ITDP Bobbili

ITDP Bobbili jai TDP

16/03/2026
నిన్న ఉండవెల్లి నారా లోకేష్ గారి నివాసంలో బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారు ఆయనకు ఎంతో ఇష్టమైన. ఆయన స్వయంగా తీసిన ప...
24/02/2026

నిన్న ఉండవెల్లి నారా లోకేష్ గారి నివాసంలో బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారు ఆయనకు ఎంతో ఇష్టమైన. ఆయన స్వయంగా తీసిన పులి చిత్రాలను. కలిసిన సందర్భంగా నారా లోకేష్ గారికి గిఫ్ట్ ఇవ్వటం జరిగింది..🙏✌️

ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాయన గారు. అసెంబ్లీలో మా బొబ్బిలి సింహం తో బేబీ నాయన గారు క్యాలెండర్ బాలయ్య బాబు గారి...
12/02/2026

ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాయన గారు. అసెంబ్లీలో మా బొబ్బిలి సింహం తో బేబీ నాయన గారు క్యాలెండర్ బాలయ్య బాబు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది...✌️😍

With Nara Lokesh – I just got recognized as one of their top fans! 🎉
12/02/2026

With Nara Lokesh – I just got recognized as one of their top fans! 🎉

12/02/2026

లోచెర్ల శివడవలస ఎత్తిపోతల పథకం మరియు తోటపల్లి కాలువ అభివృద్ధి గురించి నేడు అసెంబ్లీ లో మాట్లాడిన గౌరవ బొబ్బిలి శాసన సభ్యులు బెబీ నాయన గారు....🙏✌️👏👌

*బొబ్బిలి నియోజకవర్గం**తేదీ 09-02-2026**బొబ్బిలి మండలంలో ఉన్న కృపావలస, రమణవలస, దీవెనవలస గ్రామాల గిరిజనులను కలిసిన ఎమ్మెల...
09/02/2026

*బొబ్బిలి నియోజకవర్గం*
*తేదీ 09-02-2026*

*బొబ్బిలి మండలంలో ఉన్న కృపావలస, రమణవలస, దీవెనవలస గ్రామాల గిరిజనులను కలిసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు శ్రీ గిరడ అప్పలస్వామి గారు..*

*ప్రభుత్వం తరుపున మౌళిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*

బొబ్బిలి మండలంలో ఉన్న కృపావలస, రమణవలస, దీవెనవలస గ్రామాల గిరిజనులు తమకు ప్రభుత్వం వారు మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గత నెలలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినూత్నంగా అభ్యర్థించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు దృష్టిలో ఆయా గ్రామాల సమస్యలు ఉన్నప్పటికీ, వాటి పరిష్కారానికి గిరిజనులు తమవంతుగా ప్రయత్నం చేశారు.

ఈరోజు ఉదయం గౌరవ *ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన* గారు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ శ్రీ *గిరడ అప్పలస్వామి* గారుతో కలిసి ఆ గ్రామాలకు వెళ్లి, గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.. *ఎమ్మెల్యే గారు తమవెంట రెవిన్యూ అధికారులను తీసుకువెళ్లి*, వారికి ప్రభుత్వం తరపున చేయదగిన ఏర్పాట్లను గురించి చర్చించారు.. తక్షణమే ఆ ప్రాంతాన్ని సర్వే చేసి, రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టేవిధంగా చూడాలని ఆదేశించారు. గిరిజనులు అటవీ భూములను చదును చేసి వ్యవసాయం చేస్తూ, జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారికి *కొన్ని సదుపాయాలను ప్రభుత్వం తరుపున కల్పించడంలో ఉన్న సవాళ్లను పరిష్కరించే విధంగా* చూడాలని అధికారులను కోరారు.. ప్రభుత్వం ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలోగా, *తన సొంత నిధులతో సోలార్ పవర్ ద్వారా విద్యుత్ సౌకర్యం* ఏర్పాటు చేస్తానని, అలాగే *బోరు తీయించి త్రాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తానని* తెలిపారు. ICDS PO గారుతో మాట్లాడి గిరిజనుల పిల్లలకు అంగన్వాడీ తరుపున కల్పించాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

కొందరు *గిరిజనులు మక్కువ మండలం నుంచి, సాలూరు మండలం నుంచి వచ్చి స్థిరపడినందున* వారిని దగ్గరలో ఉన్న పంచాయితీలో విలీనం చేసేందుకు గల అవకాశాలను పరిశీలించమని అధికారులకు తెలిపారు.. దానివలన వారికి *రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్* వంటివి ఇవ్వడానికి వీలవుతుందని తెలియజేశారు.. ఎల్లుండు నుంచి ప్రారంభం అవుతున్న *అసెంబ్లీ సమావేశాలలో ఈ సమస్యను గురించి ప్రభుత్వం దృష్టికి* తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తానని తెలిపారు.. జనసేన ఇంచార్జ్ శ్రీ *గిరడ అప్పలస్వామి గారు సహకారంతో* ఆ గ్రామాల గిరిజనులకు అన్ని సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.. *తాను మరియు అప్పలస్వామి గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని*, వారికి ఎప్పడు ఎలాంటి సహాయం కావాలన్నా తమకు తెలియజేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బొబ్బిలి నియోజకవర్గ జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

08/02/2026

ఎల్వీ సుబ్రమణ్యం గారు, మాజీ టీటీడీ ఈఓ, మాజీ సీఎస్ స్పందిస్తూ "​శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ కావడం అత్యంత దురదృష్టకరమని" ఆవేదన వ్యక్తం చేశారు. ​జరిగిన తప్పును మాజీ సీఎం జగన్ వెనకేసుకురావడం సరికాదని, దీనిపై పశ్చాత్తాపం లేకపోవడం విచారకరమన్నారు. తప్పు చేసిన వారు స్వామివారి క్షమాపణ కోరాలని సూచించారు. సామాన్య భక్తుడిగా ఈ అపచారాన్ని భరించలేమని, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం శ్రేయస్కరం కాదని అన్నారు.







08/02/2026

ప్రపంచంలోనే టాప్ 3 క్వాంటం హబ్స్‌లో అమరావతి ఉండాలి అనేది మా ప్రభుత్వ లక్ష్యం..





రూ17,38,713/- సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీబొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలో అండగా ఉంటూ, కొందరు పౌరుల ఆరోగ్యసమస్యలు...
06/02/2026

రూ17,38,713/- సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలో అండగా ఉంటూ, కొందరు పౌరుల ఆరోగ్యసమస్యలు మరియు వారి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా, గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి 14 మంది లబ్ధిదారులకు రూ17,38,713/- ఆర్ధిక సహాయం అందేలా కృషి చేసి, సీఎం సహాయనిధి చెక్కులను బొబ్బిలి కోటలో అందజేశాను

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకై పేద ప్రజలను ఆదుకుంటున్నారు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Bobbili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share