ్చారు. పదవీ విరమణ పొందిన సిబ్బంది తమ తదుపరి జీవితాన్ని ఆర్థిక క్రమశిక్షణతో, మెరుగైన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే, వారికి అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు గారు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ ఎం.వి.వి సత్యనారాయణ గారు, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ కె.వెంకట్రావు గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సి.హెచ్. మోజేష్ గారు, ఇతర పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
F