09/04/2024
ఇలా పార్టీ మారగానే
అలా స్క్రిప్ట్ మారిపొద్దీ ఏంటో..
అయినా అధి నాయకుడు చెప్పేది
పెడ చెవిన పెట్టీ మీ మీ సొంత స్కెచ్ లు వేసుకొని ..
మీరు అనుకున్నది తప్ప మరేమీ జరగకూడదు అంటే ఎలా నాయకులూ..
మీరు ఇంకా హద్దులు దాటి మాట్లాడితే మేము కౌంటర్స్ స్టార్ట్ చెయ్యాల్సి వస్తుంది
మీకు మాత్రమే జరిగిపోయిన అన్యాయం ఏముంది 60 కి 21 మిగిలిన అందరికీ న్యాయం జరగలేదు
ఓ సీట్ బీజేపీ కి వెళ్ళింది కాని జనసేన కే వున్న అవనిగడ్డ సీట్ నే టీడీపీ పెద్దాయన వచ్చి పోటీ చేస్తుంటే ఇందరు వుండి జిల్లాకి ఒక్క సీట్ నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యలేదు ..
3సీట్ లు 3 పార్టీ ల నుండి వ్యక్తులు పోటీ చేసే స్థితి మీ వర్గ పోరుల వల్ల కాదా ..
నాయకులు గా ఎదగ మంటె వర్గ నాయకులు గా మారి విశాల ప్రయోజనాలను మంట కలుపుకున్నారు..
2014 లో పోటీలో లేము
2019 లో గెలిచి నిలబడలేదు
ఎటొచ్చీ మీరు ఈ 5 ఏళ్లలో నేర్చుకున్నారు వ్యవస్థ లో భాగం గా ఎదిగారు గుర్తింపు పొందారు..
ఏదో ఏళ్ల తరబడి త్యాగాలు చేసేస్తున్నామ్ అనే అంటున్నారు తప్ప ,,
త్యాగాలకు సిద్దపడండి
ప్రజల కోసం నిలబడండి
షార్ట్ టైం లో ఏ పలితాలు రావు
ఫ్లెక్సీ లు, వెనక తెచ్చుకునే జనాలు
మీ సమర్ధతను నిర్ణయించ వు,,
కష్టం లో మీరు నిలబడే తీరు,
వత్తిడిని అధిగమించే మనోబలం,
పరిస్థితి అనుకూలం గా లేనప్పుడు మీరు చూపే మీలోని నిబద్దత అనేవే మిమ్మల్నీ
నాయకులు గా నిలుపుతా యి అని
శ్రీ #పవన్_కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పారు
కానీ సంప్రదాయ రాజకీయ వాదుల్ల చేస్తూ మహోన్నత వ్యక్తిత్వం వున్న నాయకుడిని అవమాన పరిచే స్థితి కి కొందరు చేరుకుంటున్నారు..
రామ్ బండ్రెడ్డీ గారు, చిల్లపల్లి శ్రీనివాస్ గారు, అమ్మిశెట్టీ వాసు గారు,సందీప్ పంచకర్ల గారు ఇలా ఎందరో నిరాశ ఎదురైనా నిబద్దత చూపుతూ జనసేన శ్రేణులతో గౌరవింపబడే వ్యక్తులు వున్నారు మరీ వాళ్ళవి సొమ్ములు కావా, వాళ్ళది విలువైన సమయం కాదా!?
వెళ్ళి పోవాలి అనుకునే ఏ నాయకులైన మీ కష్టం బాధ అర్దం చేసుకోగలం కానీ మీ మీ వెసులుబాట్లు కోసం మీకు ఎదిగే అవకాశం ఇచ్చిన జనసేనే తూలనాడుతాం అంటే మాత్రం
మా ప్రతిఘటన మీరు ఎదుర్కోవటం తప్పదు అని గుర్తించు కొండి, కులాల పేరునా వర్గాల హోరునా జనసేను ఎవరూ దెబ్బకొట్టలేరు.. 💪
జయహో జనసేన💐✊🙏
From :Lakshmi Shailu garu FB page.