All India OBC Students Association, Telangana

All India OBC Students Association, Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from All India OBC Students Association, Telangana, Political organisation, Gachibowli, Banjara hills.

03/01/2024
As an independent student organisation, we rely on crowd funding for our activities. We request concerned progressive in...
09/01/2023

As an independent student organisation, we rely on crowd funding for our activities. We request concerned progressive individuals to contribute for us. Even small amounts will make a greater impact.

21/12/2022
ఓబీసీ సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు - All India OBC Students Association ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర...
21/12/2022

ఓబీసీ సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు - All India OBC Students Association

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్ లో *బిసి మేధావుల సదస్సు* నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య గారు పాల్గొని ఓబీసీలకు కుల ప్రాతపదికన జనాభా లెక్కలు చెయ్యాలి మరి కొన్ని డిమాండ్స్ కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. ఓ బి సి సమస్యలను పరిష్కరించడంలో బీసీ విద్యార్థుల పాత్ర ముఖ్యమైనదని విద్యార్థులు చైతన్యవంతమై బీసీ సమస్యల పైన పోరాడాలని కోరారు. అలాంటి పోరాటంలో తన పూర్తి మద్దతు ఉంటుందని తెలియచెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరి నార్కి గారు పాల్గొని కుల గణన, ఓబిసి బడ్జెట్ ఓబీసీ దేశ పాలసీ మీద సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ ఓ బి సి సమస్యల మీద దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు.

సామాజిక ఉద్యమాలు విజయవంతం అవ్వాలంటే మేధావుల పాత్ర చాలా ముఖ్యమైనది. బీసీల సమస్యలు తీరడానికి కావలసిన అంశాల మీద మేధావుల సూచనలు చాలా ముఖ్యమని ఆల్ ఇండియా ఓబీసి స్టూడెంట్స్ అసోసియేషన్ భావిస్తుంది. అందువలన బీసీ మేధావులంతా ఢిల్లీకి కదిలి వచ్చి దిశా నిర్దేశం చేసిన బీసీ పెద్దలకు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు ధన్యవాదములు తెలిపారు.
అలాగే రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు పాల్గొని బీజేపీ ప్రభుత్వం బీసీలకు ఇప్పటి వరకు చాలా పనులు చేస్తూ వచ్చింది.ఇంకా ముందు ముందు ఉన్న డిమాండ్స్ ని బీజేపీ ప్రభుత్వం చెప్పి చేయిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అలాగే చాలా పెద్ద ఎత్తున ఓబీసీ మేదావులు పాల్గొని పలు సమస్యలపైన చర్చించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు అడ్వకేట్లు డాక్టర్లు తోపాటు జోహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్ర విద్యాలయం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, జామీయా ఇస్లామియా యూనివర్సిటీ ఐఐటి ఎన్ఐటీ ల నుంచి పెద్ద ఎత్తున రీసెర్చ్ స్కాలర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

18/12/2022
All are Invited
18/12/2022

All are Invited

*అంబేద్కర్ స్ఫూర్తితో బీసీ హక్కుల కోసం పోరాడుతాం  - AIOBCSA*హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ...
07/12/2022

*అంబేద్కర్ స్ఫూర్తితో బీసీ హక్కుల కోసం పోరాడుతాం - AIOBCSA*

హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర విద్యార్థులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా రాజీనామా చేస్తూ రెండు ముఖ్యమైన కారణాలను చెప్పడం జరిగింది. మహిళలకు సమాన హక్కులను కల్పించే హిందూ కోడ్ బిల్ ఆమోదించకపోవడం మొదటి కారణమైతే బీసీలకు రిజర్వేషన్లు కనిపించకపోవడం రెండో కారణం. బీసీలు ఒకరి కింద ఉండకూడదని, బీసీల అభివృద్ధి కేవలం రాజకీయంగా ఎదుట మరియు విద్య ద్వారానే సాధ్యమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా బీసీలు రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ను ఆదర్శంగా ముందుకు తీసుకుని వెళ్తూ బీసీల అభివృద్ధి కోసం పాల్పడతామని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీ కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AIOBCSA జాతీయ కోఆర్డినేటర్ నరేష్ యాదవ్, యూనివర్సిటీ ప్రెసిడెంట్ విజయ్ ముదిరాజ్, హాసిని, రాజు, పవన్, వెంకటేష్, రాకేష్ చారి మరియు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.

Address

Gachibowli
Banjara Hills

Website

Alerts

Be the first to know and let us send you an email when All India OBC Students Association, Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share