01/06/2026
కడప కోటిరెడ్డి సర్కిల్‌లో నిరసన జ్వాలలు!
జగన్ దిష్టి బొమ్మ దహనం!
తాను చేయలేని పని, తన వల్ల కాని పని ఇంకెవరు చేసిన ఓర్చుకోలేక నాశనం చేయడం, బురద చిమ్మడం జగన్ చేసే అత్యంత సర్వ సాధారణ పని. అది పెట్టుబడులైనా, రాజధాని అయినా, ఉద్యోగాలు అయినా అదే పద్ధతి. దానివల్ల బలయ్యేది రాజకీయ ప్రత్యర్థులైనా, ప్రజలైనా, యువతైనా, అణగారిన వర్గాలైనా తనకు నచ్చనిది ఏదీ జరగకూడదు కాబట్టి వాటిని నాశనం చేస్తాడు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరికాదని కంపెనీలకు మెయిల్స్ పెట్టించాడు, అమరావతి వేశ్యల రాజధాని అని తన సాక్షి లో చెప్పించాడు, ఇప్పుడు ఏళ్ల తరబడి కష్టపడి చదివి DSC లో ఉద్యోగం సంపాదించిన యువతను అక్రమంగా ఉద్యోగం పొందారని ఆరోపణ చేస్తున్నాడు
అధికారంలో ఉన్న సందర్భాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చేసిన మొట్టమొదటి సంతకం DSC ఫైలు మీదనే
ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టింది చంద్రబాబు గారు, Aided స్కూల్స్ కి ఆసరా ఇచ్చింది చంద్రబాబు గారు. కానీ ఇంగ్లీష్ మీడియం నేనే తెచ్చానని క్రెడిట్ చోరీ చేయడం, విద్యావ్యవస్థను బాగు చేయమంటే ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా పాత స్కూల్స్ కి రంగులేయడం, పబ్లిసిటీ పిచ్చితో బ్యాగులు, బెల్టులు ఆఖరికి చిక్కీ ప్యాకెట్ మీద ఫోటోలు వేసుకోవడం తప్ప, 12000వేలకు పైగా స్కూల్స్ లో టీచర్లు లేక ఒక్క టీచర్ తో స్కూల్ అంతా నెట్టుకొస్తున్నా కూడా విద్యావ్యవస్థకు మూలమైన టీచర్లను మాత్రం నియమించలేదు సరికదా ఇప్పుడు శాస్త్రీయంగా జరుగుతున్న నియామక ప్రక్రియ పై ప్రజల్లో అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
YSR కూడా 1997లో DSCలో అక్రమాలు అంటూ కోర్టుల్లో కేసు వేసి DSC ని అడ్డుకుని కోర్టు కేసులతో అర్హత పొందిన అభ్యర్థులను ఉద్యోగాల్లో చేరనివ్వకుండా ఆపి వారి జీవితాలను నాశనం చేశాడు. మళ్లీ అదే విధానంలో ఇప్పటి DSC లో సెలెక్ట్ అయిన వేలమంది ఉపాద్యాయుల జీవితాలని నాశనం చేయడానికి ముందువచ్చాడు జగన్ మోహన్ రెడ్డి.
పాదయాత్రలో హామీ ఇచ్చి తన హయాంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేని జగన్ మోహన్ రెడ్డి కూటమి పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ ప్రకారం DSC ఇస్తే దాన్ని ఆపడానికి కోర్టుల్లో దాదాపు 280 కేసులు వేయించారు. అన్ని కేసులని క్లియర్ చేసుకుని DSC లో సెలెక్ట్ అయితే అది అక్రమంగా సెలెక్ట్ అయ్యారంటూ నిరుద్యోగుల ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని వారి జ్ఞానాన్ని అవహేళన చేస్తున్నాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఎంతో పకడ్బందీగా చేపట్టిన 'స్పోర్ట్స్ DSC-2025' నియామక ప్రక్రియపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. 'స్పోర్ట్స్ DSC -2025' నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించబడింది. క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం SAP కు లేదు. అవి కేవలం సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా మాత్రమే జారీ చేయబడతాయి. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సర్టిఫికెట్‌ను, అది జారీ చేసిన సంస్థకు పంపి, అధికారికంగా జెన్యూనిటీ ధృవీకరించిన తర్వాతే మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ధృవీకరణ లేని ఏ సర్టిఫికెట్‌ను ఎంపిక ప్రక్రియలో ఉపయోగించలేదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు పై 25.07.2025న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు FIR No.75/2025 (BNS సెక్షన్ 319(2), IT Act సెక్షన్ 66-D) నమోదు చేశారు. స్థానిక/స్థానికేతర స్థితికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. క్రీడా మెరిట్ ధృవీకరణ మాత్రమే శాప్ పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లు, రోస్టర్ అమలు మరియు పోస్టుల కేటాయింపులు పూర్తిగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం జరిగాయి. అలాగే ఏ ఒక్క అభ్యర్థి టెస్ట్ డేటా తీయకుండా భద్రంగా ఉంచారు. స్పోర్ట్స్ DSC-2025, శాప్, విద్యా శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తులు, మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు సహా కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. స్పోర్ట్స్ DSC-2025 పై తప్పుడు వార్తల్ని ఎవరూ నమ్మవద్దు.
***
వైసీపీ నాయకులు చేస్తున్న "అసత్య ఆరోపణలను" తీవ్రంగా ఖండిస్తూ కడప నగరంలోని ప్రముఖ కూడలి అయిన కోటిరెడ్డి సర్కిల్ సాక్షిగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. TNSF ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం చివరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి దారితీసింది. విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ఆగ్రహం ఈ సందర్భంగా స్పష్టంగా కనిపించింది.
కదంతొక్కిన క్షేత్రస్థాయి నాయకత్వం
ఈ నిరసన కేవలం ఒక ప్రాంతానికో, కొద్దిమందికో పరిమితం కాలేదు. #చాకిరేవు