23/11/2021
రోజా కు, నాటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు అక్రమ సంబంధం అంట కట్టాలని నంద్యాల ఉప ఎన్నికలప్పుడు మంత్రులు MLA ల వీడియో కాన్ఫరెన్స్ లో బాబు చెప్పాడు
ఇది నిజం కాదంటే మనవడు దేవాన్ష్‌పై బాబు ప్రమాణం చేసి చెప్పాలి
దీనిపై నార్కో ఎనాలసిస్ పరీక్షలు, లై డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధం కావాలని సవాల్
-టీడీపీ MLA ఆమంచి కృష్ణ మోహన్ , ఏప్రిల్ 7 , 2019
అధికారం కోసం ఎంతటి నీచస్థాయికైనా సీఎం చంద్రబాబు దిగజారుతారు. ఇది నేను స్వయంగా చూశాను. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో గెలుపుకోసం సీఎం నీచస్థాయికి దిగారు.
ఆ సమయంలో ఆనటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీయడానికి నీచానికి దిగారు.
అక్కడ ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రోజాతో భన్వర్‌లాల్‌కు అక్రమసంబంధం అంటగట్టాలని, ఆ మేరకు ప్రచారం చేయాలని నాడు ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా వ్యవహరించిన నాతో పోటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు.
ఈ మేరకు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లనే ఆదేశించిన నీచుడు చంద్రబాబు’ అని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచల వ్యాఖ్యలు చేశాడు.
ఇది నిజం కాదంటే నార్కో పరీక్షలకైనా సిద్ధం కావాలన్నాడు. లేదంటే చంద్రబాబు తన మనమడు దేవాన్ష్‌పై ప్రమాణం చేసి చెప్పాలని ఆయన సవాలు విసిరాడు.
నంద్యాలలో గెలుపుకోసం నీచ స్థాయికి దిగారు..
నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుకోసం చంద్రబాబు నీచస్థాయికి దిగారని ఆమంచి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా 55 మందిని ఇన్‌చార్జిలుగా నియమించారని, అందులో 5గురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేల్లో తాను కూడా ఉన్నానని వివరించారు.
ఈ క్రమంలో రోజూ వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం తమతో మాట్లాడేవారన్నారు. నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఉప ఎన్నికలో టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కోపంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీసేందుకు ఏకంగా భన్వర్‌లాల్‌కు రోజాతో అక్రమ సంబంధం అంటగట్టాలని,
ఆ మేరకు నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారం చేయాలని స్వయంగా తమను ఆదేశించారని తెలిపారు.
ఆ సమయంలో తనతో పాటు మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి సహా ఐదుగురు మంత్రులు , 25 మంది ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారన్నారు.
అయితే అలాంటి ప్రచారం చేసేందుకు తాము అంగీకరించలేదని తెలిపారు. దీన్ని బట్టి చంద్రబాబు ఎంత నీచ రాజకీయాలకు పాల్పడుతారో ప్రజలు తెలుసుకోవలన్నారు. ఇది నిజం కాదంటే చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు...
అద్దంకి సుధీర్ వైస్సార్సీపీ... 💚❤💙