Dr B R Ambedkar Konaseema District Police

Dr B R Ambedkar Konaseema District Police TO SERVE THE PUBLIC WITH PRIDE

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేది :30.05.2026పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి...
30/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేది :30.05.2026

పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ చేసిన అధికారులకు ఘనంగా వీడ్కోలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇద్దరు పోలీసు అధికారులు తమ సుదీర్ఘ సర్వీసును పూర్తి చేసుకొని పదవీ విరమణ పొందనుంన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారు వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి అత్యంత ఘనంగా వీడ్కోలు పలికారు.

పదవీ విరమణ పొందిన అధికారుల వివరాలు మరియు వారి సేవా ప్రస్థానం:

1. శ్రీ వై. సూర్య నారాయణ గారు, సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్.ఐ):

వీరు 10.05.1989లో పోలీసు శాఖలో చేరి సుమారు 37 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారు. వీరు తన సర్వీసులో జడంగి, ఆలమూరు, రాజమండ్రి సి సి యస్,అంబాజీపేట కాకినాడ ట్రాఫిక్ ,మలిక్కిపురం, కాకినాడ టౌన్ , అంబాజీపేట,అయినవల్లి వంటి పలు కీలక పోలీస్ స్టేషన్లలో వివిధ హోదాల్లో పనిచేశారు.

చివరిగా అయినవల్లి పోలీస్ స్టేషన్‌లో అదనపు ఎస్.ఐ.గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందారు.

2. శ్రీ పి. వెంకట రమణ గారు , అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏ.ఎస్.ఐ):

వీరు 03.08.1990లో పోలీసు శాఖలో ప్రవేశించి 36 ఏళ్ల పాటు సేవలు అందించారు.
వీరు తన సుదీర్ఘ ప్రయాణంలో రాజానగరం ,రాయవరం, రాజమండ్రి త్రీ టౌన్, రాజోలు,రాజమండ్రి I,II, III టౌన్, కోరుకోండ ,బొమ్మూరు రావులపాలెం పోలీస్ స్టేషన్లలో పనిచేశారు.

ప్రస్తుతం రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో ఏ.ఎస్.ఐ.గా బాధ్యతలు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు.

*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ

👉పోలీస్ శాఖలో దశాబ్దాల పాటు అంకితభావంతో సేవలందించి ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేసిన అధికారులను అభినందించారు.

👉వ్యవస్థలో క్రమశిక్షణతో కూడిన సేవలు అందించి, ఎటువంటి మచ్చ లేని కెరీర్‌తో పదవీ విరమణ చేయడం గొప్ప విషయమని కొనియాడారు.

👉అలాగే పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ శ్రీ ఏ వి ఆర్ పి బి ప్రసాద్ గారు,ఏఆర్ డీఎస్పీ శ్రీ సుబ్బరాజు గారు, ఏఆర్ ఆర్‌ఐ శ్రీ బ్రహ్మానందం గారు, ఎస్ బి సి ఐ శ్రీ పుల్లారావు గారు, జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు , మరియు రిటైర్మెంట్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం.తేది: 30.05.2026.గంజాయి/డ్రగ్స్ తీసుకుంటే క్షణ...
30/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేది: 30.05.2026.
గంజాయి/డ్రగ్స్ తీసుకుంటే క్షణాల్లో దొరికిపోతారు.. సరికొత్త డిటెక్షన్ కిట్లతో పోలీసుల తనిఖీలు
ముఖ్యాంశాలు:
⏩ జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్.పీ శ్రీ రాహుల్ మీనా ఐ.పీ.ఎస్ గారి నేతృత్వంలో పోలీసుల ఉక్కుపాదం.
⏩ అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విస్తృత సోదాలు 11 మందికి పాజిటివ్
⏩ అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా పరీక్షలు. నిందితులపై చట్టపరమైన చర్యలు, డీ-అడిక్షన్ సెంటర్లకు తరలింపు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాను గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్.పీ శ్రీ రాహుల్ మీనా ఐ.పీ.ఎస్ గారి ఆదేశాల మేరకు, మత్తుపదార్థాలు సేవించే వారిని, సరఫరా చేసే వారిని నిమిషాల వ్యవధిలో గుర్తించే అత్యాధునిక సాంకేతికతను జిల్లా పోలీసులు రంగంలోకి దించారు.
👉ఇందులో భాగంగా ఈరోజు అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నతాధికారుల విస్తృత తనిఖీలు అమలాపురం లో నిర్వహించారు.
అమలాపురం డీఎస్పీ శ్రీ టీ.ఎస్.ఆర్.కె ప్రసాద్ గారు, ఏఆర్ డీఎస్పీ శ్రీ సుబ్బరాజుగారు, అమలాపురం పట్టణ సీఐ శ్రీ వీరబాబు గారు, అమలాపురం రూరల్ సీఐ శ్రీ ప్రశాంత్ గారు, ముమ్మిడివరం సి.ఐ శ్రీ మోహన్ గారు, ఎస్బీ సీఐ శ్రీ పుల్లారావు గారు పర్యవేక్షణలో.. అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.
తనిఖీలు - ఫలితాలు:
👉ఈ తనిఖీల్లో భాగంగా పలువురు అనుమానిత వ్యక్తులను నిలిపి, వారికి అత్యాధునిక "గంజాయి/డ్రగ్ డిటెక్షన్ కిట్స్ (బయో చెక్ కిట్స్)" ద్వారా పరీక్షలు నిర్వహించారు.
👉 అనుమానితుల నుండి సేకరించిన నమూనాలను ఈ కిట్ ద్వారా పరీక్షించగా కేవలం రెండు నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడయ్యాయి.
👉ఈ రోజు జరిపిన అకస్మాత్తు తనిఖీల్లో పరీక్షలు నిర్వహించగా, మొత్తం 11 మందికి మత్తు పదార్థాలు సేవించినట్లు "పాజిటివ్" గా నిర్ధారణ అయ్యింది. మత్తుకు బానిసలైన సదరు 11 మంది వ్యక్తుల్లో మార్పు తీసుకువచ్చేందుకు వారిని తక్షణమే "డీ-అడిక్షన్ సెంటర్ (వ్యసన విముక్తి కేంద్రం)" లో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా, వారిపై చట్టప్రకారం తీసుకోవలసిన కఠినమైన న్యాయపరమైన చర్యలను కూడా పోలీస్ శాఖ చేపడుతుంది.
జిల్లా ఎస్.పీ శ్రీ రాహుల్ మీనా ఐ.పీ.ఎస్ గారి హెచ్చరిక:
"జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల మూలాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా మేము ప్రత్యేక కార్యాచరణను చేపట్టాము. ఇకపై గంజాయి లేదా డ్రగ్స్ సేవించి తప్పించుకుందామనుకుంటే కుదరదు. ఈ అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా అనుమానితుల మూత్ర లేదా లాలాజల నమూనాలను పరీక్షించి, కేవలం రెండు నిమిషాల్లోనే వారు గంజాయితో పాటు 11 రకాల ఇతర మత్తు పదార్థాలు ఏవైనా తీసుకున్నారా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.
యువత, విద్యార్థుల భవిష్యత్తును పాడుచేస్తున్న ఇటువంటి సామాజిక రుగ్మతలపై మా ఉక్కుపాదం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా నిరంతరం ఈ నిఘా మరియు తనిఖీలు ఉంటాయి. ఎవరైనా మత్తుపదార్థాల విక్రయాలు జరిపినా, రవాణా చేసినా లేదా సేవించినా వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే మత్తుకు బానిసలైన వారిని గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తాం." అని జిల్లా ఎస్పీ గారు చెప్పినారు.
ఈ అత్యాధునిక పరికరాల వాడకంతో నిందితులను సులభంగా పట్టుకునే అవకాశం కలిగిందని, రానున్న రోజుల్లో తనిఖీలను జిల్లా వ్యాప్తంగా మరింత ముమ్మరం చేస్తామని SP గారు చెప్పినారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 29.05.2026*నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి...
29/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 29.05.2026
*నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ ను అభినందించిన -ఎస్పీ రాహుల్ మీనా ఐపిఎస్.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే రాష్ట్రం నందు అడిషనల్ ఎస్పీలు గా విధులు నిర్వహిస్తున్న వారికి నాన్ కేడర్ ఎస్పీలు గా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారి చేయడం జరిగింది. ఈ పదోన్నతులలో బాగంగా
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదనపు ఎస్పీ (అడ్మిన్)గా విధులు నిర్వహిస్తున్న ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ గారికి నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారు అడిషనల్ SP ప్రసాద్‌ గారికి స్టార్‌ను ధరింపజేసి అభినందనలు తెలిపారు.
పోలీస్ శాఖలో ఆయన అందించిన సేవలను కొనియాడిన ఎస్పీ రాహుల్ మీనా ఐపిఎస్, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదోన్నతి పొందిన ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ కు జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది కలిసి మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేది: 29.05.2026పోలీస్ సిబ్బంది సంక్షేమమే మా ప్రాధ...
29/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేది: 29.05.2026
పోలీస్ సిబ్బంది సంక్షేమమే మా ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ,ఐపీఎస్.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు ప్రత్యేకంగా 'SP-Sampark' కార్యక్రమాన్ని నిర్వహించారు.
👉జిల్లాలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలను మద్యాహ్నం 1.00 గంటల నుండి మద్యాహ్నం 3.00 గంటల వరకు ఫోన్ ద్వారా ఎస్పి గారికి విన్నవించుకున్నారు.
ప్రధానాంశాలు:
👉 సిబ్బంది తమ బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు మరియు ఇతర సర్వీసు పరమైన ఇబ్బందులను ఫోన్ ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకున్నారు.
👉సానుకూల స్పందన: ప్రతి ఒక్కరి సమస్యను సావధానంగా విన్న ఎస్పీ గారు, వాటిని పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
👉సిబ్బంది క్షేమం: విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేలా, సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.
"పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమం మరియు భద్రత మా మొదటి ప్రాధాన్యత. సిబ్బంది మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరు. అందుకే వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాము."
— రాహుల్ మీనా ఐపీఎస్, జిల్లా ఎస్పీ
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు...

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురంతేదీ: 28 మే, 2026.ద్రాక్షారామ టు రామచంద్రపురం ర...
28/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం
తేదీ: 28 మే, 2026.
ద్రాక్షారామ టు రామచంద్రపురం రోడ్డు భారీ చెట్లు గాలికి పడిపోవడం తొ తక్షణమే Si ద్రాక్షారామ మరియు వారి సిబ్బంది తో పడిపోయిన చెట్లు తోలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురంతేదీ: 28 మే, 2026.ఘనంగా స్వర్గీయ నందమూరి తారక ర...
28/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం
తేదీ: 28 మే, 2026.
ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్‌టీఆర్) గారి జయంతి వేడుకలు నిర్వహణ
ప్రజానాయకుడు, సామాజిక సంక్షేమ సంస్కర్తగా ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ:
👉 తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేతగా ఎన్‌టీఆర్ గారిని కొనియాడారు.
👉 సినీ రంగంలో తన అసామాన్య నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఎన్‌టీఆర్ గారు, రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో విశేష ఆదరణ పొందుతూ ప్రజానాయకుడిగా చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు.
👉 పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
👉 తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎన్‌టీఆర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
👉 ప్రజా సేవలో నిజాయితీ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు.
👉 యువత సమాజ సేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగాలని, మహానేతల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
పాల్గొన్న అధికారులు:
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ సుబ్బరాజు గారు, సీఐలు శ్రీ పుల్లారావు గారు, శ్రీ తమ్మినాయుడు గారు, ఆర్ఐ శ్రీ బ్రహ్మానందం గారు మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ ఎన్‌టీఆర్ గారికి నివాళులర్పించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం. తేదీ:26-05-2026సైబర్ నేరాలు – మత్తు పదార్థాలు...
26/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ:26-05-2026
సైబర్ నేరాలు – మత్తు పదార్థాలు నిర్మూలన - మహిళ భద్రతపై అవగాహన సదస్సు
అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బి.వి.సి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో సైబర్ నేరాలు మత్తు పదార్థాలు నిర్మూలన మరియు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలేజ్ యువతలకు జరిగే ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఫేక్ కాల్స్, OTP మోసాలు, QR కోడ్ స్కామ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలు
👉 అపరిచిత వ్యక్తులతో బ్యాంక్ వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు.
👉 సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, మోర్ఫింగ్ ఫోటోలు, బ్లాక్ మెయిలింగ్ వంటి నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
👉 మొబైల్ ఫోన్లలో బలమైన పాస్‌వర్డ్లు మరియు Two-Factor Authentication వినియోగించాలని సూచించారు.
👉 సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
👉 “Think Before You Click – Secure Today, Safe Tomorrow” అనే నినాదంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాలు నిర్మూలన
👉జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల మూలాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గంజాయి లేదా డ్రగ్స్ సేవించే వారు ను అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా అనుమానితుల మూత్ర లేదా లాలాజల నమూనాలను పరీక్షించి గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు ఏవైనా తీసుకున్నారా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించి,
అలాగే మత్తుకు బానిసలైన వారిని గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా,కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు
ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు.
👉 ఎవరైనా మత్తుపదార్థాల విక్రయాలు జరిపినా, రవాణా చేసినా లేదా సేవించినా వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
👉విద్యార్థులు ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ వారు మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయాలని కోరినారు
మహిళల భద్రత
👉 మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న శక్తి యాప్ ను ప్రతి మహిళ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పించారు.
👉 అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్‌లోని SOS సదుపాయం ద్వారా వెంటనే పోలీస్ సహాయం పొందవచ్చని వివరించారు.
👉 మహిళల భద్రత కోసం 181 హెల్ప్‌లైన్ మరియు అత్యవసర సేవల కోసం 112 ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సైబర్ భద్రత మరియు మహిళల రక్షణపై అవగాహన పొందారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం డి.ఎస్.పి గారు మరియు ఎస్బిసిఐ పుల్లారావు గారు, అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ గారు మరియు అమలాపురం ఎస్సై గారు మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు

ది: 25.05.2026జిల్లా పోలీసు కార్యాలయం,Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం.జిల్లా పోలీసు "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ...
25/05/2026

ది: 25.05.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం.

జిల్లా పోలీసు "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ"(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్స ల్‌ సిస్టం) కార్యక్రమానికి 35ఫిర్యాదులు.
సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఎస్పి గారు ఆదేశాలు జారీ చేశారు.
“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” పిర్యాదులపై తీసుకున్న చర్యలపై నిర్ణీత సమయంలో నివేదికను అందించాలని అధికారులకు సూచించిన జిల్లా ఎస్పి గారు.
నేటి పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 35 ఫిర్యాదులు రాగా (మహిళలు – 17 మరియు పురుషులు-18 ) వాటిలో సివిల్ వివాదాలు-15 , ఫ్యామిలీకి సంబందించి -11 మరియు ఇతర సమస్యలు సంబందించి-09 ఫిర్యాదులు అందినాయి. మరియు అందులో అమలాపురం సబ్ డివిజన్- 16 ఫిర్యాదులు, కొత్తపేట సబ్ డివిజన్-18 మరియు రామచంద్రాపురం సబ్ డివిజన్-01 గా ఉన్నాయి.
👉ప్రజలకు భరోసా:
పోలీసు వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉండాలని, ప్రతి ఫిర్యాదును అత్యంత పారదర్శకంగా, జాప్యం లేకుండా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎస్.పి. గారు బాధితులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి. గారితో పాటు డి.పి.ఓ. సిబ్బంది మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 25.05.2026హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో ...
25/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.

తేదీ: 25.05.2026

హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో పాల్గొన్న బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ - జిల్లా పోలీసులు

గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీసులు హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇందులో భాగంగా బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ K M ఆగ్రాహారం SRCM Heartfulness Meditation Centre లో ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, రామచంద్ర మిషన్ ప్రతినిధులు శ్రీ A. రాజ శేఖర్ ,M బాలకృష్ణ గార్ల పర్యవేక్షణలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యాన సాధన చేశారు.

కార్యక్రమంలో భాగంగా హృదయ ఆరోగ్య పరిరక్షణ, క్రమబద్ధమైన వ్యాయామం, యోగా, ధ్యానం, సమతుల్య ఆహారం, మానసిక ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై నిపుణులు సూచనలు అందించారు.

👉పోలీసు సిబ్బందికి మానసిక ప్రశాంతత, విధి నిర్వహణలో ఏకాగ్రత, ఒత్తిడి నియంత్రణ మరియు ఆరోగ్య పరిరక్షణపై ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.

👉పోలీసు ఉద్యోగంలో మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఎస్పీ గారు, ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం మరియు యోగా వంటి కార్యక్రమాలకు కేటాయించడం ద్వారా వ్యక్తిగత జీవితం మరియు విధి నిర్వహణలో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ అమలాపురం గారు ఏఆర్ డీఎస్పీ గారు, ఆర్ ఐ, ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది ,
కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో కొత్తపేట మరియు రాజోలు ప్రాంతాలలో కొత్తపేట డి.ఎస్.పి సుంకర మురళీమోహన్ గారు రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రావులపాలెం ఇన్స్పెక్టర్ గారు వివిధ స్టేషన్ ఎస్ఐలు మరియు వారి సిబ్బంది అదేవిధంగా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సర్కిల్ ఎస్సైలు మరియు వారి సిబ్బంది సిబ్బందితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 23.05.2026.విద్యార్థుల భద్రతే మా ప్రథమ క...
23/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 23.05.2026.
విద్యార్థుల భద్రతే మా ప్రథమ కర్తవ్యం - జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూలు మరియు కాలేజ్ యాజమాన్యాలతో విద్యార్థుల భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రధాన - అంశములు
👉అన్ని విద్యాసంస్థల రవాణా వాహనాలు సంబంధిత అధికారులచే సక్రమంగా ధృవీకరించబడిన చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్లను కలిగి ఉండాలి.
👉రవాణా వాహనాల్లో ప్రయాణించే విద్యార్థులందరూ సరిగ్గా కూర్చోవాలి. అదనపు విద్యార్థులను నిలబడి ప్రయాణించడానికి అనుమతించరాదు.
👉రహదారి పక్కన మరియు ఇతర ప్రదేశాలలో విద్యార్థులను ఎక్కించుకునేటప్పుడు మరియు దించేటప్పుడు సహాయం చేయడానికి, సంస్థలు వాహనంలో ఒక సహాయకుడు/అటెండెంట్ ఉండేలా చూసుకోవాలి.
👉ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా విద్యార్థులను ఎక్కించుకోవడం మరియు దించడం వంటి కార్యకలాపాలు జరిగేలా సంస్థలు నిర్ధారించుకోవాలి. వాహనాలు రహదారి పక్కన సురక్షితమైన పద్ధతిలో మాత్రమే ఆగాలి.
👉వాహనం దగ్గర దాటేటప్పుడు పిల్లలను రక్షించడానికి, అన్ని వాహనాలకు సరైన ఫ్రంట్-వ్యూ మరియు సైడ్-వ్యూ అద్దాలు అమర్చబడి ఉన్నాయని యాజమాన్యాలు నిర్ధారించుకోవాలి.
👉ప్రయాణ సమయంలో పిల్లల భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి, సాధ్యమైన చోట, తల్లిదండ్రులను/సంరక్షకులను వాహనాల్లో ప్రయాణించడానికి యాజమాన్యాలు అనుమతించవచ్చు.
👉శారీరక విద్య విభాగం సిబ్బంది బాలికా విద్యార్థులతో వ్యవహరించేటప్పుడు సరైన ప్రవర్తన మరియు మంచి నడవడికను పాటించాలి.
👉సంస్థ నుండి పిల్లలను పంపేటప్పుడు, యాజమాన్యాలు వారిని తల్లిదండ్రులకు/సంరక్షకులకు సక్రమంగా అప్పగించేలా చూడాలి.
👉ముఖ్యంగా బ్లాక్ బ్రిడ్జ్ మరియు రెడ్ బ్రిడ్జ్ ప్రాంతాల సమీపంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, పాఠశాల బస్సులు వేర్వేరు సమయాల్లో, సరైన సమయాల్లో నడవాలి.
👉పాఠశాల/కళాశాల బస్సుల డ్రైవర్లందరికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని యాజమాన్యం నిర్ధారించుకోవాలి. అలాగే, డ్రైవర్లు తమ ఇష్టానుసారం ప్రవర్తించకుండా, విద్యార్థులు లేదా ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా బస్సు నడపకుండా చూడాలి.
👉విద్యార్థులు కిటికీల నుండి చేతులు లేదా తలలు బయట పెట్టే అవకాశం ఉన్నందున, వారిని సురక్షితంగా ఉంచడానికి డ్రైవర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
👉విద్యార్థులు ప్రయాణించే అన్ని బస్సు లోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తగిన డేటా స్టోరేజ్ ను ఏర్పాటు చేసుకుని తగిన నిఘాను ఏర్పాటు చేసుకోవాలి.
👉పోలీస్ తీసుకునే చర్యలలో భాగంగా స్కూల్ మరియు కాలేజీ విడిచిపెట్టే సమయాలలో అల్లరి మూకలు ఈవ్ టీజింగ్ , రేస్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ SP, SDPO అమలాపురం, ఇన్స్పెక్టర్ అమలాపురం వారు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Address

Amalapuram
533201

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr B R Ambedkar Konaseema District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share