26/11/2023
ప్రచురణార్థం/ప్రసారార్థం
తేదీ: 26-11-2023
ఆదివారం,
దమ్మపేట.
బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలి
రైతుబంధుకు అనుమతించడం అంటే బిఆర్ఎస్ పార్టీకి మేలు చేసే విధంగా ఈసీ వ్యవహరించడమే.....
-అన్నవరపు కనకయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి
డబ్బు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకునే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను ఓడించండి.....ప్రజా పోరాటాల సారథి సిపిఎం ను గెలిపించండి....
అశ్వరావుపేట నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి పిట్టల అర్జున్ గెలుపుకై భారీ బైక్ ర్యాలీ....
స్థానిక దమ్మపేట మండలం సిపిఎం పార్టీ మండల కార్యాలయం నుండి వందలాది బైక్ లతో ర్యాలీగా మండలం మొత్తం ప్రచారం నిర్వహించారు. సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఎర్రజెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కేవలం డబ్బు ద్వారానే ఎన్నికల్లో గెలవొచ్చనే ధోరణితో వ్యవహరిస్తున్నాయనీ, అటువంటివారిని ఈ ఎన్నికల్లో ఓడించి ప్రజా పోరాటాల సారథి సిపిఎం పార్టీని గెలిపించాలని కోరారు. ఇప్పటినుండే డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యలను ప్రతి ఓటరు తీవ్రంగా ఖండించాలన్నారు. పోడు భూములకు పట్టాల కోసం, బీడు భూములకు సాగునీరు అందించేందుకు, ఉపాధి హామీ చట్టం క్రింద కూలీలకు రోజువారీ కనీస వేతనం ఇచ్చేందుకు, దేశంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడంలో, పకడ్బందీగా అమలు చేసేందుకు సిపిఎం పార్టీ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలు గూర్చి ఏ రోజు మాట్లాడని కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి దిగారన్నారు.గతంలో గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందనీ, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారనీ, కెసిఆర్ ప్రభుత్వ పథకాలంటూ బూటకపు హామీలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. పోడు సాగుదారులందరికీ పట్టాలివ్వాలని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని సిపిఎం పార్టీ అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు రహదారుల దిగ్బంధనం చేసిందన్నారు. దీనితో ప్రభుత్వం దిగివచ్చి పట్టాలిచ్చిందని అన్నారు. సాగు భూముల్లో హరితహారం పేరిట మొక్కలు నాటితే ఫారెస్ట్, ప్రభుత్వ నిర్బంధాలను అధిగమించి కొట్లాడింది సిపిఎం పార్టీనే అన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో గిరినేతరులకు పోడుపట్టాలివ్వలేదని,తాము గెలిస్తే పోడు పట్టాల కోసం కొట్లాడుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రైతుబంధుకు ఎన్నికల కమిషన్ అనుమతించడం అంటే టిఆర్ఎస్ పార్టీకి మేలు చేసే విధంగా వ్యవహరించడమేనని, కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి దాని కూటమిలోని రాజకీయ పార్టీలు ఒక్క తాను ముక్కలే అని విమర్శించారు.
నియోజకవర్గంలో పామాయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేస్తాం
-కొక్కెరపాటి పుల్లయ్య, పార్టీ అశ్వరావుపేట నియోజకవర్గ కన్వీనర్
నియోజకవర్గంలో అధికంగా పామాయిల్ సాగు చేసుకునే రైతులు ఉన్నారని, తమను గెలిపిస్తే పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వంతో కొట్లాడుతామని, ఇక్కడే పామాయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేస్తామని, పామాయిల్ గెలలు కొట్టే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతామని అన్నారు. సాగు చేసుకునే భూముల్లో మొక్కలు నాటి ఫారెస్ట్ అధికారులు ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తే,వారి ఆగడాలకు ఎదురు నిలిచి కొట్లాడింది సిపిఎం పార్టీనే అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలను ఓడించి, నిత్యం ప్రజల మధ్య ఉండే ఎర్ర జెండా బిడ్డను ఇవియంలో ఒకటో నెంబర్ పై తమ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాయమాటలు చెప్పే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలను నమ్మొద్దని , బిజెపి దాని కూటమిలోని రాజకీయ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ బైక్ ర్యాలీలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ లక్ష్మీనారాయణ, దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
సిపిఎం పార్టీ మండల కమిటీ
దమ్మపేట
మోరంపూడి శ్రీనివాసరావు
మండల కార్యదర్శి