TDP Avanigadda

Directions Website

TDP Avanigadda Telugu Desam Party will strive to empower, youth and backward segments of the society in Andhrapradesh.

*ఉత్తమ సేవలు అందించిన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సన్మానం*మోపిదేవి: ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఉత్తమ సేవల...
23/09/2026

*ఉత్తమ సేవలు అందించిన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సన్మానం*

మోపిదేవి: ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన ప్రజాప్రతినిధులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించారు. బుధవారం మోపిదేవిలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ పాలకవర్గ పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎంపీపీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, చల్లపల్లి ఎంపీపీ కోట విజయ రాధికలను ఘనంగా సత్కరించారు. మోపిదేవి, చల్లపల్లి మండలాల అభివృద్ధిలో వారి పాత్ర ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

*పదవీ విరమణ చేస్తున్న ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం*మోపిదేవి:పదవీకాలం పూర్తిచేసుకుని పదవీ విరమణ చేస్తున్న ప్రజాప్రతినిధుల...
23/09/2026

*పదవీ విరమణ చేస్తున్న ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం*

మోపిదేవి:పదవీకాలం పూర్తిచేసుకుని పదవీ విరమణ చేస్తున్న ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.బుధవారం మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి,
అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు,నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పాల్గొని ప్రజాప్రతినిధులను సత్కరించారు.

మోపిదేవి ఎంపీపీగా సేవలందించిన రావి దుర్గావాణి,చల్లపల్లి ఎంపీపీ కోట విజయరాధిక,మోపిదేవి జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ,పదవీకాలంలో ప్రజలకు అందించిన సేవలను అభినందించారు. స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన ప్రజాప్రతినిధుల సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమన్నారు. పదవీ విరమణ చేసినప్పటికీ ప్రజా జీవితంలో వారి అనుభవం,సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో స...
18/09/2026

దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం.

ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు... 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది...
భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.....
బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది...
ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది.

దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.

సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో....సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నాం.

---------------------నారా చంద్రబాబునాయుడు.

 #చల్లపల్లిలో ఘనంగా  #శ్రీవిశ్వకర్మజయంతిచల్లపల్లి : దేవశిల్పి, సృష్టి నిర్మాణకర్త భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతిని చల్లపల్ల...
18/09/2026

#చల్లపల్లిలో ఘనంగా #శ్రీవిశ్వకర్మజయంతి

చల్లపల్లి : దేవశిల్పి, సృష్టి నిర్మాణకర్త భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతిని చల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. సూర్యుడు కన్యాసంక్రమణంలోకి ప్రవేశించిన రోజున విశ్వకర్మ జయంతిగా జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయం వద్ద విశ్వకర్మపతాకాన్ని ఎగురవేసి పూజలు చేశారు. ఆలయంలో పరమాత్మ విశ్వకర్మ చిత్రపటానికి పూజలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సభ్యురాలు డా.ఓలేటి ఉమాసరస్వతి ముఖ్యఅతిధిగా పాల్గొని విశ్వకర్మ వైభవాన్ని, విశిష్టతను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంపీడీవో ఓలేటి వెంకటరమణ, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు నడకుదురు లీలాబ్రహ్మేంద్ర, కేశనకుర్తి శరత్ బాబు, అడ్డాడ ప్రసాద్ బాబు, చల్లపల్లి మండల నేతలు శామీరుపేట సాయిబాబు, డోలా శ్రీనివాసరావు, అయ్యంకి నాగబ్రహ్మాచారి, కేశనకుర్తి రవీంద్రబాబు, శామీరుపేట సుబ్బయ్య, నాగరాజు, సత్యనారాయణ, అద్దంకి సత్యనారాయణ, కనగాల రాధాకృష్ణ, పట్నాల రాజా, యలమర్తి శేఖర్, కాద రాజేష్, అడ్డాడ చంద్రమోహన్, శ్రీరాం కిరణ్, తేజ, సుబ్బు, నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం*...రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో *టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఐక్యతను మర...
15/09/2026

*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం*...

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో *టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసి,సమన్వయంతో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా* ఈరోజు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు
*శ్రీ బోడే ప్రసాద్ గారి కార్యాలయంలో* కీలక కూటమి నాయకుల సమావేశం జరిగింది...

ఈ సమావేశంలో *జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ వీరంకి గురుమూర్తి గారు, అవనిగడ్డ శాసనసభ్యులు, జనసేన పార్టీ మచిలీపట్టణం, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గముల స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీడీపీ కృష్ణాజిల్లా ఎన్నికల ఇంచార్జి, శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు, ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిలకలపూడి పాపారావు గారు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ బండి రామకృష్ణ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ తాతినేని శ్రీరామ్ గారు, శ్రీ కుమారస్వామి గారు, జనసేన నాయకురాలు పినిశెట్టి నాగ ఛాయాదేవి తదితరులు* పాల్గొన్నారు...

పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు… మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు ప్రతి స్థాయిలో *కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా* మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు...

గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు* జనసేన అధినేత *శ్రీ పవన్ కళ్యాణ్ గారు* ప్రధానమంత్రి *శ్రీ నరేంద్ర మోదీ గారి* నాయకత్వంలో అభివృద్ధి–సంక్షేమాన్ని కొనసాగిస్తూ *సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే* మన అందరి సంకల్పం...

*మూడు పార్టీలు… ఒకే మాట*
*ఒకే బాట… ఐక్యతే మా బలం*
*కూటమి విజయమే మా లక్ష్యం*

*కూటమి కలిసే ఉంది… కలిసే ఉంటుంది*
*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ ఢంకా మోగించడం ఖాయం*
*కూటమి జెండా ఎగరడం ఖాయం*

 #తుమ్మలజనార్ధనబాబు సేవలు చిరస్మరణీయంజనార్దన్ బాబుకు  #ఎమ్మెల్యేబుద్ధప్రసాద్ నివాళులు #ఘంటసాల: తెలుగుదేశం పార్టీ సీనియర్...
12/09/2026

#తుమ్మలజనార్ధనబాబు సేవలు చిరస్మరణీయం
జనార్దన్ బాబుకు #ఎమ్మెల్యేబుద్ధప్రసాద్ నివాళులు

#ఘంటసాల:
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల జనార్ధనబాబు సేవలు చిరస్మరణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాల మండల పరిధిలోని కొడాలి గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మండపంలో శనివారం జనార్ధనబాబు సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనార్ధనబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ ప్రాంత పెద్దగా, కొడాలి పరిసర గ్రామాల అభివృద్ధికి, కొడాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా రైతుల సంక్షేమానికి, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి జనార్ధనబాబు కృషి మరువలేనిది అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన జనార్ధనబాబు మృతి బాధాకరమని తెలిపారు.

ఈ సందర్భంగా జనార్ధనబాబు చిత్రపటానికి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, నియోజకవర్గ ప్రముఖులు శీలం అశ్విన్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, కృష్ణా మిల్క్ యూనియన్ కార్యవర్గ సభ్యులు వేమూరి సాయి వెంకటరమణ, కోనేరు బలరాం, నివాళులు అర్పించారు. టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు తదితరులు పాల్గొన్నారు.

చల్లపల్లి ఎన్టీఆర్ స్కూల్‌లో భువనేశ్వరి ఆప్యాయ పలకరింపు.
11/09/2026

చల్లపల్లి ఎన్టీఆర్ స్కూల్‌లో భువనేశ్వరి ఆప్యాయ పలకరింపు.

 #మచిలీపట్నంపార్లమెంట్‌ పరిధిలో  #టీడీపీ ఎమ్మెల్యేలు,ఇంచార్జ్ లు సమన్వయ సమావేశం #అవనిగడ్డ : కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్...
08/09/2026

#మచిలీపట్నంపార్లమెంట్‌ పరిధిలో #టీడీపీ ఎమ్మెల్యేలు,ఇంచార్జ్ లు సమన్వయ సమావేశం

#అవనిగడ్డ : కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సమన్వయ సమావేశం పెనమలూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగింది. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

ప్రతి నెలా ఒక్కో ఎమ్మెల్యే నివాసం లేదా నియోజకవర్గంలో నిర్వహించే ఈ సమన్వయ సమావేశంలో కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని నియోజకవర్గాల్లోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా పెనమలూరులో జరిగిన సమావేశానికి కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ,కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి , కృష్ణా జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ ,ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందిస్తూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

సమాజ అభ్యున్నతిలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి.సమాజ అభ్యున్నతిలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ ...
05/09/2026

సమాజ అభ్యున్నతిలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి.
సమాజ అభ్యున్నతిలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాస్ అన్నారు.
అవనిగడ్డ లోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం దివి యూనిట్ భవనంలో శనివారం సంఘ అధ్యక్షులు భూపతి భాస్కరరావు అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్కుర్తి శ్రీనివాస్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొల్లూరు కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కొల్లూరు శ్రీనివాసరావు 42వేల రూపాయలపైగా విలువ కలిగిన మైక్ సెట్ ను సంఘ భవనానికి అందజేశారు.

ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ.... చిన్న కుటుంబంలో జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అంచలంచలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన తీరు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దివిసీమ ఉపాధ్యాయులను తయారు చేసే పరిశ్రమ అని కొనియాడారు.ఎంతోమంది ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత అవనిగడ్డకు చెందుతుందని అన్నారు. ఎంతోమందిని డాక్టర్లు,ఇంజనీర్లు మరి ఎంతోమంది ఉన్నత స్థాయి అధికారులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులకు చెందుతుందన్నారు. తల్లిదండ్రుల తరువాత పిల్లలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు.

అనంతరం జిల్లా కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన మోర్ల వెంకటేశ్వర్లు, మైక్ దాత కొల్లూరు శ్రీనివాసరావు, ఇటీవల రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తుంగల చంద్రశేఖర్, సనకా బాభృవాహనరావు లతో పాటు అతిథిగా పాల్గొన్న విక్కుర్తిని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో భవన నిర్మాణ శాశ్వత కమిటీ గౌరవ అధ్యక్షులు కాశీభోట్ల నాగేశ్వరరావు, సంఘ కార్యదర్శి బొప్పన విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్లమూడి సాగరరావు, ట్రెజరర్ బడే దానారావు లతో పాటు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విక్కుర్తిని కలిసిన జింకపాలెం,గొల్లమంద రైతులునాగాయలంక:  #నాగాయలంకమండలం  #ఎదురుమొండి నుంచి  #జింకపాలెం వెళ్లే ప్రధాన రహదా...
05/09/2026

విక్కుర్తిని కలిసిన జింకపాలెం,గొల్లమంద రైతులు

నాగాయలంక: #నాగాయలంకమండలం #ఎదురుమొండి నుంచి #జింకపాలెం వెళ్లే ప్రధాన రహదారిలో #బ్రహ్మయ్యగారిమూల నుంచి #గొల్లమంద వరకు రహదారి పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని జింకపాలెం, గొల్లమంద గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు శనివారం #అవనిగడ్డనియోజకవర్గతెలుగుదేశంపార్టీఇన్‌చార్జ్ #విక్కుర్తిశ్రీనివాసరావును రైతులు కలిసి రహదారి దుస్థితిని వివరించి, వెంటనే రహదారి నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు.రైతుల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని విక్కుర్తి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన రైతులు అనంతరం విక్కుర్తి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు.

Address

Avanigadda
521121

Alerts

Be the first to know and let us send you an email when TDP Avanigadda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share