మన అవనిగడ్డ

మన అవనిగడ్డ మన అవనిగడ్డ కి సంబంధించిన వారి అందరికీ మన అవనిగడ్డ పేజి లోకి స్వాగతం సుస్వాగతం...

అవనిగడ్డ పౌరులు అందరికి నమస్కారము,
మన అవనిగడ్డ కి సంబంధించిన వారి అందరిని మన అవనిగడ్డ పేజి లోకి ఆహ్వానించాలని నా మనవి, మీ మీ స్నేహితులని, కుటుంబసభ్యులని ఈ పేజి లోకి ఆహ్వానించండి. మన అవనిగడ్డ కుటుంబం లోకి ఆహ్వానించండి, మన అవనిగడ్డ చరిత్ర, విశిష్టత తెలియచెప్పండి.......
ఇది మీ బాధ్యత...మన బాధ్యత

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు–2026 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ,అవనిగడ్డ నియోజకవర్గం...
29/05/2026

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు–2026 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ,
అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బొబ్బా గోవర్ధన్ గారు పార్టీకి రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) విరాళంగా అందించడం అభినందనీయం.
పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమైనది.
శ్రీ బొబ్బా గోవర్ధన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనకు మరింత రాజకీయ విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాము.

ఇట్లు
అవనిగడ్డ తెలుగుదేశం కుటుంబం







మీసాల మాస్టారు ఎంతమందికి తెలుసు ?అవనిగడ్డలోని ప్రముఖ RSS కార్యకర్త శ్రీ శనగవరపు వెంకటేశ్వర్లు ( మీసాల మాస్టారు) గారి 10వ...
25/05/2026

మీసాల మాస్టారు ఎంతమందికి తెలుసు ?

అవనిగడ్డలోని ప్రముఖ RSS కార్యకర్త శ్రీ శనగవరపు వెంకటేశ్వర్లు ( మీసాల మాస్టారు) గారి 10వ వర్థంతి సందర్భంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..

ఆరోజుల్లో గుబురైన మీసాలతో, ఖంగుమనే గొంతుతో అవనిగడ్డకే ప్రత్యేకమైన మీసాల మాస్టారును చూడని, బెదరని, అభిమానించని వాళ్ళు ఎవరూ ఉండరు..
















https://forms.gle/fxppSPvfSsWQERL98శ్రీ హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొనే వారు ముందుగా ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోగలరు
10/05/2026

https://forms.gle/fxppSPvfSsWQERL98

శ్రీ హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొనే వారు ముందుగా ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోగలరు

డాక్టర్ సిద్ధినేని గోపాలకృష్ణమూర్తి కన్నుమూత*************************************​అవనిగడ్డ: ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద్...
03/05/2026

డాక్టర్ సిద్ధినేని గోపాలకృష్ణమూర్తి కన్నుమూత
*************************************
​అవనిగడ్డ: ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద్ధినేని గోపాలకృష్ణమూర్తి (78) ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
​గతంలో ఆయన తన సతీమణితో కలిసి అవనిగడ్డలో కస్తూరిబాయి నర్సింగ్ హోమ్‌ను నిర్వహించి, ఎంతోమందికి వైద్యసేవలు అందించారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య మరణించడం జరిగింది.
​డాక్టర్ గోపాలకృష్ణమూర్తి మృతి పట్ల స్థానికులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

​దహన సంస్కారాలు: సోమవారం ఉదయం వారి స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






02/04/2026

జై అమరావతి...
పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది. దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా ఇది నిలిచిపోతుంది.





శ్రీరామనవమి పండుగ అంటే ఒకప్పుడు పల్లెల్లో సాయంత్రం వేళ కనిపించే ఆ పచ్చని "వేపాకుల గుడి" సందడి ఇప్పుడు కేవలం ఒక తీపి జ్ఞా...
27/03/2026

శ్రీరామనవమి పండుగ అంటే ఒకప్పుడు పల్లెల్లో సాయంత్రం వేళ కనిపించే ఆ పచ్చని "వేపాకుల గుడి" సందడి ఇప్పుడు కేవలం ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోతోంది.

ఆ రోజుల్లో సాయంత్రం కాగానే చిన్నారులందరూ గుంపులు గుంపులుగా చేరి, తాజా వేప రెమ్మలతో ఒక చిన్న గుడిని తయారు చేసేవారు. ఆ వేపాకుల గుడిని చేతబట్టుకుని వీధివీధికీ తిరుగుతూ, "శ్రీరామ జయరామ జయజయరామ" అంటూ భక్తితో పాడుతుంటే ఆ పల్లె వీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయేవి. ఆ పసివాళ్ల గొంతుల్లోని రామనామం ప్రతి ఇంటి గడపను తట్టి పండుగ ఉత్సాహాన్ని నింపేది. పిల్లలు తమ ఇంటి ముందుకు రాగానే గృహిణులు ఎంతో ఆదరంగా ఆహ్వానించి, ఆ వేపాకుల గుడిపై నీళ్లు చల్లి మొక్కుకునేవారు. ఆ వేపాకుల గుడి తమ ఇంటికి వస్తే శుభం జరుగుతుందని నమ్మే పెద్దలు, ఆ పిల్లలకు దోసెడు బియ్యం, చేతికి అందినంత చిల్లర డబ్బులను కానుకగా ఇచ్చేవారు.

అలా వారం పది రోజుల పాటు సాయంత్రం పూట కష్టపడి సేకరించిన ఆ బియ్యాన్ని, చిల్లరను పిల్లలందరూ ఒకచోట ఎంతో జాగ్రత్తగా దాచుకునేవారు. చివరకు శ్రీరామనవమి పండుగ రోజున ఆ బియ్యం, డబ్బులతో పిల్లలందరూ కలిసి ఒకచోట చేరి పండగ చేసుకునేవారు. సేకరించిన బియ్యంతో పిండివంటలు, తీపి పదార్థాలు వండించుకుని, ఆ చిల్లర డబ్బులతో ఇతర తినుబండారాలు కొనుక్కుని అందరూ కలిసి పంచుకుని తినేవారు. తాము స్వయంగా సేకరించిన వాటితో వండుకున్న ఆ వంటల్లో ఉండే రుచి, ఆ సంతోషం వర్ణనాతీతం. ఆ రోజున ఒక్క గింజ కూడా వదలకుండా, ఒక్క పైసా కూడా మిగల్చకుండా తాము సేకరించిన వనరులన్నింటినీ ఆ ఉత్సవం కోసమే వినియోగించేవారు.

కానీ కాలక్రమేణా ఆ ముచ్చటైన సంప్రదాయం కనుమరుగవుతోంది. నేటి ఆధునిక పోకడల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు, టీవీలకు పరిమితమైపోతుంటే, పల్లెల్లో కూడా ఆ పాత తరపు వేడుకలు (వెంకట్ ఇమ్మడిశెట్టి) వెలవెలబోతున్నాయి. సాయంత్రం పూట ఇంటింటికీ తిరుగుతూ, రామనామాన్ని స్మరిస్తూ బియ్యం, చిల్లర సేకరించే ఆ అమాయకపు చిన్నారుల సందడి ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు.

కాంక్రీటు జంగిల్స్‌లో వేప చెట్లు కరువవ్వడం ఒక కారణమైతే, మన సంస్కృతిలోని ఇలాంటి చిరు వేడుకలను భావితరాలకు అందించడంలో మనం వెనుకబడిపోవడం మరో కారణం. ఆత్మీయతతో కూడిన ఆ వేపాకుల గుడి, ఆ రామనామ స్మరణ లేని శ్రీరామనవమి ఇప్పుడు కొంత వెలితిగానే అనిపిస్తోంది. మన కళ్ళముందే కనుమరుగవుతున్న ఇలాంటి అందమైన ఆచారాలను గుర్తు చేసుకోవడం, కాపాడుకోవడం మనందరి బాధ్యత.

వెంకట్ ఇమ్మడిశెట్టి🤚



























JEE మెయిన్స్‌లో దివిసీమ విద్యార్థి ప్రభంజనంఅవనిగడ్డకు చెందిన విద్యార్థి విశ్వనాధుని జయంత్ సాయి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్...
17/02/2026

JEE మెయిన్స్‌లో దివిసీమ విద్యార్థి ప్రభంజనం

అవనిగడ్డకు చెందిన విద్యార్థి విశ్వనాధుని జయంత్ సాయి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష JEE మెయిన్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జయంత్ సాయి 99.78 పర్సంటైల్ సాధించి దివిసీమ కీర్తిని చాటారు.

విశ్వనాధుని రమేష్, యలవర్తి నగరాజ కుమారి ల జ్యేష్ఠ కుమారుడైన జయంత్ సాయి తన విద్యా ప్రస్థానాన్ని అవనిగడ్డలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ప్రారంభించి, ఎనిమిదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. అనంతరం ఉన్నత విద్య కోసం కానూరు, గూడవల్లి శ్రీ చైతన్య సంస్థల్లో చేరి తన చదువును కొనసాగించారు. మొదటి నుండి చదువులో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న జయంత్ సాయి, పదవ తరగతిలో 600 మార్కులకు గాను 591 మార్కులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి తన సత్తా చాటారు. ఇప్పుడు JEE మెయిన్స్‌లోనూ అత్యుత్తమ పర్శంటేజ్ సాధించడంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో ఐఐటీలో సీటు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

పులిగడ్డ సర్కిల్ వద్ద "మృత్యు సాక్షి"  --ఆ ధ్వంసమైన కారు మీకేం చెబుతోంది?అవనిగడ్డ : ముల్లును ముల్లుతోనే తీయాలంటారు పెద్ద...
17/02/2026

పులిగడ్డ సర్కిల్ వద్ద "మృత్యు సాక్షి"
--ఆ ధ్వంసమైన కారు మీకేం చెబుతోంది?

అవనిగడ్డ : ముల్లును ముల్లుతోనే తీయాలంటారు పెద్దలు.. అలాగే అవనిగడ్డ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ ఆదేశాల మేరకు, అవనిగడ్డ డిఎస్పీ టి.విద్యాశ్రీ నేతృత్వంలో, అవనిగడ్డ సిఐ జి. యువకుమార్ మరియు ఎస్ ఐ కె.శ్రీనివాస్ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

మాటలతో చెప్పే హెచ్చరికల కంటే, కళ్లకు కనిపించే దృశ్యం ప్రాణాల విలువను చాటి చెబుతుందని నమ్మిన పోలీసులు, పులిగడ్డ సర్కిల్ వద్ద గతంలో ప్రమాదానికి గురైన ఒక కారును "డెమో"గా ప్రదర్శిస్తున్నారు.

పులిగడ్డ సర్కిల్ అంటేనే ప్రమాదాలకు నిలయంగా మారిందన్న చేదు నిజం మనందరికీ తెలిసిందే. గతంలో ఇక్కడ ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయి, మరెన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎందరో తల్లుల కడుపుకోతకు, మరెన్నో కుటుంబాల విషాదానికి ఈ ప్రాంతం సాక్షిగా నిలిచింది. సరిగ్గా అదే ప్రాంతంలో ఇప్పుడు పూర్తిగా ధ్వంసమై, ఇనుప తుక్కులా మారిన ఈ కారు అస్థిపంజరాన్ని చూడగానే ప్రతి వాహనదారుడిలోనూ ఒక్కసారిగా వణుకు పుడుతోంది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ ప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపించేలా, ఆ ధ్వంసమైన కారుపై పోలీసులు రేడియం స్టిక్కర్లు అంటించారు. చీకట్లో వాహనాల లైట్లు పడగానే ఈ రేడియం స్టిక్కర్లు మెరుస్తూ, అతివేగం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో నిశ్శబ్దంగా హెచ్చరిస్తున్నాయి. ఆ వాహన స్థితిని చూస్తుంటే, ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్న ప్రాణాలు ఏమయ్యుంటాయో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది.

పులిగడ్డ సర్కిల్ మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడికి ఈ కారు ఒక మేల్కొలుపులా కనిపిస్తోంది. వేగం ఇచ్చే క్షణికానందం కంటే, మీ కోసం ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల చిరునవ్వే ముఖ్యం అని ఈ వాహన శిథిలాలు గుర్తుచేస్తున్నాయి.

పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ మెరిసే కారు శిథిలాల వైపు ఒక్కసారి చూడండి.. అది మీ ప్రాణానికి ఇచ్చే విలువైన సలహా అని గ్రహించండి.

సినిమా రంగంలో అవనిగడ్డ యువకుడి అడుగు.. "కథిలే కాలం" టీజర్ విడుదల!మన అవనిగడ్డ నియోజకవర్గం పెదకళ్ళేపల్లి గ్రామానికి చెందిన...
11/02/2026

సినిమా రంగంలో అవనిగడ్డ యువకుడి అడుగు.. "కథిలే కాలం" టీజర్ విడుదల!

మన అవనిగడ్డ నియోజకవర్గం పెదకళ్ళేపల్లి గ్రామానికి చెందిన యువకుడు దాసరి మణికంఠ సినీ రంగంలో నిర్మాతగా అడుగుపెట్టడం విశేషం. SRI PR MOVIES మరియు DASARIS MEDIA బ్యానర్లపై, PRABHA WRITINGS సమర్పణలో ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం “కథిలే కాలం”. ఈ చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ
ప్రేమలోని మధురత, విరహంలోని బాధ, మరియు కాలం గడిచే కొద్దీ మనుషుల మధ్య వచ్చే మార్పులను అద్భుతంగా మేళవిస్తూ దర్శకుడు వినయ్ ప్రభా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. "ప్రేమకు కాలం ఎలా పరీక్షగా మారుతుంది?" అనే ఆసక్తికరమైన అంశంతో, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఈ కథ ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది.

సాధారణంగా మన ప్రాంతం నుండి ఎంతోమంది ప్రతిభావంతులు వివిధ రంగాల్లో రాణిస్తుంటారు. ఇప్పుడు దాసరి మణికంఠ సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి, "కథిలే కాలం" వంటి ఒక భావోద్వేగపూరితమైన చిత్రంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టడం మన నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువతకు గర్వకారణంగా నిలుస్తోంది. ఆయన ఈ చిత్రంతో పెద్ద విజయం సాధించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

ఈ చిత్రానికి ప్రుధ్వీరాజ్ మరియు మణికంఠ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సాంకేతికంగా సినిమాను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు.
* సినిమాటోగ్రఫీ: సునీల్ అంబటి
* సంగీతం: సమీర్, సామ్ బీట్స్
* ఎడిటింగ్: FOCUSCLIX
వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలయ్యే టీజర్‌లో విజువల్స్, డైలాగులు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.

చల్లపల్లి : అంధత్వాన్ని వెనక్కి నెట్టి.. ఆత్మవిశ్వాసంతో విజయం * గ్రూప్-2లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికైన నందం నాగరాజు * ...
07/02/2026

చల్లపల్లి : అంధత్వాన్ని వెనక్కి నెట్టి.. ఆత్మవిశ్వాసంతో విజయం
* గ్రూప్-2లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికైన నందం నాగరాజు
* ప్రమాదంలో కంటి చూపు దూరమైనా సడలని ఆత్మవిశ్వాసం
* పదవ తరగతి నుంచే 75 శాతంపైగా ఉత్తీర్ణత సాధిస్తూ ముందుకు..
* గెజిటెడ్ ఆఫీసర్ కావాలన్నదే లక్ష్యం

ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం చిన్నబోయింది. ప్రమాదంలో కంటి చూపు కోల్పోయి.. కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకుంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు. గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ముందుకుసాగిన ఆ యువకుడు గ్రూప్ - 2 ఫలితాల్లో విజయం సాధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాడు. అంధత్వాన్ని వెనక్కి నెట్టి.. ఆత్మవిశ్వాసంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు శివరామదుర్గాపురం(సాలిపేట)కు చెందిన నందం నాగరాజు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెచ్‌వోడీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరనున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

జీవితాన్ని తలకిందులు చేసిన రోడ్డు ప్రమాదం:

2010లో హైదరాబాద్‌లో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు కంటి చూపును కోల్పోయాడు. అప్పుడు చల్లపల్లి రాజా హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఒక కంటికి మూడు సార్లు శస్త్రచికిత్స చేసినా కన్ను తిరిగిరాలేదు. మరో కంటిచూపు సైతం క్రమేపీ తగ్గిపోయింది. ఆ రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఇదేళ్ళు ఇంటి పట్టునే ఉండిపోయిన నాగరాజు కంటిచూపు పోయిందనే బాధను దిగమింగుకుని 2015లో ఒంగోలులోని బ్లైండ్ హాస్టల్‌లో చేరాడు. అక్కడే ఉంటూ 78 శాతం మార్కులతో పదవ తరగతి పాసయ్యాడు. 86 శాతంతో ఇంటర్మీడియట్, 80 శాతంతో డిగ్రీ, 75 శాతంతో ఎంఏ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్‌లో కళాశాల ఫస్టు రావడంతో 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ప్రతిభా అవార్డు, ల్యాప్‌టాప్, గోల్డ్‌మెడల్, రూ.20వేల నగదు అందుకున్నాడు. 2022లో ఎంఏ చదువుతూ పోటీ పరీక్షలు రాయటం మొదలుపెట్టాడు. గ్రూప్-2 రాసేందుకు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నాడు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో స్క్రైబ్ (సహాయకుడు) సహాయంతో గ్రూప్-2 పరీక్ష రాశాడు.

అండగా నిలిచిన తల్లి:

చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన కుమారుడికి తల్లి నందం వెంకటేశ్వరమ్మ అండగా నిలిచింది. సాలిపేట ఎంపీయూపీ పాఠశాలలో ఆమె వంట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. తండ్రి మోహనరావు 2018లో విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. నాగరాజుకు అక్క, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు చదువు మానేసి బేకరీలో పనికి వెళ్తున్నాడు. అక్కకు వివాహం చేశారు. తండ్రి మరణించినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న బీమా ద్వారా వచ్చిన రూ.5 లక్షలు ఆర్థిక భరోసాను కల్పించాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రూ.6వేల పింఛను, తల్లి కుకింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.

చూపు లేకున్నా ధైర్యంగా..:

కంటిచూపు లేకున్నా నాగరాజులో ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలలేదు. అధికారి కావాలన్న లక్ష్యమే అతన్ని ముందుకు నడిపించింది. సబ్జెక్టులను రికార్డ్ చేసుకుని వినటం, మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ పాఠాలు వినటం ద్వారా సబ్జెక్టును అవపోసన పట్టాడు. హిందూపురానికి చెందిన విజన్ త్రూ ఇయర్స్ సంస్థ ఆడియో రికార్డ్ చేసి ఇచ్చేవారు. ఉన్నత విద్యాభ్యాసంలో ఇవీ ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ఆత్మవిశ్వాసంతో విజయం

కుమారుడు గ్రూప్-2లో ఉద్యోగం సాధించటంతో తమ కష్టానికి ఫలితం లభించిందని తల్లి వెంకటేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
వారి సహాయం మరిచిపోలేను : నాగరాజు
ఉన్నత చదువుల నుంచి నేటి గ్రూప్-2 పరీక్షల్లో విజయం సాధించే వరకూ ఇద్దరి సహాయం మరచిపోలేనిది. ఒంగోలుకు చెందిన విశ్రాంత బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి జి.నారాయణరావు, లక్ష్మి దంపతులు ఆర్థికంగా సహకరించటంతోపాటు పాఠాలు రికార్డ్ చేసి ఇచ్చేవారు. అలాగే విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త దుర్గాప్రసాద్ ఆర్థిక సహకారం అందించారు. గెజిటెడ్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యం. జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే, భవిష్యత్తులో మళ్లీ పరీక్షలకు సిద్ధమై అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా. పరీక్షల సమయంలో సహాయకులుగా బాగా చదువుకున్న వ్యక్తులు ఉంటే మరింతగా మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం దివ్యాంగుల ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థికంగా సహకారం అందించి ప్రోత్సహించాలి.

Address

Avanigadda

Alerts

Be the first to know and let us send you an email when మన అవనిగడ్డ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to మన అవనిగడ్డ:

Share