Konda Sai Prasad ABVP

Konda Sai Prasad ABVP || ABVP 🚩✊ || Nationalist ||
Nation First - Self Next 🙏

ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ABVP నాయకులతో....
20/01/2025

ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ABVP నాయకులతో....

Greater Hyderabad City Conference - 2024
11/12/2024

Greater Hyderabad City Conference - 2024

తెలంగాణ ప్రభుత్వ గురుకులాలలో విద్యార్థుల మరణాలపై జాతీయ బాలల హక్కుల కమిషన్ లో ఫిర్యాదు - న్యాయవాది కొండా సాయి ప్రసాద్
30/11/2024

తెలంగాణ ప్రభుత్వ గురుకులాలలో విద్యార్థుల మరణాలపై జాతీయ బాలల హక్కుల కమిషన్ లో ఫిర్యాదు - న్యాయవాది కొండా సాయి ప్రసాద్

ఈరోజు భైంసా లోని రాజీవ్ నగర్ లో గల మా శాంభవి యూత్ దుర్గ మాత హారతి కార్యక్రమంలో భైంసా పట్టణ CI గోపీనాథ్ గారు పాల్గొన్నారు...
11/10/2024

ఈరోజు భైంసా లోని రాజీవ్ నగర్ లో గల మా శాంభవి యూత్ దుర్గ మాత హారతి కార్యక్రమంలో భైంసా పట్టణ CI గోపీనాథ్ గారు పాల్గొన్నారు 💐💐

20/09/2024

గణేష్ శోభయాత్రపై దాడిచేసిన దుండగులను రక్షిస్తూ ఓయూ విద్యార్థులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం - ABVP

- మద్యం మత్తులో ఉస్మానియా యూనివర్సిటీ గణనాథుల ద్వంసానికి కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
- విద్యార్థినిలపై అసభ్యంగా ప్రవర్తించి శోభయాత్రపై దాడిచేసిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటు.
- పోలీసులను ప్రభావితం చేస్తూ ఓయూ విద్యార్థులపై హత్యాయత్నం కేసు నమోదు చేయించటం అనేది కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి నిదర్శనం.

ఉస్మానియా యూనివర్సిటీలో గత 30 సం.లుగా విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే గణేష్ ఉత్సవాలను జరగకుండా అడ్డుకొని శోభయాత్రపై ఉద్దేశపూర్వకంగా దాడిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలకడం సిగ్గుమాలిన చర్య, కాంగ్రెస్ నాయకులే స్వయంగా గాంధీ భవన్ నుండి FIR లో ఏ సెక్షన్ ఉండాలో డెక్టేట్ చేయటాన్ని ఎబివిపి తీవ్రంగా ఖండిస్తుంది.

గణేష్ నిమజ్జనం సందర్బంగా ఓయూలోని అన్ని హాస్టల్ విద్యార్థులు నిమజ్జన కార్యక్రమంలో ఎంతో ప్రశాంతంగా, భక్తి శ్రద్దలతో శోభాయాత్ర జరుపుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి, ఉద్దేశపూర్వకంగా ఎలాగైనా శోభాయాత్ర జరగకుండా అడ్డుకొవాలనే కుట్రతో శోభాయాత్ర జరుపుతున్న ఆర్ట్స్ కళాశాల వద్దకు వచ్చి ఇష్టానుసారంగా గణేష్ శోభాయాత్ర ఫ్లెక్స్ ని చించి గణనాథుడిని మరియు విద్యార్థులను దుర్భాషలాడుతూ శోభాయాత్రని అడ్డుకొని విద్యార్థులపై దాడిచేయటం హేయమైన చర్య. విద్యార్థులు ఎంత వారించినా వినకుండా ఆకతాయిలు అమ్మాయిలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య బాధ్యులు శోభాయాత్రపై దాడి చేసిన దుండగులకు మద్దతుగా నిలుస్తూ దుండగుల అరాచకాలను అడ్డుకున్న విద్యార్థులపైనే హత్యాయత్నం కేసులు పెట్టేలా రాజకీయ ప్రమేయంతో పోలీసులను ప్రేరేపించడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే అని విద్యార్థిలోకం భావిస్తుంది.

మద్యం మత్తులో వచ్చి ఉత్సవాలను అడ్డుకుంటూ, ఓయూ విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించిన దుండగులపై కేసులు నమోదు చేసి వెంటనే రిమాండ్ కి తరలించాలి.ఓయూ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణపతి ఉత్సవాల శోభయత్రను అడ్డుకొని విద్యార్థులపై దాడి చేసిన వారికి మద్దతుగా నిలిచి రాజకీయ ప్రమేయంతో పోలీసులపై ఒత్తిడి చేసి అక్రమ కేసులు బనాయించేలా ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ABVP డిమాండ్ చేస్తుంది.

Konda Sai Prasad Goud
ABVP Telangana

17/09/2024

భరతమాత ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ జీ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🙏🏻💐🚩


ఈరోజు భైంసా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు హిందూ వీర్ యువ సేన యూత్ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు 🙏🏻🚩
14/09/2024

ఈరోజు భైంసా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు హిందూ వీర్ యువ సేన యూత్ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు 🙏🏻🚩

Naresh Kadari Anna & Rajeshwar Gilakari G at Hindu Veer Yuva Sena Youth, Narasimha Nagar, Bhainsa 🙏
13/09/2024

Naresh Kadari Anna & Rajeshwar Gilakari G at Hindu Veer Yuva Sena Youth, Narasimha Nagar, Bhainsa 🙏

హిందూ వీర్ యువ సేన యూత్ హారతి కార్యక్రమంలో భైంసా Bus Depot Manager హరి ప్రసాద గారు మరియు TG RTC సభ్యులు పాల్గొన్నారు.
08/09/2024

హిందూ వీర్ యువ సేన యూత్ హారతి కార్యక్రమంలో భైంసా Bus Depot Manager హరి ప్రసాద గారు మరియు TG RTC సభ్యులు పాల్గొన్నారు.

ABVP అధ్వర్యంలో 2022 లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, అప్పట్లో ఉన్న BRS ప్రభుత్వానికి వ్యతరేకంగా ధర్నా చేసినం...
06/09/2024

ABVP అధ్వర్యంలో 2022 లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, అప్పట్లో ఉన్న BRS ప్రభుత్వానికి వ్యతరేకంగా ధర్నా చేసినందుకు మపై అక్రమ కేసులు పెట్టిన కారణంగా ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరు కావడం జరిగింది.

04/09/2024

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నా స్కాలర్షిప్ మరియూ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనె విడుదల చేయలి మరియు విద్యాశాఖ మంత్రిని నియమించాలి - ABVP

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణగూడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ABVP తెలంగాణ రాష్ట్ర లా స్టూడెంట్స్ ఫోరం కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్న కనీసం విద్యారంగం పై చిత్తశుద్ధి లేదని తెలంగాణలో మద్యానికి మంత్రి ఉన్నాడు గాని విద్యారంగానికి మంత్రిని కేటాయించుకోలేని దుస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. గత పాలనలో పదేళ్లు విద్యార్థులు నిరుద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విద్యార్థులను పట్టించుకోవడం దేవుడెరుగు కానీ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7500 కోట్లు ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని స్కాలర్షిప్ రాని కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే సర్టిఫికెట్ విషయంలో ప్రైవేట్, ప్రభుత్వం కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిదుర వీడి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను మరియు
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్, క్రిష్,మనోజ్,తేజ మరియు తదితరులు పాల్గొన్నారు.

28/08/2024

Happy Birthday to Our Beloved Mudhole Constituency MLA Sri.Rama Rao Patil Garu 💐💐
Ramarao Patil Pawar

Address

Bhainsa
504103

Website

Alerts

Be the first to know and let us send you an email when Konda Sai Prasad ABVP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Konda Sai Prasad ABVP:

Share

Category