19/08/2024
గిరిజన గురుకుల బాలికల పాఠశాల తరలింపు ఆదేశాలు అధికారులు వెనక్కి తీసుకొని ఆలూరులో కొనసాగించాలి.గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు స్థలం కేటాయించి భవనాలు నిర్మించాలని.
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కు మండల ఉపాధ్యక్షుడు గోవర్ధన్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మైన, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గిరిముర్తి మాట్లాడుతూ ఆలూరు మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన ప్రజల యొక్క పిల్లల సంక్షేమం కోసం గిరిజన విద్యార్థులకు విద్యను అందించడం ద్వారా వారిని అభివృద్ధి చేయడానికి మరియు వారికి విలువలు మరియు సమాజంలో వారి ప్రాముఖ్యతను పెంచడానికి ఏర్పాటు చేశారు. 2016లో మండల కేంద్రంలో ఉన్న బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలోని మరో భవనంలోని కొన్ని గదులలో బాలికల గిరిజన గురుకుల పాఠశాలకు సొంత స్థలం భవనం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం నెరణిక తాండ, అరికెర తండా, కొత్తపేట గ్రామాల మరియు ఇతర గ్రామల విద్యార్థులు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు 297 మంది విద్యనభ్యసిస్తున్నారు. మంచి ఉత్తీర్ణత సాధించడంతో త్రిబుల్ ఐటీ సీట్లు కూడా పొందారు. ఏసియా వరల్డ్ బుక్ ఆఫ్ 32 రికార్డులు సాధించారు. మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు అయితే ప్రస్తుతం బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు బాలికల గిరిజన గురుకుల పాఠశాల ఈ రెండు పాఠశాలలు ఒకే కాంపౌండ్ లో ఉండడం కారణంతో సమస్యగా మారిందని. బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో వేరే ప్రాంతానికి మార్చాలని. ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఆదేశాలను ఇవ్వడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అన్నారు. పాఠశాలను వేరే చోటికి మార్చకూడదు అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.వేంటనే పాఠశాల తరలింపు ఆదేశాలు అధికారులు వెనక్కి తీసుకొని ఆలూరులో కొనసాగించాలి గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు స్థలం కేటాయించి భవనాలు నిర్మించాలి అన్నారు.అనంతరం మండల తహశీల్దార్ గోవింద్ సింగ్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్య కమిటీ చైర్మన్ శంకర్ నాయక్,వైస్ చైర్మన్ లెక్కె నాయక్ తల్లిదండ్రులు అమరేష్ నాయక్,రాజేష్ నాయక్,ఎస్ఎఫ్ఐనాయకులు,తదితరలు