13/09/2019
గన్నవరం మండలం అల్లాపురం గ్రామానికి చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు దెబ్బల వెంకటరత్నం గారు మృతిచెందగా శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వెంకటరత్నం వంటి నాయకుడ్ని కోల్పోవడం దురదృష్టకరమని తెలుపుతూ పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తదుపరి వెంకటరత్నం అంతిమయాత్రలో ఆయన పాల్గొని కొంతసేపు పాడెను మోశారు. జిల్లాపార్టీ అధికార ప్రతినిధి అనగాని రవి, వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.