Anakapalli District Police

Anakapalli District Police The official handle of ANAKAPALLI DISTRICT POLICE.... Please don't report Crime here. In case of eme ANAKAPALLI DISTRICT POLICE

జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి.గోవిందరావు* *అనకాప...
01/06/2026

జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి.గోవిందరావు*

*అనకాపల్లి, జూన్ 01:* అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ (సీఐ) గా బాధ్యతలు స్వీకరించిన జి.గోవిందరావు గారు సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సీఐ ఎస్పీ గారికి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మాట్లాడుతూ..* జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నూతన సీఐని ఆదేశించారు.

మహిళలపై జరిగే నేరాల పట్ల తక్షణమే స్పందించి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి.

గృహ హింస, వేధింపుల కేసుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట బాధితులకు తగిన కౌన్సిలింగ్ అందించాలి.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి.

ప్రస్తుత కాలంలో మహిళలు, యువతులు సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొంటున్న సైబర్ వేధింపుల పట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, జిల్లాలో మహిళల రక్షణకై, శాంతిభద్రతల పరిరక్షణకై శాయశక్తులా కృషి చేస్తానని నూతన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి.గోవిందరావు ఈ సందర్భంగా ఎస్పీ గారికి వినయపూర్వకంగా తెలియజేశారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత:52 ఫిర్యాదుల స్వీకరణ* *బాధితులకు 7 రోజుల్లోపు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ ...
01/06/2026

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత:52 ఫిర్యాదుల స్వీకరణ*

*బాధితులకు 7 రోజుల్లోపు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశం*

*అనకాపల్లి, జూన్ 01:* ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు బాధితుల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నేటి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 52 ఫిర్యాదులను స్వీకరించారు.
*ప్రధాన ఫిర్యాదులు:*
సివిల్ వివాదాలు: భూ తగాదాలు, మోసపూరిత ఘటనలు మరియు ఆస్తి సంబంధిత వివాదాలు.
కుటుంబ సమస్యలు: కుటుంబ కలహాలు మరియు భార్యాభర్తల మధ్య వేధింపులు.
ఇతర సమస్యలు: వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పౌర సమస్యలు.
ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ క్రింది ఆదేశాలు జారీ చేశారు.

*7 రోజుల్లో న్యాయం:* ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లోపు సమగ్ర విచారణ పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలి.
నిష్పక్షపాత విచారణ: ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం వాస్తవాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
*బాధితులకు సమాచారం:* బాధితులకు తమ ఫిర్యాదుపై చేపట్టిన చర్యల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకాన్ని పెంపొందించాలి.
*నివేదిక సమర్పణ:* విచారణ అనంతరం తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికను తప్పనిసరిగా జిల్లా కార్యాలయానికి సమర్పించాలి.

*జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ..*
"ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించడమే పోలీసు యంత్రాంగం ప్రధాన బాధ్యత. ముఖ్యంగా మహిళా రక్షణకు పెద్దపీట వేస్తూ, వారిని మోసగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజా సమస్యల పరిష్కారంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు."
— శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ (జిల్లా ఎస్పీ)

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

*అనకాపల్లి పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన వీడ్కోలు**అనకాపల్లి, మే 30:* పోలీసు శాఖలో ...
30/05/2026

*అనకాపల్లి పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన వీడ్కోలు*

*అనకాపల్లి, మే 30:* పోలీసు శాఖలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలు అందించి, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణతో ఆదర్శంగా నిలిచిన ముగ్గురు అధికారులకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నాడు ఆత్మీయ వీడ్కోలు సభ అత్యంత వైభవంగా నిర్వహించారు.
*నేడు పదవీ విరమణ పొందిన వారు:*
*శ్రీ బి.రామ్ కుమార్ (ఏఎస్ఐ, అనకాపల్లి టౌన్ పి.ఎస్)*
*శ్రీ వి.త్రినాథ్ రావు (ఏఎస్ఐ, పరవాడ పి.ఎస్)*
*శ్రీ ఎల్.గోవింద రావు (ఏఆర్ హెచ్.సీ)*

*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్,* పదవీ విరమణ పొందిన అధికారులను మరియు వారి కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:*
"పోలీసు వృత్తి ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. అటువంటి బాధ్యతాయుతమైన రంగంలో 36 ఏళ్లు (త్రినాథ్ రావు, గోవిందరావు), మరియు 35 ఏళ్ల (రామ్ కుమార్) పాటు నిబద్ధతతో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణం. విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. విశ్రాంత జీవితంలో కూడా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది."

*ఈ సభలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు మాట్లాడుతూ,* పదవీ విరమణ పొందిన అధికారుల సుదీర్ఘ అనుభవాన్ని కొనియాడారు.
"శాఖలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ, నిరంతరం ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన మీ సేవలు చిరస్మరణీయం. యువ పోలీసు అధికారులకు మీ క్రమశిక్షణే మార్గదర్శకం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు వెన్నుముకగా నిలిచిన మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు" అని పేర్కొన్నారు.

*భావోద్వేగానికి లోనైన విశ్రాంత అధికారులు*
సత్కారం అందుకున్న అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ సుదీర్ఘ సర్వీసులో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ఇన్నేళ్లపాటు తమ విధి నిర్వహణకు సహకరించిన పై అధికారులకు, తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖ కుటుంబం నుంచి విడిపోవడం బాధగా ఉన్నప్పటికీ, ఇంతటి ఘన వీడ్కోలు లభించడం ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.

ఈ వేడుకలో డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్, ఏ.ఓ. శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యరావు, లక్ష్మి, రామకృష్ణారావు, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని రిటైర్డ్ అధికారులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.



Andhra Pradesh Police

మహిళలు, బాలికల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత: “ఆపరేషన్ దండాయన”తో నేరగాళ్లపై ఉక్కుపాదం– అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ స...
29/05/2026

మహిళలు, బాలికల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత: “ఆపరేషన్ దండాయన”తో నేరగాళ్లపై ఉక్కుపాదం– అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.,*

*అనకాపల్లి, మే 29:* ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారిపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు తెలిపారు.

రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మహిళా & శిశు భద్రత విభాగం ఐజీ శ్రీమతి రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో... *ఏపీ పోలీస్ శాఖ “స్పీడ్ ట్రయల్ మానిటరింగ్” (Speed Trial Monitoring)* విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే నేరాల నియంత్రణకు, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడానికి ప్రతిష్టాత్మక *“ఆపరేషన్ దండాయన”* ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

*“ఆపరేషన్ దండాయన” ప్రధాన లక్ష్యాలు & పోలీస్ అధికారులకు ఆదేశాలు:*
*జీరో టాలరెన్స్ & సత్వర విచారణ:* మహిళలపై జరిగే నేరాల విషయంలో 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబించడం.
*60 రోజుల్లో చార్జిషీట్:* ప్రతి కేసులోనూ నిందితులపై 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలి.
*ఫాస్ట్ ట్రాక్ కోర్టులు:* సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి, నిందితులకు వేగంగా కఠిన శిక్షలు పడేలా చూడాలి.
*SOS నిఘా:* పునరావృత నేరస్తులు, అనుమానితుల కదలికలపై SOS (సెక్సువల్ అఫెండర్ సర్వలెన్స్ షీట్స్) ద్వారా నిరంతర నిఘా ఉంచాలి.
*బాధితులకు భరోసా:* బాధిత మహిళలకు అవసరమైన కౌన్సిలింగ్, ఉచిత న్యాయ సహాయం అందించాలి.
*పెండింగ్ కేసుల పరిష్కారం:* దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పునఃసమీక్షించి, ప్రాధాన్యత క్రమంలో చార్జిషీట్లు దాఖలు చేయాలి.
*సైబర్ వాచ్ & ఇంటెలిజెన్స్:* ప్రజా భాగస్వామ్యంతో “సైబర్ వాచ్” కార్యక్రమాన్ని అమలు చేస్తూ, ఇంటెలిజెన్స్ నిఘాను పెంచాలి.
*అవగాహన & పరివర్తన:* సామాజిక కార్యకర్తలతో కలిసి “పరివర్తన సదస్సులు” నిర్వహించాలి. మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి. చట్టాలపై భయం కలిగేలా ఇటీవల కోర్టులు ఇచ్చిన తీర్పులను పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం చేయాలి.

*అనకాపల్లి జిల్లాలో శిక్షల (Convictions) వివరాలు (2024 - 2026):*
మహిళలపై జరిగిన నేరాలలో (Crime Against Women) అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ పక్కా ఆధారాలతో కోర్టుల ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేసింది. అలాగే *జిల్లాలో SOS (సెక్సువల్ అఫెండర్ సర్వలెన్స్ షీట్స్) 137 మంది పై షీట్స్ తెరిచి, వారిపై పూర్తి నిఘా ఉంచడం జరిగింది.*

*ఆ వివరాలు:*
మహిళలపై నేరాలలో (క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్) 2024 (10 కేసులు), 2025 (15 కేసులు), 2026 (03 కేసులు) మొత్తం 28 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కన్విక్షన్ (శిక్షలు) పడేలా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.

"మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ మరియు Conviction Based Policing విధానంతో ముందుకు వెళ్తున్నాం. నిందితులు ఎంతటి ప్రభావశీలురైనా సరే, చట్టం ముందు మోకరిల్లాల్సిందే. *ప్రతి బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు ‘ఆపరేషన్ దండాయన’ నిరంతరం కొనసాగుతుంది.* మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలందరూ సహకరించాలి."
— శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ (జిల్లా ఎస్పీ, అనకాపల్లి)


*అనకాపల్లి సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం: విజయవంతంగా ‘SP-SAMPARK’* *పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి వినూత్న వేదిక* *...
29/05/2026

*అనకాపల్లి సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం: విజయవంతంగా ‘SP-SAMPARK’*

*పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి వినూత్న వేదిక*
*నేరుగా ఫోన్ లైన్ ద్వారా సమస్యలు ఆలకించిన అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు*

*అనకాపల్లి, మే 29:* జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ‘SP-SAMPARK’ ఫోన్-ఇన్ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు గారు స్వయంగా ఫోన్ లైన్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.
ఉన్నతాధికారులకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, సిబ్బంది తమ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఇబ్బందులను ఎటువంటి సంకోచం లేకుండా పంచుకునేందుకు ఈ వేదికను రూపొందించారు.

జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది 93469 12011 నంబర్ ద్వారా అదనపు ఎస్పీ గారితో నేరుగా మాట్లాడారు.
*ప్రధాన సమస్యలు:* సిబ్బంది ప్రధానంగా తమ సర్వీస్ పరమైన పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు మరియు కుటుంబ ఆరోగ్య సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
*తక్షణ ఆదేశాలు:* ప్రతి సమస్యను లోతుగా విశ్లేషించిన అదనపు ఎస్పీ గారు, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.
"కానిస్టేబుల్ నుండి హోమ్ గార్డు వరకు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడమే మా ప్రాధాన్యత. దూర ప్రాంతాల నుండి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సిబ్బంది తమ సమస్యలను నేరుగా నాతో పంచుకోవచ్చు. ప్రతి సమస్యను అత్యంత గోప్యంగా ఉంచుతూ త్వరితగతిన పరిష్కారం చూపుతాం."
— శ్రీ ఎల్.మోహన రావు, జిల్లా అదనపు ఎస్పీ.

ప్రతి శుక్రవారం ‘SP-SAMPARK’
ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. వచ్చే ప్రతి ఫిర్యాదును డిజిటల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, అది పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏవో శ్రీ సిహెచ్.తిలక్ బాబు,ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య మరియు ఇతర పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



Andhra Pradesh Police

*జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి.* *అనకాపల్లి, మే 28:* మహానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రా...
28/05/2026

*జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి.*

*అనకాపల్లి, మే 28:* మహానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఆయనకు భావోద్వేగపూరితమైన నివాళులర్పించింది.
​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మే 28వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు గారు పాల్గొని, ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు.

​ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ, శ్రీ ఎన్టీఆర్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి చాటిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. "ఆయన పరిపాలనా కాలం ప్రజారంజక పరిపాలనకు ఒక నమూనా. ఆయన అందించిన సేవలు, సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయి. తెలుగు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలను మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలి" అని ఆయన అన్నారు.

​ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి (మహిళా పిఎస్, అనకాపల్లి) శ్రీ ఇ.శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు వెంకట నారాయణ, అశోక్ కుమార్, ఎస్.ఐ. రవికుమార్ లతో పాటు ఇతర పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని, ఘన నివాళులు అర్పించారు.


*వృద్ధురాలి అనుమానాస్పద మృతి మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన కశింకోట పోలీసులు – బంధువురాలే హంతకురాలు!**కశింకోట* కశింకోట గ్...
28/05/2026

*వృద్ధురాలి అనుమానాస్పద మృతి మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన కశింకోట పోలీసులు – బంధువురాలే హంతకురాలు!*

*కశింకోట*
కశింకోట గ్రామంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలు దమ్ము నాగమ్మ (85) హత్య కేసు మిస్టరీని కశింకోట పోలీసులు అత్యంత సమర్థవంతంగా, కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. అప్పుల బాధతో బంగారు నగ ల కోసం సొంత బంధువురాలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితురాలిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

*కేసు నేపథ్యం & దర్యాప్తు:*
మొదట కశింకోట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.111/2026, U/Sec 194 BNSS కింద అనుమానాస్పద మృతిగా ఎస్‌.ఐ కె.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక (PME Report) ఆధారంగా అది హత్యగా తేలడంతో... అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలు, డీఎస్పీ శ్రీమతి శ్రావణి గారి పర్యవేక్షణలో కశింకోట సి.ఐ ఎ.స్వామి నాయుడు కేసును U/Sec 103(1), 105(1) BNS (హత్య, దొంగతనం) కిందకు మార్చారు. దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

*నిందితురాలి వివరాలు:*
పేరు: *సిమ్మ సత్య* (W/o అప్పారావు)
వయస్సు: 55 సంవత్సరాలు
నివాసం: కొప్పాక గ్రామం, అనకాపల్లి రూరల్ మండలం.
*మృతురాలితో బంధుత్వం:* బంధువురాలు.
నేరం జరిగిన తీరు (ముద్దాయి ఒప్పుకోలు):
ఆర్థిక ఇబ్బందులే కారణం: నిందితురాలు సిమ్మ సత్య అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మృతురాలి వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసింది.
హత్య ఉదంతం: ఈ నెల 16-05-2026 రాత్రి మృతురాలి ఇంటికి వెళ్లి, మొదట ఆ నగలను తాకట్టు పెట్టుకోవడానికి ఇవ్వమని అడిగింది. నాగమ్మ నిరాకరించడంతో, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని, మంచంపై టీవీ చూస్తున్న నాగమ్మ మెడకు తను ధరించిన చున్నీతో గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
*సొత్తు రికవరీ:* హత్య అనంతరం ఉదయం నాగమ్మ చెవులకున్న బంగారు దిద్దులను దొంగిలించి, కొప్పాక గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద రూ.50,000/-లకు తాకట్టు పెట్టింది. హత్యకు ఉపయోగించిన చున్నీని కశింకోట కాలువలో పారేసింది.
*పోలీసుల తక్షణ చర్యలు – రికవరీ:*
సాంకేతిక ఆధారాలు, నమ్మకమైన సమాచారంతో అనుమానితురాలైన సిమ్మ సత్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. మధ్యవర్తుల సమక్షంలో:
దొంగిలించబడిన బంగారు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నారు.
హత్యకు ఉపయోగించిన చున్నీని కాలువ నుండి వెలికితీశారు.
అనంతరం ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది.
*పోలీస్ సిబ్బందికి అభినందనలు:*
కేసు నమోదైన 24 గంటల స్వల్ప వ్యవధిలోనే నిందితురాలిని గుర్తించి, అరెస్ట్ చేసిన:
కశింకోట సి.ఐ అల్లు స్వామి నాయుడు,
ఎస్సై శ్రీ కె.లక్ష్మణరావు
సిబ్బంది జి.శ్రీనివాసరావు, ఎమ్.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీస్ సిబ్బందిని...
అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మరియు డీఎస్పీ శ్రీమతి శ్రావణి గారు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసించారు.

*జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్సైలు* అనకాపల్లి జిల్లా  ఎస్పీ శ్రీ తుహిన్ ...
27/05/2026

*జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్సైలు*

అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారిని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీడికాడ సబ్-ఇన్స్పెక్టర్ డి.లక్ష్మీనారాయణ, బుచ్చయ్యపేట సబ్-ఇన్స్పెక్టర్ పి.మనోజ్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీ గారికి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇరువురు ఎస్సైలను ఎస్పీ గారు అభినందించారు. వారివారి పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, విధులను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు నూతన ఎస్సైలకు అందించిన ముఖ్యమైన సూచనలు:
స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలి. ఎన్‌ఫోర్స్‌మెంట్ పనులను మరింత పటిష్టంగా అమలు చేయాలి.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, వారికి భరోసా కల్పించాలి. శాంతి భద్రతలను కాపాడుతూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.

ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.

రాత్రి వేళల్లో గస్తీ (పెట్రోలింగ్) ముమ్మరం చేయాలి. మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' మరియు ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా, చట్టపరమైన నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలి.

నూతన ఎస్సైలు ఇద్దరూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ, శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.



Andhra Pradesh Police

*గంజాయి అక్రమ రవాణా కేసులో ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్: కొత్తకోట పోలీసులు*  *కొత్తకోట, మే 25:...
25/05/2026

*గంజాయి అక్రమ రవాణా కేసులో ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్: కొత్తకోట పోలీసులు*

*కొత్తకోట, మే 25:* జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ వారెంట్ల (NBW) అమలుకై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో, గత ఆరేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఒక ముఖ్య గంజాయి అక్రమ రవాణాదారుడిని కొత్తకోట పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

*కేసు వివరాలు:*
కొత్తకోట సిఐ జి.కోటేశ్వరరావు, ఎస్ఐ ఎం.శ్రీనివాస్ ల ఆధ్వర్యంలోని ప్రత్యేక ఎన్‌బీడబ్ల్యూ బృందం ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లాలో దాడులు నిర్వహించింది.

2016 సంవత్సరంలో కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసు (Cr. No: 58/2016 U/s 20(b) & 25 NDPS Act) లో నిందితుడిగా ఉండి, కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా సుదీర్ఘ కాలంగా తప్పించుకు తిరుగుతున్న బొబ్బాసి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న (తండ్రి: రాము, వయస్సు: 41 సంవత్సరాలు)ను పోలీసులు గుర్తించారు.
తూర్పుగోదావరి జిల్లా, పొలమూరు పంచాయతీ, కొంతమూరు గ్రామంలోని సంతోష్ నగర్‌లో గల నిందితుడి నివాసంలోనే అతడిని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు జారీ చేసిన నాన్-బైలబుల్ వారెంట్ (NBW)ను అమలు చేస్తూ అతడిని అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

*ఎస్పీ గారి హెచ్చరిక:*
చట్టాన్ని ఉల్లంఘించి, సమాజానికి ముప్పుగా పరిణమించే గంజాయి మరియు ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. ఎన్ని సంవత్సరాలైనా సరే, తప్పించుకు తిరుగుతున్న నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన కొత్తకోట సిఐ, ఎస్ఐ మరియు ఎన్‌బీడబ్ల్యూ బృంద సభ్యులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.


Andhra Pradesh Police

*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత:58 ఫిర్యాదుల స్వీకరణ* *బాధితులకు 7 రోజుల్లోపు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ...
25/05/2026

*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత:58 ఫిర్యాదుల స్వీకరణ*

*బాధితులకు 7 రోజుల్లోపు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశం*

*అనకాపల్లి, మే 25:* ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు బాధితుల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నేటి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 58 ఫిర్యాదులను స్వీకరించారు.
*ప్రధాన ఫిర్యాదులు:*
సివిల్ వివాదాలు: భూ తగాదాలు, మోసపూరిత ఘటనలు మరియు ఆస్తి సంబంధిత వివాదాలు.
కుటుంబ సమస్యలు: కుటుంబ కలహాలు మరియు భార్యాభర్తల మధ్య వేధింపులు.
ఇతర సమస్యలు: వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పౌర సమస్యలు.
ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ క్రింది ఆదేశాలు జారీ చేశారు.

*7 రోజుల్లో న్యాయం:* ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లోపు సమగ్ర విచారణ పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలి.
నిష్పక్షపాత విచారణ: ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం వాస్తవాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
*బాధితులకు సమాచారం:* బాధితులకు తమ ఫిర్యాదుపై చేపట్టిన చర్యల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకాన్ని పెంపొందించాలి.
*నివేదిక సమర్పణ:* విచారణ అనంతరం తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికను తప్పనిసరిగా జిల్లా కార్యాలయానికి సమర్పించాలి.

*జిల్లా ఎస్పీ గారి వ్యాఖ్య:*
"ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించడమే పోలీసు యంత్రాంగం ప్రధాన బాధ్యత. ముఖ్యంగా మహిళా రక్షణకు పెద్దపీట వేస్తూ, వారిని మోసగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజా సమస్యల పరిష్కారంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు."
— శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ (జిల్లా ఎస్పీ)

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, ఎస్సై శ్రీనివాస రావు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.



Andhra Pradesh Police

Address

Office Of The Supdt Of Police, Anakapalli District
Anakapalle
531002

Alerts

Be the first to know and let us send you an email when Anakapalli District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share