Amalapuram Municipality

Amalapuram Municipality Amalapuram Municipality is 1st largest ULB in the Dr Br Ambedkar Konaseema of Andhra Pradesh.

12/11/2025

మతిస్థిమితం కోల్పోయి , ఆదరించే వారు లేని రోడ్లపై తిరిగే వ్యక్తుల వివరాలు తెలపండి: మానసిక అనారోగ్యంతో బాధపడుతూ, ఆదరించేవారు లేని రోడ్లపై తిరిగే నిరాశ్రయుల కోసం మనోబంధు ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14 ( శుక్రవారం) న అమలాపురం పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ గారు తెలిపారు.ఈ డ్రైవ్ ద్వారా మనోబంధు ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల సహకారంతో మానసిక అనారోగ్యంతో బాధపడుతూ,ఆదరణ లేక, రోడ్లుపై తిగిగే వారిని విశాఖపట్నంలోని మానసిక రోగుల హాస్పిటల్ లో చేర్పించి,వైద్య సేవలు,వసతి,ఆహారం అందచేయడం జరుగుతుందని కమిషనర్ వి. నిర్మల్ కుమార్ గారు తెలియచేశారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని ఎక్కడైనా మతిస్థిమితం లేని, రోడ్లపై తిరిగే వ్యక్తుల కనిపిస్తే 8978887145 కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ వి . నిర్మల్ కుమార్ గారు తెలియచేశారు.

*ఈరోజు స్వర్ణ ఆంధ్ర -  స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో  భాగంగా అమలాపురం పట్టణంలోని విద్యానిధి హై స్కూల్ మరియు జూనియర్ కళాశాల న...
20/09/2025

*ఈరోజు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణంలోని విద్యానిధి హై స్కూల్ మరియు జూనియర్ కళాశాల నందు అమలాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో " గ్రీన్ ఏపీ"థీమ్ తో విద్యార్థులకు స్వచ్ఛత, స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలు, స్వచ్చోత్సవ్, స్వచ్ఛత హి సేవ, వ్యక్తిగత ,పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధం, పర్యావరణ హితమైన గుడ్డ, నార,పేపర్ సంచులు వాడకం పై అమలాపురం పురపాలక సంఘానికి శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు మరియు ఎమినిటీస్ సెక్రెటరీలు విస్తృతంగా విద్యార్థులకు అవగాహన కల్పించి, విద్యార్థులచే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.పర్యావరణం పరిరక్షణ కొరకు విద్యార్థులు అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే అమలాపురం పట్టణంలోని అన్ని వార్డులలో ,ప్రజా ప్రతినిధులు,పట్టణ ప్రజలతో కలిసి సచివాలయాల సెక్రటరీలు మొక్కలు నాటి,స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.విద్యానిధిలో జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల ఛైర్మన్,ఉపాద్యాయులు , విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో విద్యానిధి విద్యాసంస్థల ఛైర్మన్ ఆకుల బాపన్నాయుడు గారు,ప్రిన్సిపల్ ఆర్ .మాధవి గారు , , సచివాలయ శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీలు , ఎమిటినీస్ సెక్రెటరీలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.*

*ఈరోజు అమలాపురం పురపాలక సంఘం పరిధిలో 30  వార్డ్ లలో జరుగుతున్న  పీ-4 నీడ్ అసెస్మెంట్ సర్వే ను మున్సిపల్ కమీషనర్ వి.నిర్మ...
31/07/2025

*ఈరోజు అమలాపురం పురపాలక సంఘం పరిధిలో 30 వార్డ్ లలో జరుగుతున్న పీ-4 నీడ్ అసెస్మెంట్ సర్వే ను మున్సిపల్ కమీషనర్ వి.నిర్మల్ కుమార్ గారు స్వయంగా పరిశీలించి,లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి బంగారు కుటుంబాలుగా చేర్చడానికి వారికి ఉన్న అర్హత ప్రమాణాలను పరిశీలించి,బంగారు కుటుంబాలు గా ఎంపిక చేసిన వారి కుటుంబ సభ్యులలో ఏయే అవసరాలు ఉన్నాయో తెలుసుకుని ,వారి వివరాలు యాప్ లో సచివాలయం సిబ్బందిచే సిబ్బంది అప్డేట్ చేయడం గురించి పూర్తిగా పరిశీలించారు. అందరు సచివాలయం సిబ్బంది ఈ సర్వే ను ఈరోజు సాయంత్రం లోపు పూర్తి చేసి, సమగ్ర నివేదిక అందచేయాలని తెలియచేశారు.*

28/07/2025
A meeting was convened by Municipal Commissioner V.Nirmal Kumar at Commissioner's Chamber for proprietors of wholesale s...
23/07/2025

A meeting was convened by Municipal Commissioner V.Nirmal Kumar at Commissioner's Chamber for proprietors of wholesale shops and grocery stores selling polythene covers and single-use plastic items in Amalapuram town.

ఈరోజు స్వర్ణ ఆంధ్ర  - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం నుండి గడియారస్థంభం వరక...
19/07/2025

ఈరోజు స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం నుండి గడియారస్థంభం వరకు "ప్లాస్టిక్ కాలుష్యమునకు అంతం" అనే ఇతివృత్తంతో అవగాహన ర్యాలీ నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం శాసన సభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పురపాలక సంఘం కార్యాలయం నుండి గడియారస్థంభం సెంటర్ వరకు కొనసాగింది. తర్వాత గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద సభా కార్యక్రమం నిర్వహించబడినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమీషనరు వి.నిర్మల్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్లాస్టిక్ పెనుభూతంగా మారిందని, ప్లాస్టిక్ వలన నేల, నీరు కలుషితం అవుతుందని, ప్లాస్టిక్ వలన క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాదులు వస్తున్నాయని, పట్టణ పౌరులు, వ్యాపారులు బాద్యతగా వ్యవహరించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను మరియు పాలిధీన్ కవర్లను నిషేదించి, పర్యావరణ హితమైన గుడ్డ, నార మరియు పేపరు సంచులను మాత్రమే వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.,ప్రజాప్రతినిధులు ,అధికారులు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రెడ్డి సత్య నాగేంద్రమణి గారు, కమీషనరు వి.నిర్మల్ కుమార్ గారు, డీఈఈ కె.వి.వి.సత్యనారాయణ గారు, ఏఈలు వి.కృష్ణ గారు, డి.భాస్కర్ గారు, కె.వెంకటేష్ గారు, టీపీవో బి.సంయుక్త రాణి గారు, మేనేజర్ డి.ప్రభాకర్ గారు, ఆర్ వో బి. శ్రీలక్షి గారు,మెప్మా సి.ఎంఎం సయ్యద్ హుస్సేన్ గారు ,వార్డు కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్, సచివాలయం మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ గారి ఆదేశాలు మేరకు ,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన  120 మైక్ర...
18/07/2025

అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ గారి ఆదేశాలు మేరకు ,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన 120 మైక్రాన్స్ కంటే తక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు అయిన ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ స్ట్రాలు, ప్లాస్టిక్ ఫోర్కులు ,స్పూన్ లు ,కప్పులు , ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కత్తులు, ప్లాస్టిక్ ఆహ్వాన పత్రికలు మొదలైన 16 రకాల ప్లాస్టిక్ వస్తువులను అమలాపురం పురపాలక సంఘం పరిధిలో క్రయ విక్రయాలు జరపడం నిషేధమని,నిషేధిత పాలిథిన్ కవర్లు మరియు 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఇక మీదట వ్యాపార సంస్థలు,సముదాయాలు వారు అమ్మితే రూ.500 నుండి రూ.5000 వరకు జరిమానాలు విధించి,ఆ షాప్స్ యొక్క ట్రేడ్ లైసెన్స్ లను కూడా రద్దు చేస్తామని వ్యాపార సంస్థలు, సముదాయాలు వారికి గట్టిగా హెచ్చరించి, అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని వార్డ్ సచివాలయాల శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీలు అమలాపురం పట్టణంలోని వ్యాపార సంస్థలు, సముదాయాలు యజమానులకు ఈరోజు నోటీసులు అందచేశారు.

అమలాపురం పురపాలక సంఘం కార్యాలయంలో వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీలతో ఈ నెల 19 వ తేదీన మూడో శనివారం నాడు నిర్...
17/07/2025

అమలాపురం పురపాలక సంఘం కార్యాలయంలో వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీలతో ఈ నెల 19 వ తేదీన మూడో శనివారం నాడు నిర్వహించనున్న స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై కమీషనర్ వి. నిర్మల్ కుమార్ గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.అంతకు ముందు గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలను సెక్రటరీలకు వివరించారు.ప్లాస్టిక్ ఫ్రీ జోన్ వీధిని గుర్తించడం,లిక్కర్ షాప్స్ వద్ద ఎక్కువగా ప్లాస్టిక్ గ్లాసుల వాడకంపై చర్యలు తీసుకోవడం, ప్లాస్టిక్ వస్తువులు అమ్మే హోల్ సేల్ షాప్స్ వారికి మీటింగ్ నిర్వహించి ప్లాస్టిక్ వస్తువులు అమ్మరాదని ,పూర్తిగా నిషేధమని తెలియచేయడం, ప్లాస్టిక్ వస్తువుల వలన వచ్చే అనర్థాలను వివరించి, ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణ హితమైన పేపర్, జూట్, వస్త్ర బ్యాగులను వాడి,పర్యావరణాన్ని కాపాడడం గురించి ,సుదీర్ఘంగా వివరించారు.*

మున్సిపల్ కార్యాలయంలో సూర్య ఘర్ యోజన పై సమీక్షఅమలాపురం పెన్ పవర్ జూలై 16 :ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పధకముపై అమలాపురం ...
16/07/2025

మున్సిపల్ కార్యాలయంలో సూర్య ఘర్ యోజన పై సమీక్ష

అమలాపురం పెన్ పవర్ జూలై 16 :ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పధకముపై అమలాపురం మున్సిపల్ కమీషనర్ వి.నిర్మల్ కుమార్ బుధవారం ఉదయం పురపాలక సంఘ కార్యాలయంలోని కమీషనర్ చాంబరు నందు సచివాలయం కార్యదర్శులకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పధకం ద్వారా లబ్దిదారులకు కలిగే ప్రయోజనాలు గురించి క్షుణ్ణంగా వివరించారు.ఈ పధకం ద్వారా సోలార్ రూప్ టాప్ లను లబ్దిదారులు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.78000/-ల వరకు సబ్సిడీని పొందవచ్చునని, ఎస్సీ మరియు ఎస్టీ వారికి ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తుందని, మిగిలిన వారికి తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు అందిస్తున్నాయని, అమలాపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్న గృహ యజమానులకు ఈ పధకం గురించి, ప్రభుత్వం అందిస్తున్న రాయితీ గురించి వార్డు సెక్రటరీలు అందరు సమగ్రంగా వివరించి, వచ్చే రెండు రోజులలోని ఆసక్తి ఉన్న లబ్దిదారులను ఎంపిక చేసి, వారి వివరములను పురపాలక సంఘ కార్యాలయమునకు అందజేయలని కమీషనర్ వి.నిర్మల్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎపిఈపిడిసిఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.అన్నవరం , సోలార్ రూప్ టాప్స్ ను ఏర్పాటు చేసే ఏజెన్సి ప్రతినిధులు పాల్గొని, ప్రధాన మంత్రి సూర్యఘర్ పధకం యొక్క ప్రయోజనాలు, ఏర్పాటు చేసుకునే విధానాన్ని గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో డిఈఈ కె.వి.వి.సత్యనారాయణ, టిపిఓ శ్రీమతి రాణీ సంయుక్త, ఏఈ కె.వెంకటేష్ ,గవర్నమెంట్ వెండర్ ఆజాద్‌ నాగసుధ కొండ మరియు వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పధకముపై మున్సిపల్ కమీషనర్ వి.నిర్మల్ కుమార్ గారు ఈరోజు ఉదయం గం.10.30లకు పురపాలక సంఘ కార్యాల...
15/07/2025

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పధకముపై మున్సిపల్ కమీషనర్ వి.నిర్మల్ కుమార్ గారు ఈరోజు ఉదయం గం.10.30లకు పురపాలక సంఘ కార్యాలయంలోని కమీషనర్ చాంబరు నందు సచివాలయం కార్యదర్శులకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పధకం ద్వారా లబ్దిదారులకు కలిగే ప్రయోజనాలు గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ పధకం ద్వారా సోలార్ రూప్ టాప్ లను లబ్దిదారులు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.78000/-ల వరకు సబ్సిడీని పొందవచ్చునని, ఎస్సీ మరియు ఎస్టీ వారికి ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తుందని, మిగిలిన వారికి తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు అందిస్తున్నాయని, అమలాపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్న గృహ యజమానులకు ఈ పధకం గురించి, ప్రభుత్వం అందిస్తున్న రాయితీ గురించి వార్డు సెక్రటరీలు అందరు సమగ్రంగా వివరించి, వచ్చే రెండు రోజులలోని ఆసక్తి ఉన్న లబ్దిదారులను ఎంపిక చేసి, వారి వివరములను పురపాలక సంఘ కార్యాలయమునకు అందజేయలని కమీషనర్ వి.నిర్మల్ కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఈపిడిసిఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.అన్నవరం గారు, సోలార్ రూప్ టాప్స్ ను ఏర్పాటు చేసే ఏజెన్సి ప్రతినిధులు పాల్గొని, ప్రధాన మంత్రి సూర్యఘర్ పధకం యొక్క ప్రయోజనాలు, ఏర్పాటు చేసుకునే విధానాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈఈ కె.వి.వి.సత్యనారాయణ గారు, టిపిఓ శ్రీమతి రాణీ సంయుక్త, ఏఈ కె.వెంకటేష్ మరియు వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమీషనరు ఆధ్వర్యంలో సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ జులై 10.  గౌరవ అయితాబత్తుల ఆనందరావు, శాసనసభ్యులు, అమలాపురం వారి  ఆ...
10/07/2025

మున్సిపల్ కమీషనరు ఆధ్వర్యంలో సమస్యలపై ప్రత్యేక డ్రైవ్

జులై 10. గౌరవ అయితాబత్తుల ఆనందరావు, శాసనసభ్యులు, అమలాపురం వారి ఆదేశములతో, శ్రీయుత కమీషనరు గారి ఆధ్వర్యంలో అమలాపురం పురపాలక సంఘం, 28వ వార్డులో ప్రత్యేక డ్రైవ్ చేసి పారిశుధ్యం, త్రాగునీరు, వార్డు సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో చైర్ పర్సన్, కమీషనరు వి.నిర్మల్ కుమార్, వార్డు గౌరవ సభ్యులు, DEE సత్యనారాయణ, AEలు, మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Address

Cinema Road
Amalapuram
533201

Alerts

Be the first to know and let us send you an email when Amalapuram Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Amalapuram Municipality:

Share