Collector Bapatla District

Collector Bapatla District Official Page of the Collector & District Magistrate, Bapatla District

Welcome to the official page of the Collector & District Magistrate, Bapatla District.

Official page of Collector & District Magistrate, Bapatla District – connecting with citizens for transparent governance, public welfare, and overall development of the district. This platform serves as a bridge between the district administration and the citizens of Bapatla, fostering transparency, engagement, and inclusive development. Stay connected for updates, initiatives, and opportunities aimed at enhancing the welfare and progress of our district.

18/07/2026





18/07/2026
బాపట్ల, జులై 17:-  ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు ప్రత్యేక ద...
18/07/2026

బాపట్ల, జులై 17:
- ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు ప్రత్యేక దృష్టి సారించారు.
- శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో నమోదైన అర్జీలను పరిశీలించారు.
- నిజాంపట్నం మండలం పలపట్ల గ్రామానికి చెందిన మహిళ భూ ఆక్రమణ ఫిర్యాదుపై ఆమెతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి భూమికి తక్షణమే కొలతలు నిర్వహించి నిబంధనల మేరకు న్యాయం చేయాలని ఆదేశించారు.

బాపట్ల జులై 17: - రైతుల భూసమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ క...
18/07/2026

బాపట్ల జులై 17:
- రైతుల భూసమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అధికారులను ఆదేశించారు.
- శుక్రవారం నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామంలోని సర్వే నెం.111 భూమిని పరిశీలించారు. రైతుల అభ్యంతరాలు విని, రికార్డులు, సరిహద్దులు పరిశీలించి అవసరమైతే రీ-సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనల మేరకు పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ గారు సూచించారు.

బాపట్ల, జులై 17, 2026: -  క్షయవ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమా...
18/07/2026

బాపట్ల, జులై 17, 2026:
- క్షయవ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన టీబీ ముక్త్ భారత్ యాప్ ను ఆవిష్కరించారు.
- నిక్షయ్ మిత్రలుగా నమోదుై టీబీ రోగులకు పోషకాహార సహాయం అందించాలని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, దాతలను కోరారు. యాప్‌లోని 'కుషి' చాట్‌బాట్ ద్వారా తెలుగు సహా 12 భాషల్లో టీబీ లక్షణాలు, చికిత్స, పోషకాహారం, సమీప ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. యాప్ ద్వారా సహాయం పారదర్శకంగా, వేగంగా అందుతుందని తెలిపారు.

బాపట్ల, జులై 17, 2026: - రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా జిల్లా క...
18/07/2026

బాపట్ల, జులై 17, 2026:
- రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు శుక్రవారం రేపల్లె మండలం ఇసుకపల్లి గ్రామంలోని శ్రీ భ్రమరాంబ చెన్నమల్లేశ్వర స్వామి వారి పురాణ కాలక్షేప మండపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.
- ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను ఓర్పుగా విన్నారు. కొన్ని అర్జీలను సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించగా, మిగిలిన వాటిని సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బాపట్ల , జులై 17, 2026: -  ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స...
18/07/2026

బాపట్ల , జులై 17, 2026:
- ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అన్నారు.
- శుక్రవారం రేపల్లె మున్సిపల్ పరిధిలోని భవిత కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, అక్కడి సౌకర్యాలు, శిక్షణ విధానాన్ని తెలుసుకున్నారు. తల్లులతో మాట్లాడి పిల్లల అభివృద్ధిపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రాల అవసరాలపై నివేదిక సమర్పించాలని అధికారులను కలెక్టర్ గారు ఆదేశించారు.
- పిల్లలకు ఆటపరికరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారు సూచించారు.

 #
17/07/2026

#

బాపట్ల, జూలై 16:.- ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్–2025 నిబంధనలను క్షుణ్ణంగా అమలు చేస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సిబ్బంది ...
17/07/2026

బాపట్ల, జూలై 16:.
- ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్–2025 నిబంధనలను క్షుణ్ణంగా అమలు చేస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఐ.ఏ.ఎస్. గారు జిల్లా కలెక్టర్లకు సూచించారు.
- రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా జిల్లాలో సిబ్బంది కేటాయింపులో పాత జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేస్తూ సీనియారిటీ అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ గారు తెలిపారు.
- సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి, ఐ.ఏ.ఎస్. గారు పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణ, పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Address

HRDI BAPATLA
Bapatla
522101

Alerts

Be the first to know and let us send you an email when Collector Bapatla District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share