Anakapallelo CBN Again

Anakapallelo CBN Again Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anakapallelo CBN Again, Political organisation, Anakapalle.

*వెంకటరాజుపురం, వాకపల్లి గ్రామాల్లో ఎన్డీఏ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి  ప్రచార కార్యక్రమం* ఈరోజు మాడుగుల నియోజవర్గం...
26/04/2024

*వెంకటరాజుపురం, వాకపల్లి గ్రామాల్లో ఎన్డీఏ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి ప్రచార కార్యక్రమం*

ఈరోజు మాడుగుల నియోజవర్గం, దేవరాపల్లి మండలంలో వెంకటరాజుపురం మరియు వాకపల్లి గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి *శ్రీ బండారు సత్యనారాయణమూర్తి* గారు మరియు *నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ PVG కుమార్* గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్డీఏ అభ్యర్థి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ పెద్దపీఠం వేశారన్నారు. అలాగే బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడం ఎంత అవసరమో ప్రజలందరికీ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇంచార్జ్ PVG కుమార్ గారు మాట్లాడుతూ మాడుగుల నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి కానుక ఇద్దామని చెప్పి ప్రజలందరికీ దిశ నిర్దేశం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మాడుగుల నియోజకవర్గం, కే కోటపాడు మండలం, కె జె పురం గ్రామం లో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీరాములు వారిని దర్శించుకున్న మాడు...
17/04/2024

మాడుగుల నియోజకవర్గం, కే కోటపాడు మండలం, కె జె పురం గ్రామం లో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీరాములు వారిని దర్శించుకున్న మాడుగుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *PVG కుమార్* గారూ


*ఏపీ ప్రజలకు టీడీపీ విజన్ - 2024 :- ఇన్చార్జి PVG కుమార్*ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, K కోటపాడు మండల పార్టీ  కేంద్రంలో *మ...
08/04/2024

*ఏపీ ప్రజలకు టీడీపీ విజన్ - 2024 :- ఇన్చార్జి PVG కుమార్*

ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, K కోటపాడు మండల పార్టీ కేంద్రంలో *మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి PVG కుమార్* గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఇన్చార్జి PVG కుమార్ గారూ మాట్లాడుతూ

👉చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం తెలుసు.

👉అలా పెరిగిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయడాని టీడీపీ కట్టుబడి ఉంది.

సంక్షేమ పథకాలకు టీడీపీ పెట్టింది పేరు. సంక్షేమానికి అన్న సీనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి అందిస్తాము.

యువతకు మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము.

స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000

ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం

ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు

ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ. 1,500

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

వృద్ధులు, వితంతువులకు నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే రూ.4 వేల పింఛను ఇస్తాను.

పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచి పరిశీలించి జూన్లో పెంచిన పింఛన్లను అందజేస్తాము.

పింఛన్ల విషయంలో వైఎస్సార్సీపీ శవ రాజకీయాలు చేసింది.

అమరావతి విషయంలో 29వేల మంది రైతులు భూములు ఇచ్చారు.

అమరావతి అభివృద్ధికి సమిష్టిగా 35,000 ఎకరాల భూమిని ఇచ్చారు.

అమరావతి అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరిగి ఉంటే, ప్రభుత్వం 10,000 ఎకరాల భూమిని సేకరించి, రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని పొంది ఉండేది.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేశాడు.

తెలుగుదేశం పార్టీ ఉద్యోగాల్లో, కాలేజీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసింది.

తెలుగుదేశం పార్టీ తీసుకన్న నిర్ణయంతోనే ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు అవకాశం కల్పించారు.

ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో రూ.5000గా ఉంది.

మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాము.

గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ అరాచకాలు శృతి మించాయి.

ఏప్రిల్ 4వ తేదీన నమాజ్ చేసి తిరిగి వస్తున్న ముస్లిం మహిళపై వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసరెడ్డి దాడికి పాల్పడ్డాడు.

అతను బహిరంగంగా ఆమె బుర్కాను తీసివేసి, ఆమె ముఖాన్ని చూసి, ఆమెను అవమానించాడు.

మైనార్టీలపై వైఎస్సార్సీపీ చేస్తున్న అరాచకాల వల్ల మిస్బా, అబ్దుల్ సలీమ్ కుటుంబం కూడా ప్రాణాలు కోల్పోయాయి.

గురజాలలో మైనర్ ముస్లిం బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై సరైన చర్యలు లేవు.

నిందితుడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావుకు చెందిన వారని, అతనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మైనారిటీలకు 4% రిజర్వేషన్ల అమలుకు తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తుంది.

2014-2019 మధ్యకాలంలో టీడీపీ సుప్రీంకోర్టులో కూడా దీని కోసం పోరాడింది.

ముస్లింల కోసం గతంలో తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మళ్లీ ప్రారంభమవుతాయి.

పేద ప్రజలకు టీడీపీ హయాంలో 12 లక్షల 50 వేల టిడ్కో ఇళ్లు కట్టించాము.

జగన్ రెడ్డి రాష్ట్రంలోకి గంజాయి, జౌ బ్రాండ్ మద్యం, డ్రగ్స్ తీసుకొచ్చారు.

ప్రతి కిరాణా షాపులో గంజాయి దొరుకుతుంది. వైఎస్ఆర్సిపి నాయకులు అమ్ముతున్నారు.

గత ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.

రక్షిత మంచినీటి పథకం కింద ప్రతి ఇంటికి తాగునీరుని అందిస్తాము.

అధికారంలోకి వచ్చిన వెంటనే చీప్ లిక్కర్ను నిషేధిస్తాం.

అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయి, జె బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తాం.

జగన్ మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ వల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోయి ఆసుపత్రి పాలవుతున్నారు

ఈ యొక్క సమావేశం లో అనకాపల్లి పార్లమెంట్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు, నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ ఇన్చార్జి జురెడ్డి రాము, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు యడ్ల రమేష్, రాష్ట్ర పార్టీ ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పైలా నారాయణమూర్తి, ఎక్స్ సర్పంచ్ రొంగలి అప్పల నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు.


మాడుగుల నియోజకవర్గం,కే కోటపాడు మండలం, గొండుపాలెం గ్రామం లో, శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారును దర్శించుకున్న మాడుగుల నియ...
08/04/2024

మాడుగుల నియోజకవర్గం,కే కోటపాడు మండలం, గొండుపాలెం గ్రామం లో, శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారును దర్శించుకున్న మాడుగుల నియోజకవర్గం ఇంచార్జ్ *PVG కుమార్* గారు


*ఫించన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు మార్చి 16 - 30 మద్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత...
01/04/2024

*ఫించన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు మార్చి 16 - 30 మద్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్ రెడ్డి :- ఇన్చార్జి PVG కుమార్*

ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, K కోటపాడు మండలం కేంద్రంలో మాడుగుల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి PVG కుమార్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

👉సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమీషన్, తెలుగుదేశం కాదు

👉ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఖజానాలో నిధులు లేకనే కదా?

👉1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం సాధ్యం

👉జగన్ రెడ్డి స్వార్ధ రాజకీయం వల్లే ఫించన్ దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారు

👉టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ.4,000 పింఛన్ అందిస్తోంది

👉ఫించన్లు సకాలంలో ఇళ్ల వద్దనే పంపిణీ చేయకపోతే సీఎస్ జవహార్ రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కమీషన్ తగు చర్యలు తీసుకోవాలి.

1. లక్షా 35వేల మంది సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లు ఒకటో తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

2. ఒకటో తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును మరియు జనవరి 23న బటన్ నొక్కిన ఆసరా డబ్బును, ఫిబ్రవరి 16న బటన్ నొక్కిన చేయూత డబ్బును, ఫిబ్రవరి 29న పామర్రులో బటన్ నొక్కిన విద్యా దీవెన డబ్బును, మార్చి 14న బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బును, ఆరోగ్య శ్రీకి ఇవ్వాల్సిన నిధులు రూ.13వేల కోట్లు మార్చి 16 నుంచి 30వ తారీషు లోపల అంటే 15 రోజుల్లోనే జగన్రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం దోచిపెట్టాడు. దీంతో పింఛన్ల సొమ్ములు ఇవ్వడానికి నేడు ఖజానాలో సరిపడా నిధులు లేవు.

3. అందుకే తన దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి జగన్రెడ్డి ఎన్నికల కమిషన్పైనా, నిమ్మగడ్డ రమేష్ కుమార్పైన, టీడీపీపైన దుష్ప్రచారం చేయిస్తున్నాడు.

4. వాలంటీర్లు ప్రజా సేవా కార్యక్రమాలకు కాకుండా జగన్రెడ్డి వారిని వైకాపా కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశాడు. వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగాచేసి వందల మందిని సస్పెన్షన్లకు, వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు జగన్ రెడ్డి కారకుడయ్యాడు.

5. వాలంటీర్లను ప్రజా సేవకులుగా కాక జగన్రెడ్డి తన పార్టీ కార్యకర్తల్లా దుర్వినియోగం పరిచినందునే ఎన్నికల కమీషన్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది.
6. పింఛన్ దారుల పట్ల వైకాపాకు ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ఖజానాలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాడు కాదు. పించన్లకు నిధుల కొరత పెట్టేవాడు కాదు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి కారణం నిధులు కొరతే గాని ఎన్నికల కమీషన్ కాదు. దీనికి రుజువు ఏప్రిల్ 3వ తారీషు నుంచి ఫించన్లు పంపిణీ చేస్తారని మార్చి 28న సాక్షి దినపత్రికలో జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన వార్తను ప్రచురించింది. ఎందుకు ఇలా సాక్షిలో రాశారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే కదా. ఈ వాస్తవాన్ని కప్పిపెట్టి ఎన్నికల లబ్ది కోసం దుష్ప్రచారం చేస్తుంది.

7. వైకాపా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజాసేవ మాత్రమే చేసే వాలంటీర్లను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుంది. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్ దారులకు నెలకు రూ.4,000 పెన్షన్లు ఇంటి వద్దకే పంపిణీ చేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.

8. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి గారు సెర్చ్, సీఈవో మురళీధర్ రెడ్డి గారు ఫించన్ల పంపిణీ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఈ సమావేశం లో అనకాపల్లి జిల్లా పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు, ఎక్స్ జెడ్పీటీసీ p సత్యవతి, సర్పంచ్ దాడి ఏరుకునాయుడు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ ఇన్చార్జి జురెడ్డి రాము, బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కొట్టన ఈశ్వరరావు, రాష్ట్ర పార్టీ ఐటిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ పైలా నారాయణ మూర్తి, ఎక్స్ సర్పంచ్ రొంగలి అప్పలనాయుడు, రుద్ర ఈశ్వరరావు, స్వామినాదం, రావాడ రమణ, పల్లి రాజు బాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.



K. కోటపాడు మండలం, కింతాడ పంచాయతి, గొల్లలపాలెం గ్రామం లో పోతురాజు గావుపండగకి హాజరైనా తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి *PVG కుమా...
23/03/2024

K. కోటపాడు మండలం, కింతాడ పంచాయతి, గొల్లలపాలెం గ్రామం లో పోతురాజు గావుపండగకి హాజరైనా తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి *PVG కుమార్* గారు


మాడుగుల నియోజకవర్గం,కే కోటపాడు మండలం, గుల్లేపల్లి గ్రామం లో పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి *...
23/03/2024

మాడుగుల నియోజకవర్గం,కే కోటపాడు మండలం, గుల్లేపల్లి గ్రామం లో పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి *PVG కుమార్* గారు


*“కలలకు రెక్కలు” పథకాన్ని మహిళలందరు సద్వినియోగం చేసుకోండి* :-  *ఇన్చార్జి PVG కుమార్*ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, K కోటపా...
08/03/2024

*“కలలకు రెక్కలు” పథకాన్ని మహిళలందరు సద్వినియోగం చేసుకోండి* :- *ఇన్చార్జి PVG కుమార్*

ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, K కోటపాడు మండలం కేంద్రంలో *మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి PVG కూమార్* గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

*మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారూ మరో కీలక ముందడుగు వేశారు.

*'కలలకు రెక్కలు' అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారు.

*ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని వచ్చారు.

* ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.

* ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

• రాష్ట్రంలోని ఏ అడబిడ్డ కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కలలతో రాజీ పడకుండా వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ పథకం అడుగులు వేయిస్తుంది.

ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంక్ లోన్ కు తెలుగుదేశం - జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత (హమీ) వహిస్తుంది.

ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే మొత్తం రుణానికి సంబంధించిన వడ్డీని కూడా టీడీపీ- జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుంది.

* ఈ పథకం ద్వారా ఏ తెలుగింటి ఆడబిడ్డ కూడా నిధుల కొరత కారణంగా తమ కలలతో రాజీ పడాల్సిన అవసరం లేదు.

• ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించవచ్చు.

ప్రక్రియ

• లోన్ ను ఎంచుకున్న విద్యార్థికి టీడీపీ-జేఎస్పీ ప్రభుత్వం రుణ హామీదారుగా నిలుస్తుంది.

• కోర్సును అభ్యసించే వరకు వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.

• మహిళలు వెబ్సైట్ - Kalalakurekkalu.com లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజస్టర్ చేసుకున్న వారు సర్టిఫికేట్ పొందవచ్చు.

2024 జూన్ లో టీడీపీ - జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. అనంతరం రిజిస్టర్ చేసుకున్న మహిళలు తమ సమీపంలోని నోటిఫైడ్ బ్యాంక్ కు వెళ్లి తరువాత ప్రక్రియని పూర్తి చేసుకోవచ్చు.

రిజిస్టేషన్ లింక్ పొందడానికి 9261292612 కు మిస్ కాల్ ఇవ్వండి.

ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ సాంస్కృతిక అధ్యక్షులు కసిరెడ్డి అప్పల నాయుడు, క్లస్టర్ ఇన్చార్జి లు కన్నురు సూర్య నారాయణ, లెక్కల మల్లేశ్వరరావు, ఎక్స్ ఎంపీపీ సబ్బవరపు రామానాయుడు, ఎక్స్ సర్పంచ్ లు బత్తి రమణ, రొంగలి అప్పలనాయుడు,నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ ఇన్చార్జి జురెడ్డి రాము,మాజీ రైవాడ రిజర్వాయర్ చైర్మన్ లెక్కల అవతార మూర్తి, యూనిట్ ఇన్చార్జి రాళ్ళపల్లి శ్రీ రామ్ మూర్తి, అక్కన్న పాత్రుడు, రాష్ట్ర ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పైల నారాయణా మూర్తి, పల్లి రాజుబాబు, రావడ రమణ, రాము నాయుడు, నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ లెక్కల శ్రీధర్, ముచ్చ పాత్రుడు, నవీన్, ముచ్ఛపాత్రుడు మరియు తదితర నాయుకులు పాల్గొన్నారు.









#నిజంగెలవాలి

*బాబు సూపర్ సిక్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ను విజయవంతం చేద్దాం* :- *ఇన్చార్జి PVG కుమార్* ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, చ...
06/03/2024

*బాబు సూపర్ సిక్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ను విజయవంతం చేద్దాం* :- *ఇన్చార్జి PVG కుమార్*

ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలం కేంద్రం లో *బాబు సూపర్ సిక్స్* రిజిస్ట్రేషన్స్ పై అవగాహన కొరకు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జి లకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం లో *మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి PVG కుమార్* గారు మాట్లాడుతూ మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేయాలో బూత్ ఇన్చార్జి లుకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. సూపర్ సిక్స్ లో ఉన్న ఆరు పథకాలను బూత్ ఇన్చార్జిలకు మరో సారి వివరించడం జరిగింది.ప్రతి ఒక్కరూ కూడా బాబు సూపర్ సిక్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి సూపర్ సిక్స్ పథకాలను వివరించాలి అన్నారు. మన మాడుగుల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జిలు లెక్కల మల్లేశ్వరరావు, దొగ్గ దేముడునాయుడు, పుప్పాల రమేష్, కన్నురు సూర్యనారాయణ,, యూనిట్ ఇంఛార్జిలు, వెంకన్నదొర, మజ్జి బాబ్జీ, దొగ్గ వరాహమూర్తి, రాళ్లపల్లి శ్రీ రామమూర్తి, సింహాచలం నాయుడు, సింగంపల్లి అప్పారావు, సూరిబాబు, కింతలి సర్పంచ్ సన్యాసిరావు, అనకాపల్లి సాంస్కృతిక విభాగం అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు,తిమిరాం సాంబ మూర్తి, ఎక్స్ సర్పంచ్ వేచలపు సింహాద్రిప్పడు, గాదిరాయి గ్రామ కమిటీ అధ్యక్షులు అప్పారావు, గుల్లేపల్లి ఎంపీటీసీ దేముడు బాబు, మరియు బూత్ ఇన్చార్జిలు పాల్గోన్నారు





02/03/2024
ఈరోజు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం, ఏ కొత్తపల్లి గ్రామంలో తుంపాల వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను...
29/02/2024

ఈరోజు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం, ఏ కొత్తపల్లి గ్రామంలో తుంపాల వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ *PVG కుమార్* గారు మరియు ఆయన సతీమణి ఎక్స్ జెడ్పిటిసి *సత్యవతమ్మ* గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.




మాడుగుల నియోజకవర్గం, దేవరపల్లి మండలం, కాశిపురం గ్రామంలో, దేవరపల్లి మండల పార్టీ అధ్యక్షులు చిటిమరెడ్డి సూర్యనారాయణ గారు న...
29/02/2024

మాడుగుల నియోజకవర్గం, దేవరపల్లి మండలం, కాశిపురం గ్రామంలో, దేవరపల్లి మండల పార్టీ అధ్యక్షులు చిటిమరెడ్డి సూర్యనారాయణ గారు నూతన గృహ ప్రవేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *PVG కుమార్* గారు మరియు ఎక్స్ జెడ్పిటిసి *పి సత్యవతమ్మ** గారు


Address

Anakapalle
531032

Website

Alerts

Be the first to know and let us send you an email when Anakapallelo CBN Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share