Genuine Politics

Genuine Politics &TS politics

04/04/2026

📘 Learn Chemistry the Smart Way!

Struggling with concepts, formulas, or problem-solving?
This channel helps you master Chemistry with easy tricks, PYQs, and exam-focused strategies.

🎯 Perfect for JEE & NEET aspirants
💡 Simple explanations + smart shortcuts

👉 Watch now: https://youtube.com/?si=V6rrx-ub9WasyXx1

🔔 Don’t forget to Subscribe for daily Chemistry tricks & exam tips!

చార్జీ 11 రూపాయలే మావి గన్ కు రవాణా ప్రారంభం
01/04/2026

చార్జీ 11 రూపాయలే
మావి గన్ కు రవాణా ప్రారంభం

07/03/2026

వర్క్ బిజీ వల్ల ఈ పేజి వేరే వాళ్ళకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా?
Around 25000 followers

11/02/2026

జీతం కోసం సంతకం పెట్టారు... వెంటనే వెళ్ళిపోయారు

అమరావతిలో ఏఐ యూనివర్సిటీరాజధాని అమరావ తిలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలువుదీరబోతోంది. కృత్రిమ మేధ(ఏఐ) యూనివర్సిట...
09/02/2026

అమరావతిలో ఏఐ యూనివర్సిటీ

రాజధాని అమరావ తిలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలువుదీరబోతోంది. కృత్రిమ మేధ(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా కంపెనీల చట్టం 2013 సెక్షన్-8 కింద 'లాభాపేక్ష లేని' కంపెనీగా జీవోలో పేర్కొన్నారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో రాజధానిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ సంస్థ ఎన్విడియా (ఎన్బీఐడీఐఏ) కార్పొరేషన్తో ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ను జారీచేసింది. ఈనెల 19 నుంచి వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభిస్తుం దని సమాచారం. ఈ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం అమరావ తిలో ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని జీవోలో పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, ఫిన్టిక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఏఐ వినియోగ మార్గాలను రూపొందించి అమలు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ధోని హెలికాప్టర్ షాట్ కొట్టినట్టు..శివమణి డ్రంస్ కొట్టినట్టు..జాకిర్ హుస్సేన్ తబలా కొట్టినట్టుతమన్ బ్యాక్  గ్రౌండ్ మ్యూజ...
09/02/2026

ధోని హెలికాప్టర్ షాట్ కొట్టినట్టు..
శివమణి డ్రంస్ కొట్టినట్టు..
జాకిర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు
తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినట్టు..
అబ్బా...అబ్బా..ఏమి కొట్టుడు..ఏమి కొట్టుడు..
కార్తిక్ లేత పేటియం ని అర్ణబ్ కొట్టుడే..కొట్టుడు

ఈ క్రింద చిత్రం చూస్తే మీకు ఎం అర్దం అయిందో కామెంట్ చేయండి
08/02/2026

ఈ క్రింద చిత్రం చూస్తే మీకు ఎం అర్దం అయిందో కామెంట్ చేయండి

ఇది కదా మార్పు అంటే
08/02/2026

ఇది కదా మార్పు అంటే

*⚠️ జాగ్రత్త  మన భద్రత మన చేతుల్లోనే ⚠️**📈 బంగారం ధర బాగా పెరిగింది**👉 ధర పెరిగిన కొద్దీ ప్రమాదాల అవకాశాలు కూడా పెరిగాయి...
04/02/2026

*⚠️ జాగ్రత్త మన భద్రత మన చేతుల్లోనే ⚠️*

*📈 బంగారం ధర బాగా పెరిగింది*

*👉 ధర పెరిగిన కొద్దీ ప్రమాదాల అవకాశాలు కూడా పెరిగాయి*

ముఖ్యంగా👶 పిల్లలు

👉 పిల్లల చెవులకు, ముక్కుకు బంగారం వద్దు
👉 పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దు

*👩‍🦰 మహిళలు*
👉 ఒంటరిగా ఉన్నప్పుడు భారీ బంగారు ఆభరణాలు ధరించవద్దు
👉 నిర్మానుష్య ప్రాంతాలనుండి రావడం వెళ్ళడం తగ్గించండి.
👉 రాత్రిళ్లు బైక్ మీద బంగారం ధరించి శుభకార్యాలకు / ఇతర కార్యక్రమాలకు వెళ్లడం–రావడం వద్దు
👉 తప్పనిసరిగా బైక్ మీద వెళ్లాల్సి వస్తే బంగారు ఆభరణాలు అసలు ధరించవద్దు

🚗 కార్‌లో ప్రయాణించే సమయంలో
👉 అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వవద్దు
👉 ప్రయాణం సాధ్యమైనంతవరకు హైవేలు, రద్దీ రోడ్ల మీదే సాగేలా చూసుకోండి
👉 నిర్మానుష్య ప్రాంతాల్లో ఆగవద్దు
👉 రాత్రివేళల్లో అనవసరంగా కార్ ఆపి మాట్లాడవద్దు

*🏠 ఒంటరి ఆడవారు ఉండే గృహాలు – ప్రత్యేక జాగ్రత్తలు*
👉 గేట్‌లు, తలుపులకు ఎప్పుడూ తాళం వేసి ఉంచండి
👉 ఆర్డర్ డెలివరీని గేట్ లోపలికి అనుమతించకుండా బయటే తీసుకోండి
👉 అపరిచితులతో ఎక్కువ మాటలు పెట్టవద్దు
👉 “ఇంట్లో ఒంటరిగా ఉన్నాను” అనే సమాచారం ఎవరికీ చెప్పవద్దు

*🏠 ఇంటి భద్రత (అందరికీ)*
👉 ఇంట్లో బంగారం ఉంచకండి
👉 తప్పనిసరిగా బ్యాంక్ లాకర్‌లో పెట్టండి
👉 కాలింగ్ బెల్ కొట్టినా గుర్తింపు లేకుండా తలుపు తీయవద్దు

*🏢 అపార్ట్‌మెంట్ / కాలనీ / పరిసరాలు*
👉 అపార్ట్‌మెంట్ గేట్ ఎప్పుడూ ఓపెన్‌గా ఉంచవద్దు
👉 అపరిచితులు తిరుగుతుంటే వెంటనే గ్రూప్‌లో తెలియజేయండి
👉 సెక్యూరిటీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయండి

*💰 ఆభరణాల విషయంలో*
👉 బంగారు, వెండి ఆభరణాలు ధరించడం తగ్గించండి
👉 వీలైనంతవరకు ఇమిటేషన్ / డిజైనరీ ఆభరణాలు వాడండి
👉 భారీ బంగారం బదులు 1 గ్రాము గోల్డ్ / 6క్యారెట్ గోల్డ్/8క్యారెట్ గోల్డ్ సరిపోతుంది

*🚨 వాస్తవ పరిస్థితి*
👉 ప్రమాదాలు చెప్పి రావు
👉 ఈ ఒక్క నెలలోనే చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయి
👉 ప్రధాన కారణం – బంగారం ధర పెరగడం

*📞 అత్యవసరంలో*
👉 అనుమానం వస్తే వెంటనే 100/112 కి కాల్ చేయండి

*👉 ఆడంబరం ప్రమాదం… జాగ్రత్తే నిజమైన భద్రత*

👉 ఈ మెసేజ్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి.

04/02/2026

నోరు ఉంది కదా అని అంబటి ఆంబోతు లాగా రెంకలేస్తే ఎవరు ఊరుకోరు ఇక్కడ! ఇంకోసారి నీ నోటికి పని చెప్పితే మా కార్యకర్తలు వాళ్ళ చేతులకు పని చెబుతారు జాగ్రత్త!

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ లో  పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ...
24/11/2024

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను,

పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం.

పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది.

పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, గొందూరు పోచమ్మ గండి సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.

సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.
చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది.

తూర్పుగోదావరి జిల్లా లోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహారాష్టల్రోని నాసిక్‌ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు

ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని రెండు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్నుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి. పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది.

ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవతామూర్తులను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతె్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.

చుట్టూ ఎత్తయిన కొండలు .. చిక్కని అడవులు... మధ్యలో గోదారమ్మ ఒడిలో మెలికలు తిరుగుతూ జల విహారం చేస్తే... 'చూసే కనులకు మనసుంటే ... ఎటు చూసిన అందమే... ' అన్న పాట గుర్తుకొస్తుంది.పాపి కొండల మధ్య నుంచి లాంచిల్లో ప్రయాణం ఓ అద్భుత అనుభూతి. ఉదయం వెళ్తే సాయంత్రానికి రాజమహేంద్రవరం నగరానికి చేరుకోవచ్చు.

వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.

మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం.

ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు.

ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది.

ఎత్తయిన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు.

పాపి కొండలకు రైల్వే స్టేషన్ లేదు;

సమీప రైల్వే స్టేషన్ రాజమండ్రి స్టేషన్, ఇది ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటి. దేశం యొక్క వివిధ ప్రాంతాలలో అనేక రైళ్ళు ఉన్నాయి. ఇది విజయవాడ నుండి 150 కిలోమీటర్లు మరియు విశాఖపట్నం నుండి 220 కిలోమీటర్లు.

మీరు ఖమ్మం జిల్లా నుండి ప్రయాణిస్తుంటే, మీరు బస్ లేదా బస్సులను కోట చేరుకోవచ్చు. తూర్పు గోదావరి
జిల్లా నుండి రాజమండ్రి కి టాక్సీలో చేరవచ్చు. తూర్పు గోదావరి నుండి పాపి కొండల శ్రేణికి 35 కిలోమీటర్ల రహదారి ఉంది.ఎంతో మందికి ఎన్నో తీపి జ్ఞాపకాలు అందించిన పాపికొండల ప్రయాణం కొంత మందికి మర్చి పోలేని చేదు అనుభవాన్ని కూడా మిగిల్చింది.

వైఎస్ జగన్, వైఎస్  షర్మిల ఆస్తుల గొడవ గురించి మొదటి సారి స్పందించిన వైఎస్ విజయమ్మ.. నా కుటుంబానికి దిష్టి తగిలండంటూ ఎమోష...
29/10/2024

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల గొడవ గురించి మొదటి సారి స్పందించిన వైఎస్ విజయమ్మ..

నా కుటుంబానికి దిష్టి తగిలండంటూ ఎమోషనల్ బహిరంగ లేఖ ..

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Genuine Politics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share