Cpm Anantapuram

Cpm Anantapuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cpm Anantapuram, Social service, Anantapur.

02/09/2025

“ఎర్రజెండా ఉద్యమం ముందు ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు కూడా వణికిన రోజులు కర్నూల్ లో ఉన్నాయి. ఎర్ర జెండా ఆస్పరి మండలంలో భూముల బాగోతం బయటపెట్టిన జ్ఞాపకాలు నీకూ ఉన్నాయి. అహంకారంగా మాట్లాడితే మళ్లీ ఎర్రజెండా పోరాట రుచి చూపించాల్సి వస్తుంది… జాగ్రత్త ఎమ్మెల్యే!”

26/11/2023
20/06/2023

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో నిర్వాకం
* రెండు రోజుల తర్వాత ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రం ముందే ఇచ్చిన వైనం!
* ఎట్టకేలకు పరీక్ష రద్దు

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో అడుగడుగునా ఏదో ఒక రూపంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కళాశాలలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి యాజమాన్యం తప్పిదం వల్ల మరో నిర్వాకం చోటుచేసుకుంది. బి ఎ సెమిస్టర్ హిస్టరీ ప్రశ్నాపత్రం బుధవారం ఇవ్వాల్సి ఉండగా సోమవారమే ఆ ప్రశ్న పత్రం ఇచ్చినట్టు తెలిసింది. పరీక్ష రాసే విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేయడంతో పరీక్ష రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ అంశం బయటికి పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరీక్షల విభాగం కంట్రోలర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. కళాశాల యాజమాన్యం ఆయనకు మెమో ఇచ్చిందో లేదో తెలియదు. కానీ స్వయం ప్రతిపత్తి పొందిన ఈ కళాశాల యాజమాన్యం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ప్రశ్న పత్రం పంపిణీ తతంగం అంశం కరస్పాండెంట్ కు తెలియకుండా కప్పిపుచ్చినట్లు తెలియ వచ్చింది. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఇప్పటికే కళాశాల ప్రాభవం చాలావరకు దెబ్బతింది. ఎన్నో వైఫల్యాలు జరుగుతున్నప్పటికీ గుణపాఠం మాత్రం నేర్చుకోవడం లేదు. మొన్నటి వరకు ఉద్యోగులతో చెలగాటమాడిన కళాశాల యాజమాన్యం సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. అంతేకాక విద్యా బోధన జరిగింది ఒక సిలబస్ ప్రశ్నపత్రం మరో సిలబస్ కింద ఇచ్చినట్లు సమాచారం. స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాల అన్నిట జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అనుభవం లేని వారిని కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టి అనుభవం ఉన్న వారిని లూప్ లైన్ కు పంపడం వల్లే ఇలాంటి నిర్వాకాలు చోటు చేసుకునే అవకాశం వచ్చిందని కళాశాల వర్గాల్లో చర్చ జరుగుతోంది. కళాశాల అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలలో జోక్యం చేసుకునే అధికారం కళాశాల ట్రస్ట్ కు లేదు. అయినప్పటికిని అన్నింటిలోనూ కొందరు ట్రస్టు సభ్యులు, కార్యదర్శి జోక్యం చేసుకుంటూనే ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. మరి పరీక్షల నిర్వహణలో ఎందుకు వారు భాగస్వాములు కాలేదు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ప్రస్తుతం కళాశాల కలగూర గంపలా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా బాధ్యతతో వ్యవహరించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సెమిస్టర్ పరీక్షలన్నింటిని ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యం పై ఉంది....

03/06/2023

ఎస్ ఎస్ బి ఎన్ లో నియంతృత్వ ధోరణి
* ఉద్యోగులకు మూడు రోజులుగా అటెండెన్స్ లేదు
* భారీగా ఉద్యోగులను తొలగించే కుట్ర!
* ఆందోళనలో ఉద్యోగులు

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల యాజమాన్యం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. గత మూడు సంవత్సరాలుగా కళాశాలలో జరుగుతున్న వ్యవహారాలు, తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తే కళాశాల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు, అక్రమాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కోయిసులు యాజమాన్యం, ట్రస్ట్ సభ్యులపై నమోదయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల పేరుతో పలువురిని ఉద్యోగాల నుంచి యాజమాన్యం తొలగించింది. తాజాగా భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు యాజమాన్యం కుట్ర చేసినట్లు సమాచారం అందుతోంది. ఐదు నుంచి 25 సంవత్సరాలుగా కళాశాలలో టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్న 40 నుంచి 50 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా విధులకు హాజరవుతున్న టీచింగ్ సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయడం లేదు. అందుకు కారణం యాజమాన్యం అటెండెన్స్ రిజిస్టర్ ను అందుబాటులో లేకుండా చేసినట్లు సమాచారం. ఇదేమని అడిగితే కళాశాల యాజమాన్యం, అధికారులు నోరు మెదపడం లేదని తెలిసింది. వారిని ఆకస్మికంగా ఉద్యోగాల నుంచి తప్పించే దారుణమైన కుట్ర జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా ఉంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల బూచి చూపి భారీగా ఉద్యోగులను ఏక మొత్తంగా తొలగించి, తమ వంది మాగదులు విధుల్లో ఉండే విధంగా యాజమాన్యం, గతంలో ప్రిన్సిపల్ గా, ప్రస్తుతం ట్రస్ట్ నేత గా ఉంటున్నవారు కలసికట్టుగా కుట్ర చేస్తున్నట్లు తెలియ వచ్చింది.
అటెండెన్స్ రిజిస్టర్ ను అందుబాటులో లేకుండా ఒక పథకం ప్రకారం యాజమాన్యం కుట్ర చేస్తున్నట్లు ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నట్లు తెలియ వచ్చింది.

గతంలో కళాశాలలో కీలక పదవుల్లో కొనసాగి ప్రస్తుతం ట్రస్ట్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు. కళాశాలలో ఉద్యోగుల సమస్యలు, పరిస్థితులు వారికి తెలియనివి కావు. అయినప్పటికిని ట్రస్టు నేతను గాని, యాజమాన్యాన్ని కానీ వారు ప్రశ్నించిన పాపాన పోలేదని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన ట్రస్ట్ సభ్యులు కూడా కళాశాల యాజమాన్యం నియంతృత్వ ధోరణిపై నోరు మిరపకపోవడం ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు.
గత ఆరు నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే కళాశాలను మూతవేసే ప్రక్రియ చాప కింద నీరులా కొనసాగుతున్నట్లు అర్థమవుతుంది. నియంతృత్వంతో భారీగా ఉద్యోగులను తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగులు ఏం చేయాలో దిక్కుతోచని అయోమయ పరిస్థితి లో ఉన్నారు. గతంలో కూడా కొందరు ఉద్యోగులను ఆగమేఘాలపై తొలగించారు. ఇదేమని అడిగితే యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల బూచి చూపారు. ఇప్పుడు కూడా అదే రీతిన ఉద్యోగులను తొలగిస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి..

19/05/2023

ఎస్ ఎస్ బి ఎన్ లో దారి మళ్లిన స్కాలర్ షిప్ ల విలువ రూ. 2.94 కోట్లు * కోటి చెల్లించారు. *మిగిలిన1.94 కోట్ల మాటేమిటి ?
* బీసీ సంక్షేమ శాఖకు జమ కాని ఆ మొత్తం!
* యాజమాన్యంపై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కోర్టులో పిల్ దాఖలు

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో నిధుల దుర్వినియోగం అడ్డు అదుపు లేకుండా సాగిపోయింది. భవన నిర్మాణాల పేరుతో లక్షలాధి రూపాయల గోల్మాల్ జరిగింది. చివరకు ప్రభుత్వం విద్యార్థుల కు ఇచ్చే స్కాలర్ షిప్ ల నిధులను కూడా కొల్లగొట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కు ఆ మొత్తాన్ని ఇవ్వకుండా దారి మళ్లించారు. ప్రధానంగా బీసీ విద్యార్థులకు సంబంధించిన 2009-2018 మధ్యకాలంలో విడుదలైన రూ.2.94 కోట్ల స్కాలర్ షిప్ నిధులను గట్టు చప్పుడు కాకుండా కొల్లగొట్టే ప్రయత్నం జరిగింది. ఆ వ్యవహారం కాస్త రట్టు కావడంతో కళాశాల యాజమాన్యం ఖంగుతింది. ఎట్టకేలకు కోటి రూపాయలను బీసీ సంక్షేమ శాఖకు చెల్లించగలిగారు. ఈ వ్యవహారాలన్నింటిపై అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యాయి. కోర్టులో కూడా వివిధ రకాల పిటిషన్ లు దాఖలయ్యాయి. ఒక పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉండగా, మరో రెండు పిటిషన్ లు అనంతపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. హైకోర్టులో ఉన్న పిటిషన్ పై న్యాయస్థానానికి వేసవి సెలవల అనంతరం విచారణకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల స్కాలర్ షిప్ లను మళ్లించడం ద్వారా ప్రభుత్వానికి రూ.2.94 లక్ష రూపాయలు నష్టం కలిగించారని రిటైర్డ్ ఏఎస్పి రజాక్ అనంతపురం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇందుకు సంబంధించి ఆ మధ్య కాలంలో పనిచేసిన బిసి సంక్షేమ శాఖ అధికారులు, కళాశాల యాజమాన్యం, ట్రస్ట్ సభ్యులు మొత్తం 32 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అటు పోలీసు శాఖకు ఫిర్యాదు చేస్తూనే, కోర్టులో కూడా పిల్ వేశారు. త్వరలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టులో కూడా తన కేసు విచారణకు అడ్వకేట్ ను నియమించుకున్నట్లు రజాక్ చెప్పారు. ఇదిలా ఉండగా కోటి 94 లక్షల రూపాయలు బీసీ సంక్షేమ శాఖకు కళాశాల యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. అయితే ఆ మొత్తం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ మొత్తాన్ని ఏం చేశారు? స్వాహా చేశారా? కళాశాల ఖాతాలకు మళ్లించారా? ఒకవేళ కళాశాల బ్యాంకు ఖాతాలో ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఎందుకు చెల్లించలేదు? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల యాజమాన్యం అంటే విద్యార్థులను తమ పిల్లలుగా భావించి అవసరమైతే తమ జేబులోంచి పది రూపాయలు వారికి ఖర్చు పెట్టాలి. అంతేతప్ప విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్కాలర్ షిప్ లను వారికి చెల్లించకుండా కొల్లగొట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విద్యార్థులకు మంజూరైన స్కానర్ షిప్ లు విద్యార్థులకు అందాయా? లేదా? అన్న అంశాన్ని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఏనాడు పట్టించుకున్నది లేదు. తద్వారా కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు అయిందని విమర్శలు వస్తున్నాయి. పోనీ స్కాలర్ షిప్ నిధులు విద్యార్థులకు అందలేదని, యాజమాన్యం దారి మళ్ళించిందని తెలిసినప్పటికీ కూడా ఆ మొత్తాన్ని వసూలు చేయడంలో నిన్న మొన్నటి వరకు మీన వేషాలు లెక్కించారు. ఇప్పటికైనా బిసి సంక్షేమ శాఖ అధికారులు ఆ మొత్తాన్ని కళాశాల యాజమాన్యం నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది... కళాశాల ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటున్న యాజమాన్యం.. ఆ మొత్తాన్ని ఎలా చెల్లిస్తుంది? కళాశాల ఫిక్సెడ్ డిపాజిట్ ను వాడి అందులో నుంచి చెల్లిస్తారా?



.

17/05/2023

ఎస్.ఎస్.బి.ఎన్ లో సస్పెన్స్ థ్రిల్లర్!
* కళాశాలలో గందరగోళ పరిస్థితులు
* కళాశాల మూసివేత కుట్రకు బీజం పడుతోందా?

అనంతపురం ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో జరుగుతున్న వ్యవహారాలు, అంతర్గత నిర్ణయాలు... మున్ముందు ఏం జరగబోతుంది అన్న అంశం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. కళాశాల వ్యవహారాలు మొత్తం కరస్పాండెంట్ కనుసన్నల్లోనే జరుగుతాయి. అయితే ఇందులో కళాశాల ట్రస్ట్ కార్యదర్శి జోక్యం విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. కార్యదర్శి జోక్యాన్ని,తీసుకుంటున్న నిర్ణయాలను కరస్పాండెంట్ ఎక్కడా అడ్డు కోవడం లేదు. మెజారిటీ ట్రస్టు సభ్యులు సైతం మౌనవ్రతం పాటిస్తున్నారు. దాంతో కళాశాలలో గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. కళాశాలలో పనిచేసే ఉద్యోగులపై వేధింపులు పరాకాష్టకు చేరినట్లు సమాచారం అందుతోంది. ఆర్థిక ఇబ్బందుల బూచి చూపి తమకు నచ్చని వారిని తొలగించే ప్రక్రియ ఇదివరకే మొదలైనట్లు తెలియ వచ్చింది. మరి కొంతమందిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు అంతర్గతంగా జరుగుతున్నట్లు సమాచారం. మాజీ ప్రిన్సిపాల్, ప్రస్తుతం ట్రస్ట్ నేతగా కొనసాగుతున్నారు. కళాశాలలో అంచలంచలుగా ఎదిగిన ఆ వ్యక్తి మొత్తం కళాశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రక్రియ చాప కింద నీరులా ప్రారంభమైనట్లు సమాచారం. ఇప్పటికే కళాశాల కరస్పాండెంట్, అధ్యక్షుడు, ట్రస్ట్ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుత కార్యదర్శి గతంలో ఎన్నో వివాదాస్పద నిర్ణయాలను తీసుకుని కళాశాల ప్రతిష్టను మంట కలిపారని మాజీ ట్రస్టు సభ్యులు గతంలోనే ఆరోపించారు. వారిని పట్టుబట్టి అడ్డదారుల్లో తొలగించారన్న అభిప్రాయం వ్యక్తం అయింది. తద్వారా కార్యదర్శిగా తాను తీసుకోబోయే నిర్ణయాలను ఎవరైనా సరే తప్పు పట్టకూడదన్న నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.
గతంలో జరిగిన ట్రస్ట్ సభ్యుల ఎన్నికల్లో కార్యదర్శిగా ఆ వ్యక్తి ఎన్నికను వ్యతిరేకించారు. అయినప్పటికీ ఎలాంటి పొరపాటు జరగకుండా తాను చూసుకుంటానని కరస్పాండెంట్ హామీ ఇచ్చి ఎంపిక చేశారు. ఒకానొక సందర్భంలో ట్రస్టు కార్యదర్శిగా కొనసాగుతున్న వ్యక్తిని కరస్పాండెంట్ గా కూడా చేస్తానని ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం చక్కర్లు కొట్టింది. ఇదిలా ఉండగా మెజారిటీ ట్రస్టు సభ్యులు ప్రస్తుత కార్యదర్శి నిర్ణయాలకు వంత పాడుతున్నట్లు సమాచారం. గతంలో కళాశాలలో లెక్చరర్ లుగా, ఆ పై పదవులు నిర్వహించిన కొందరు ప్రస్తుతం ట్రస్టు సభ్యులుగా కొనసాగుతున్నారు. వారికి కళాశాల ఉద్యోగుల సమస్యలు, కళాశాలకు ఉన్న గౌరవం తెలియనివి కావు. అయినప్పటికీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నా వారు నోరు మెదపకపోవడం ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతోంది. మరో రెండేళ్లపాటు మాత్రమే కళాశాలలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందని ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ప్రస్తుత కార్యదర్శి, కరస్పాండెంట్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ రెండేళ్ల పాటు కూడా కళాశాలను కొనసాగించాలంటే కళాశాలకు సంబంధించిన ఫిక్సెడ్ డిపాజిట్ ను వాడాల్సి ఉందని కూడా ఉద్యోగులకు స్పష్టత ఇచ్చినట్లు తెలియ వచ్చింది. అంటే ఆ తర్వాత కళాశాల పరిస్థితి ఏమిటన్న అంశం ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతోంది. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు.. కళాశాలను క్రమంగా మూసివేత దిశగా తీసుకెళ్లే ప్రమాదం ఉందా? ఆ రెండేళ్ల మాటలో అర్థం, పరమార్థం అదేనన్న ప్రచారం తాజాగా మొదలైనట్టు తెలుస్తోంది. ఎంతోమంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఏమవుతుందో అన్న ఆందోళన పూర్వపు విద్యార్థుల్లో నెలకొన్నట్లు చెబుతున్నారు... అతి త్వరలోనే కళాశాల పగ్గాలు ట్రస్ట్ కార్యదర్శి చేతుల్లోకి వెళ్ళనున్నాయా? కళాశాల పరిస్థితులపై త్వరలోనే ఒక ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ ను కలవనుందా

14/05/2023

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల
ఎటుపోతోంది?
* ఆర్థిక భారం పేరుతో ఉద్యోగుల తొలగింపు
* ఇదేమని అడిగితే వేధింపులు
* పొమ్మనలేక పొగబెడుతున్న ట్రస్ట్ నేత!
* చోద్యం చూస్తున్న ట్రస్టు సభ్యులు!
* త్వరలోనే మానవ హక్కుల కమిషన్ వచ్చే అవకాశం

దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు ఇటు కళాశాలను, అటు ఉద్యోగులను ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కళాశాలకు సంబంధించి కరస్పాండెంట్ ఉన్నప్పటికీ కళాశాల వ్యవహారాలలో సంబంధంలేని ట్రస్ట్ నేత ఒకరు కర్ర పెత్తనం చేస్తుండటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తోందని కళాశాల ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతోంది. ట్రస్ట్ నేత, మెజారిటీ సభ్యుల వ్యవహార శైలి చూస్తే కరస్పాండెంట్ ను పక్కన పెట్టినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సహకరించాల్సింది పోయి కళాశాలకు ఉన్న కొద్దిపాటి ప్రాభవం కూడా లేకుండా చేసే ప్రక్రియ సాగుతున్నట్టు సమాచారం అందుతోంది. అకారణంగా సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను ఆగమేఘాలపై తొలగించడం, ఇదే మన వారిని వేధింపులకు గురి చేయడం ట్రస్ట్ నేత సారధ్యంలో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కళాశాల నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను తప్పించి ఏ మాత్రం ఉపయోగం లేని వారిని, పని లేని వారిని కళాశాల యాజమాన్యం కొనసాగించడం పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో కూడా అభద్రతాభావం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక భారం సాకు చూపి ఉద్యోగులను తప్పించే కుట్ర జరుగుతున్నట్లు సమాచారం.
కళాశాల కరస్పాండెంట్ ఆమోదాలు లేకుండానే ట్రస్ట్ నేత ఏకపక్ష అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటున్నట్లు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తద్వారా కళాశాలను ఎటు తీసుకెళుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం వ్యవహార శైలి పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి కొద్ది రోజులు ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆందోళనకు దిగాలని ఉద్యోగుల్లో చర్చ జరిగినట్లు సమాచారం. ట్రస్టు నేత అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలు అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు చెబుతున్నారు. అసలు కళాశాలను నడపాలన్న చిత్తశుద్ధి వారికి ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం కళాశాలలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు చూస్తే అది నిజం కూడా కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా కళాశాలలో ఉద్యోగుల పట్ల ట్రస్ట్ నేత వ్యవహార శైలిపై కొందరు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే కమిషన్ కళాశాలకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియ వచ్చింది.
కళాశాల నిర్వహణకు ఉపయోగపడే కీలక విభాగాలకు చెందిన వారిని ఉద్యోగం నుంచి తప్పిస్తున్నారు. ముందు నుంచే పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా తప్పించిన వారి స్థానంలో విధి నిర్వహణకు ఒక్కరు చేసే పనికి పదిమందితో పని చేయించుకునే పరిస్థితి వచ్చిందని ప్రచారం ఉంది. ప్రస్తుతం కళాశాలలో పనిచేస్తున్న కొందరిపై ట్రస్టు నేత దండయాత్ర చేస్తున్నట్లు చెబుతున్నారు. దాంతో అప్రమత్తమైన కొందరు ఉద్యోగులు మొదట ప్రభుత్వానికి, అనంతరం రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కళాశాల యాజమాన్యం, ట్రస్ట్ సభ్యులపై ఇదివరకే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ సహకారంతో నడిచే ఇలాంటి కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని గుంటూరు జిల్లాలో ఒక కళాశాలకు సంబంధించి గౌరవనీయ హైకోర్టు తీర్పునిచ్చింది... ప్రభుత్వమే ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలను నడపాలంటున్న మేధావులు, విద్యార్థులు తల్లిదండ్రులు... కళాశాల కరస్పాండెంట్ సీటుకు ఎసరు పెట్టే వ్యవహారం అంతర్గతంగా నడుస్తోందా? కళాశాలకు సంబంధించిన పిక్సెడ్ డిపాజిట్ కు కన్నం వేసే ప్రక్రియ సిద్ధమైందా?

16/04/2023

*గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి సిపిఎం బహిరంగ లేఖ*

*శింగనమల నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ 35 అంశాలపై సిపిఎం బహిరంగ లేఖ....*

ఈరోజు సింగనమల మండలం కేంద్రంలోని రామస్వామి దేవాలయం నందు సిపిఎం పార్టీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల రంగయ్య, ఓనల్లప్ప జిల్లా కమిటీ సభ్యులు భాస్కర్, మండల నాయకులు బందల ఈశ్వరయ్య,ముత్యాలు పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా బహిరంగ లేఖను విడుదల చేశారు.*

*ఈనెల 17 తేదీన 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమంలో భాగంగా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలానికి మీరు వస్తున్నందుకు స్వాగతం. చాలా నెలల తర్వాత మా జిల్లాకు రావడం, అందునా అనేక సమస్యలు వున్న శింగనమల నియోజకవర్గానికి తమరు రావడంపై నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతో వున్నారు. ఈ నియోజకవర్గంలోని ఆరు మండలలాల్లో మా దృష్టికి వచ్చిన సమస్యలను మీకు ప్రత్యక్షంగా కలిసి వివరించే అవకాశం లేదు కనుక బహిరంగ లేఖ ద్వారా తమరికి తెలుపుతున్నాము. వీటిని పరిష్కారించ వలసిందిగా సిపిఎం జిల్లా కమిటి కోరుతున్నది.*

*ముఖ్యమంత్రి గారి పర్యటన అనివార్య కారణాలవల్ల వాయిదా పడినప్పటికీ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ కోరుతున్నారు.*

*గత నెలలో కురిసిన వడగళ్ల వర్షానికి నార్పల మండలంలో వెంకటాంపల్లి, నాయనపల్లి, కేశేపల్లి తదితర గ్రామాల్లో అరటి, బత్తాయి, కళింగర, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని కోట్ల రూపాయల పెట్టుబడులు ఆసాధరణంగా రైతులు నష్టపోయారు. వీరికి పంట నష్టపరిహారం ఈ సభలో ప్రకటిస్తారని ఆశిస్తున్నాము.*

*ఈ నియోజకవర్గంలో విద్య, వైద్య, మౌళిక సదుపాయాలు, ఉపాధి, వ్యవసాయం, పాడి పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. ఈ సానుకూల అంశాలపై సిపిఎం క్షేత్రస్థాయిలో సర్వేలు, పర్యటనలు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశాము. వీటి పరిష్కారం కోసం ఇప్పటికే మండల, నియోజకవర్గ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు, అధికారులకు విజ్ఞప్తులు ఇస్తూ, వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నాము.*

*మా దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను తమరికి తెలుపుతున్నాము.*

*ప్రధాన సమస్యలు*

1. పుట్లూరు మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వం డిగ్రీ కళాశాలను ప్రారంభించాలి.

2. అన్ని గురుకుల పాఠశాలల్లో కాస్మోటిక్ చార్జీలు, నోట్ పుస్తకాలు, ఇతర సదుపాయాలకు నిధులు పెంచి సకాలంలో ఇవ్వాలి.

3. నియోజకవర్గంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లు, గురుకుల పాఠశాలలకు మరమ్మత్తులకు నిధులు కేటాయించాలి. పనులు చేపట్టాలి.

4. నియోజకవర్గం కేంద్రంలో ఉన్న జూనియర్ కాలేజీలో బైపిసి, ఎంపిసి గ్రూపులను, ఇంగ్లీషు మీడియాను ప్రవేశపెట్టాలి.

5. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో బాలికలకు ప్రత్యేక బాలికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి.

6. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎపి మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి. 7. నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలి.

8. నియోజకవర్గ కేంద్ర శింగనమలలో ఉన్న సామాజిక వైద్యశాల, బుక్కరాయసముద్రం లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, అలాగే అన్ని మండల కేంద్రాలలో ఉన్న, కొర్రపాడు, తరిమెల, బి, పప్పూరు గ్రామాల్లో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 10 పడకలు, 24 గంటల ఆసుపత్రులుగా మార్చి తగిన సిబ్బందిని నియమించాలి.

9. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో డాక్టరు బి. ఆర్. అంబేడ్కర్ కన్వెన్షన్ హాలుకు 10 కోట్లు నిధులను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలి.

10. అన్ని మండల కేంద్రాల్లో డాక్టరు బి. ఆర్. అంబేడ్కర్ భవనాలను నిర్మించాలి. అందుకు నిధులు మంజూరు చేయాలి.

11. బుక్కరాయసముద్రం మండల తహశీల్దారు కార్యాలయం ముందు ఉన్న మరవవంక, శింగనమల చెరువు కింద ఉన్న మరవవంక, నియోజకవర్గంలోని వివిధ చెరువు కింద ఉన్న మరవవంకలకు బ్రిడ్జీలను నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలి.

12. నార్పల మండలం గూగూగు కుళ్ళాయి స్వామి, బుక్కరాయసముద్రం మంల కేంద్రంలోని దేవరకొండ కొండమీదరాయుని ఆలయం,
శింగనమల మండల కేంద్రంలోని రుషింగమయ్య కొండను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.

13. నార్పల మండల కేంద్రంలోని కూతలేరు బ్రిడ్జిని నిర్మాణ పనులు పూర్తీ చేయాలి.

14. నార్పల మండల కేంద్రంలో చేనేత పార్కును ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికులకు ముడి సరుకు సబ్సిడీపై ఇవ్వాలి. కార్మికులకు గుర్తింపు కార్డులు, అర్హులకు నేతన్న నేస్తం ఇవ్వాలి.

15. మంచినీటి సమస్యలను శాశ్వితంగా పరిష్కారం కోసం నార్పల బుక్కరాయసముద్రం మండల కేంద్రాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నిర్మించాలి. అన్ని గ్రామాలకు గండికోట రిజర్వాయర్ ద్వారా పనులను పూర్తి చేసి మంచినీటా సౌకర్యం కల్పించాలి.

16. పుట్లూరు మండల సాలవేముల జాజికొండ వాగుకు చిన్నపాటి రిజర్వాయర్ నిర్మిస్తే 34 గ్రామాలకు తాగునీరు అందివ్వవచ్చు.

17. నియోజకవర్గంలో వివిధ పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతున్న రిత్యా పళ్ళ రసాల పరిశ్రమను ఏర్పాటు చేసి, మార్కెటింగ్ కల్పించాలి.

18. నియోజకవర్గంలో పాడిపరిశ్రమపై ఆధారపడిన వారి పాడి పశువులు చనిపోతే బీమా సదుపాయం కల్పించాలి.

19. లీటర్ పాలకు రూ, నాలుగు రూపాయల బోనస్ ను వెంటనే ఇవ్వాలి.

20. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురము గ్రామంలో వెటర్నిరీ సబ్ సెంటర్ను ఏర్పాటు చేసి డాక్టరు, సిబ్బందిని నియమించాలి.

21. పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో జింకల బెడద నుండి పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

22. పెనకచెర్ల డ్యాం నుండి బైపాస్ కాలువ పనులు చేపట్టాలి, శింగనమల మండలం సలకంచెరువుకు హెచ్.ఎల్.సి నీళ్లు ఇవ్వాలి.

23. చాగల్లు రిజర్వాయర్ కింద ముంపుకు గురైన ఉలికల్లు, ఉలికుంటపల్లి గ్రామాలకు చెందిన ముంపు బాధితులకు గత 14 సం॥రాలు నష్టపరిహారం అందలేదు. పునరావాసానికి, మౌళిక సదుపాయాలు కల్పించలేదు. నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి.

24. డోలమైట్, బ్లాక్ గ్రానైట్, వైట్ గ్రానైట్ ఖనిజాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కలిపించాలి.

25. శింగనమల మండలం రాచేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లెదర్ పార్కును పునరుద్ధరించాలి, నిధులు కేటాయించాలి. గతంలో శిక్షణ పొందిన యవతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

26. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు రాబట్టాలి.

27. దళిత, గిరిజనులపై దాడులు పెరగడానికి కారణం జిల్లా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం, ఉదా: శింగనమల మండలం జూలాకాలువ, అవంతపురము రూరల్ మండలం నవయుగ కాలనీ, నార్పల మండలం బొందలబాడలో జరిగిన ఘటనల్లో పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

28. మట్టి మాఫియా, ఇసుక మాఫియా పెరుగుతున్నందున సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

29. అర్హత కలిగిన వారికి ఇంటి పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలి. వివిధ మండలాల్లో ఏళ్ల తరబడి పేదలు గుడిసెలు వేసుకొని

30. పంచాయితీలు నిర్వహిస్తున్న మంచినీరు, వీధిదీపాల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి.

31. అన్ని మండలాల్లో అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణ పనులు పూర్తీ చేయాలి. గ్రామీణ రోడ్డుకు మరమ్మతులు చేయాలి.

32. అన్ని గ్రామ పంచాయితీలలో పని చేస్తున్న కార్మికులు, స్వచ్చ భారత్ కార్మికుల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి.

33. నియోజకవర్గంలోని అర్హతగల రైతులందరికీ డ్రిప్పు, స్పింకర్లు 100% సబ్సిడీతో ఇవ్వాలి.

పైన తెలిపిన ప్రజా సమస్యలపై తమరు స్పందించి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటి బహిరంగ
లేఖ ద్వారా కోరుతున్నది.

01/04/2023

అన్నట్లుగానే ఉద్యోగులను తొలగించారు
* ఆగమేఘాలపై ఎస్ ఎస్ బి ఎన్ యాజమాన్యం నిర్ణయం
* దళిత మహిళకు అన్యాయం
* ఎదురు తిరిగిన ఆ ఇద్దరు!

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల యాజమాన్యం మరో అడ్డగోలు నిర్ణయం తీసుకుంది. ఉన్న పళంగా కళాశాలలో పనిచేసే ఆరు మంది ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల బూచి చూపి యాజమాన్యం వారిని బయటకు పంపే ప్రయత్నం చేపట్టింది. నిన్నటి నుంచే వారు విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని కళాశాల యాజమాన్యం ప్రకటించింది. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముగ్గురు ఉద్యోగులు వెళ్లిపోయారు. అందులో ఇద్దరు మహిళలు తమ తొలగింపు నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పి హెచ్ డి డాక్టరేట్ పొందిన దళిత మహిళతోపాటు, ఎమ్మెస్సీ పూర్తి చేసిన మరో మహిళ కూడా తమ తొలగింపు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలుగు విభాగంలోని మరో మహిళ ఉద్యోగిని కూడా తొలగించారు. అయితే ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో గాని ఆమె తొలగింపు నిర్ణయానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కళాశాలలో పనిచేసే ఒక ఉద్యోగి ఆమెను తొలగించకుండా కథ నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెస్సీ, డాక్టరేట్ పొందిన ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు తమను విధుల్లోకి తీసుకోకపోతే న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కొన్ని రోజుల ముందే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఆగమేఘాలపై నిర్ణయం తీసుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు.
ఇదిలా ఉండగా అసలే పని భారం లేని పలు విభాగాలలో కొందరు ఉద్యోగులను అలాగే కొనసాగిస్తూ కళాశాల విద్యాభివృద్ధికి అవసరమైన వారిని తొలగించడాన్ని ప్రశ్నిస్తున్నారు. వారికి లేని ఆర్థిక ఇబ్బందులు తమ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎలా వస్తాయని తొలగింపు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైన్సు ల్యాబ్ లలో ఉద్యోగుల అవసరం ఉంది. అయితే ఒక్కొక్కరినే కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అయినవారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో అన్న చందంగా కళాశాల యాజమాన్యం తీరు ఉందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 6 మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించడంతో మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యానికి నిత్యం భజన చేసే వారికి పని భారం లేకపోయినా వారిని కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఎస్ఎస్ బి ఎన్ కళాశాల యాజమాన్యం మరో కొత్త అంకానికి తెరలేపింది. పిఎఫ్ విషయంలో కళాశాల యాజమాన్యం జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. 2020 నుంచి 15000 నెల జీతం ఉన్నవారికి పిఎఫ్ వర్తించదంటు యాజమాన్యం తన ఉద్యోగులకు కొత్త కబురు చెప్పింది. అంతకుముందు ఆ ఉద్యోగులే 15 వేల కంటే తక్కువ జీతానికి పనిచేసిన సందర్భంలో పిఎఫ్ వర్తించాలి కదా అంటే అందుకు యాజమాన్యం వద్ద సమాధానం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పిఎఫ్ వర్తించే వారు పిఎఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కూడా లేకుండా యాజమాన్యం కహానిలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిఎఫ్ కోసం వారి జీవితాల్లో కట్ అయిన మొత్తాలు ఏమైనట్లు అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల యాజమాన్యం నిర్ణయం ఏదైనా తాము చెప్పిందే వేదం... చేసిందే శాసనం అన్న రీతిలో వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఎడాపెడా నిర్ణయాలు యాజమాన్యం తీసుకుంటోoది ఆన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.....

23/03/2023

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకమేనా!?
* ఫిక్సెడ్ డిపాజిట్ల వాడకానికి రంగం సిద్ధం!

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల వ్యవహారాలు కీలక దశకు చేరుకున్నాయా? చేరుకుంటున్నాయా? చేరుకోబోతున్నాయా? అన్న చర్చ తాజాగా మొదలైంది. ఇందుకు కారణాలు లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కళాశాల యాజమాన్యం, కళాశాల ట్రస్ట్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యా బోధన కంటుపడుతూ వస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తద్వారా అడ్మిషన్లు చాలావరకు తగ్గిపోయాయి. అదే సందర్భంలో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. ఒకప్పుడు విద్యాపరంగా దేదీప్యమానంగా వెలుగొందిన ఈ కళాశాల నేడు ఈ దుస్థితికి చేరుకోవడం బాధ కలిగిస్తుంది. పెద్ద పెద్ద పైరవీలు లేనిదే కళాశాలలో సీట్లు దొరకని పరిస్థితి నుంచి రండి బాబు రండి అంటూ కళాశాలలో అడ్మిషన్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణాలు అనేకం కనిపిస్తాయి. ట్రస్టు నేత కళాశాల వ్యవహారాలలో విపరీత జోక్యం పెరగడం వల్ల, కళాశాల యాజమాన్యం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కళాశాల వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. కళాశాల ప్రతిష్ట దెబ్బ తింటుందని ట్రస్ట్ లోని కొందరు సభ్యులు పలుమార్లు ఏ కరువు పెట్టిన యాజమాన్యంలో స్పందన కనిపించలేదు. తద్వారా కళాశాలకు ఉన్న ప్రతిష్ట మూసుకు పారిపోయే పరిస్థితి వచ్చింది. కొద్దిరోజుల క్రితం కళాశాల ఉద్యోగులతో యాజమాన్యం, ట్రస్ట్ నేత ఒక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొందరు ఉద్యోగులను తీసేయాల్సి వస్తోందని మరో రెండు సంవత్సరాల కంటే ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించే పరిస్థితి లేదంటూ వారు నమ్మ గర్భ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా కళాశాల ఫిక్స్ డ్ డిపాజిట్లను వాడాల్సిన పరిస్థితి వస్తోందంటూ యాజమాన్యం, ట్రస్టు నేత ఉద్యోగులకు చెప్పినట్టు సమాచారం. ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఉన్నట్లు విశ్వసినీయ సమాచారం. ఆ మొత్తాన్ని వాడటానికి ఇప్పటికే వ్యూహాలు సిద్ధమైనట్లు తెలియ వచ్చింది. గత దశాబ్ద కాలంగా కళాశాలలో చదివే బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్ షిప్ లను కాజేసే ప్రయత్నం జరిగింది. అంతేకాక ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్ వ్యవహారాల్లో కూడా గోల్మాల్ జరిగినట్లు ఇదివరకు ఫిర్యాదులు వెళ్లాయి. అంతేకాక కళాశాల ఆదాయ వనరులను సంరక్షించడం చేయలేకపోయారన్న విమర్శ ఉంది. ఉన్న వనరులను అడ్డగోలుగా ఖర్చు చేయడం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కళాశాల ఫిక్స్డ్ డిపాజిట్ ను వాడాల్సిన అవసరం లేదని, దాని ద్వారా వచ్చే వడ్డీని, వచ్చే అడ్మిషన్ ల ద్వారా వచ్చే నిధులను కలుపుకొని కళాశాలను నడపవచ్చన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. అప్పటికి వీలుకాని పక్షంలో నిజంగా విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల ప్రతిష్ట ముఖ్యమనే భావన యాజమాన్యంలో ఏమాత్రం ఉన్నా కళాశాలను ప్రభుత్వానికి అప్పగించడం శ్రేయస్కరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అలా కాకుండా మరి ఏదైనా వ్యూహం, ఆలోచన యాజమాన్యానికి ఉంటే ఇందులో మతలబు ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు కళాశాల ఫీక్సెడ్ డిపాజిట్ వాడవచ్చా? ఈ నిధుల వాడకానికి కళాశాల యాజమాన్యం రూపొందించుకున్న నియమ నిబంధనలు ఏమిటి? ఒకవేళ కళాశాల యాజమాన్యం నిర్ణయం మేరకు ఆ మొత్తాన్ని వాడినా రెండేళ్ల పాటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలమని చెప్పడం వెనుక మర్మం ఏమిటి? ఆ రెండు ఏళ్ల తర్వాత కళాశాల పరిస్థితి ఏమిటి?

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Cpm Anantapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category