బండారి శేఖర్ అన్న సైన్యం

  • Home
  • బండారి శేఖర్ అన్న సైన్యం

బండారి శేఖర్ అన్న సైన్యం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from బండారి శేఖర్ అన్న సైన్యం, Political organisation, .

Dt:30/03/2026- పెండింగ్లో ఉన్న రెవిన్యూ క్లబ్, టీఎన్బీవో, ఎక్సైజ్ కాంప్లెక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ లు వాసులు చేయండి.- ⁠*లక...
30/03/2026

Dt:30/03/2026
- పెండింగ్లో ఉన్న రెవిన్యూ క్లబ్, టీఎన్బీవో, ఎక్సైజ్ కాంప్లెక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ లు వాసులు చేయండి.
- ⁠*లక్షల్లో కిరాయిలు వస్తున్న కోట్ల రూ ||లు ట్యాక్స్ లను ఎగ్గొడుతున్నారు.*
- ⁠*ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుంటే సామానన్యులకు నల్ల కనెక్షన్,. కరెంట్ తొలగిస్తారు, ప్రభుత్వ అధికారుల సంఘాల భవనాలకు ఏమి చర్యలు తీసుకోరా..?*
- ⁠*రెవిన్యూ క్లబ్, టీఎన్బీవో, ఎక్సైజ్ కాంప్లెక్స్ ల ప్రాపర్టీ ట్యాక్స్ లకు రాయితీలు ఇవ్వద్దు.*

- ⁠AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు.

ఈ రోజు ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావానిలో జిల్లా కలెక్టర్ గారికి ⁠ పెండింగ్లో ఉన్న కరీంనగర్ రెవెన్యూ క్లబ్ కాంప్లెక్స్ కోటి రూపాయలు, టీఎన్బీవో భవన్ కాంప్లెక్స్ 90 లక్షలు మరియు ఎక్సైజ్ కాంప్లెక్స్ లక్షల రూపాయలకు పైగా ఉన్న పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ లను తక్షణమే వాసులు చేయాలనీ, ప్రాపర్టీ ట్యాక్స్ రాయితీ ఇచ్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరామించికోవాలని పిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడంలో కరీంనగర్ రెవెన్యూ క్లబ్, కాంప్లెక్స్, టీఎనీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్స్ నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యాహరిస్తున్నారు విమర్శించారు. ప్రతి నెల లక్షల్లో కిరాయిలు వస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి పెద్ద ఎత్తున పైరవీలు చేసుకువడం సిగ్గు చెటని విమర్శించారు.
రెవెన్యూ క్లబ్ కాంప్లెక్స్ 35 షటర్లు, రెవిన్యూ గార్డెన్ , రెవెన్యూ రిక్రియేషన్ క్లబ్ అద్దెల రూపంలో వచ్చే ఆదాయాన్ని అసోసియేషన్ లీడర్స్ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడడం, ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ మున్సివల్ కార్పొరేషన్ కు కట్టాల్సిన ప్రాపర్టీ టాక్స్ దాదాపుగా గత 30 సంవత్సరాలుగా ఎగ్గొట్టడం జరుగుతుందని అన్నారు. రెవిన్యూ క్లబ్ కాంప్లెక్స్ , ఎక్సైజ్ నిర్వహకులు కలెక్టరెట్ ఎదురుగా ఉన్న కమర్షియల్ షటర్స్ కిరాయిలకు ఇచ్చి వారి వద్ద నెల నెలా అద్దెను 15 వేల నుండి 20వేల వరకు వసూలు చేస్తున్న రెవిన్యూ , ఎక్సైజ్ అసోసియేషన్, లీడర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను కట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
ఎక్సైజ్ కాంప్లెక్ లు మరియు రెవిన్యూ క్లబ్ షెటర్స్ అధికారులకు, వారి బినామీలకె ఒక్కరికి రెండు షెటర్స్ లు ఇవ్వడం జరుగుతుందని విమర్శించారు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ లీడర్లు కుమ్మక్కై ఇప్పటి వరకు రెవెన్యూ కాంప్లెక్స్పై కోటి రూపాయలకు పైగా, టీఎన్జవో కాంప్లెక్స్ 90 లక్షలు, ఎక్సైజ్ కాంప్లెక్స్ లక్షల రూపాయలు బకాయిలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పొవడం ఏమి మతాలబు ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రెవెన్యూ క్లబ్, కాంప్లెక్స్, టీఎనీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్స్ అధికారులు, లీడర్లు పైరవీలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి రాయితీలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఇవ్వాలని , ముక్కుపిండి ప్రాపర్టీ ట్యాక్స్ వాసులు చేయాలనీ కోరారు..
సామాన్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ కరెంట్, నల్లా కనెక్షన్ కట్ చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు రెవెన్యూ కాంప్లెక్స్, టీఎన్బీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్స్ విషయంలో మాత్రం చూసీచూనడట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో తమరే గుర్తించగలరు.

ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ కాంప్లెక్స్, టీఎన్టీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్లకు రాయితీలు ఇవ్వకూడదని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రాపర్టీ టాక్స్ చెల్లించకుండా ఎగొగ్గడుతున్న సంస్థలపై, ఆ సంస్థల అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగాడిమాండ్ చేశారు.
వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె. బద్రినేత, పార్టీ నాయకులు లచ్చయ్య ఉన్నారు.

మీ
బండారి శేఖర్
AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి
కరీంనగర్

వీరులకు ఘన నివాళులు- ⁠భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన అల్ ఇండియా ఫార్వర్డ్ బ...
23/03/2026

వీరులకు ఘన నివాళులు
- ⁠భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్.

పత్రిక ప్రకటన, కరీంనగర్ Dt:23/03/2026*వీరులకు ఘన నివాళులు*- ⁠*భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వర్ధంతి సందర్బంగా ఘనంగా న...
23/03/2026

పత్రిక ప్రకటన, కరీంనగర్
Dt:23/03/2026
*వీరులకు ఘన నివాళులు*
- ⁠*భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, బొంకురి సురేందర్ , కురువెల్లి శంకర్,. బద్రి నేత , నాయకులు రాజు, అరుణ్ నివాళులు అర్పించారు.*
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు, ల వర్ధంతి నేడు. వారి పోరాటాలను, బలిదానాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది.

మీ
బండారి శేఖర్
AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి
కరీంనగర్

- సంక్షేమ రంగాలకు కోత,వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్.- రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వలేదు.- AIFB జిల్లా ప...
22/03/2026

- సంక్షేమ రంగాలకు కోత,
వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్.
- రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వలేదు.

- AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
- ⁠
- రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు ప్రభుత్వం కోత పెట్టింది. ఇది పేదలు, దళితులు, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని, కరీంనగర్ జిల్లాకు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు. వ్యవసాయ, దళిత, గృహనిర్మాణం, నీటిపారుదల, విద్యుత్ తదితర ముఖ్యమైన రంగాలకు గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో నిధుల కోతపెట్టా రనీ, ఇది ఆందోళనకరమని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు.
రైతు భరోసా కోసం రూ. 25 వేల కోట్లు అవసరముంటే, రూ.18 వేల కోట్లు మాత్రమే ప్రతిపాదించారని తెలిపారు. మహాలక్ష్మి పథకానికి మహిళలకు రూ.2,500 ఊసే లేదని తెలిపారు. కౌలు రైతులకు మొండిచేయి చూపిందని, వ్యవసాయ కూలీలకు రూ.12వేల ప్రతిపాదనలేదని పేర్కొ. న్నారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకుపైగా ఇండ్లు లేనివారుంటే, ఈ బడ్జెట్లో కేవలం రూ.5,500 కోట్లు మాత్రమే ప్రతిపాదన చేశారని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదనీ అన్నారు. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి లెక్క ఉందని ఎద్దవ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యత కలిగిన రంగాలకు నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

మీ...................
బండారి శేఖర్
AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి
కరీంనగర్

  AIFB రాష్ట్ర అధ్యక్షులు జావేద్ లతిఫ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
13/03/2026


AIFB రాష్ట్ర అధ్యక్షులు జావేద్ లతిఫ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Dt:08/03/2026- ⁠⁠మహిళలు  హక్కుల కోసం పోరాడాలి.- ⁠సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కర...
08/03/2026

Dt:08/03/2026
- ⁠⁠మహిళలు హక్కుల కోసం పోరాడాలి.
- ⁠సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఎర్కర్స్ @ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, టియుసిసి కేంద్రకమిటీ సభ్యులు బండారి శేఖర్ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి కేక్ కట్ చేసి ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా టియుసిసి కేంద్రకమిటీ సభ్యులు బండారి శేఖర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలనీ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ద్వారా హక్కులు సంక్రమించినా సమాన పనికి సమాన వేతనం అనేది నేటికీ అందని ద్రాక్షగానే ఉందని అన్నారు. పైగా పని స్థలాల్లో లైంగిక వేధింపులు, అకృత్యాలు,అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజు బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వాలు మహిళల పట్ల ప్రకటనాలకు వాగ్దానలకే పరిమితం అవుతున్నాయని ఏద్ధవః చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు కనీసం వేతనం 26వేలు ఇవ్వాలని, ఏజిన్సిలను రద్దు చేసి నేరుగా కార్మికులను వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు పి. అరుణ్, నాయకులు శారదా, పద్మ, అరుణ, సకిన బేగం, రజియా, మమతా, సుకన్య, శ్వేతా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మీ
బండారి శేఖర్
TUCC కేంద్ర కమిటీ సభ్యులు

Dt:07/03/2026రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం.- *ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడిన రాష్ట్ర కన్వినర్ పోస్ట...
08/03/2026

Dt:07/03/2026
రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం.

- *ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడిన రాష్ట్ర కన్వినర్ పోస్టును రద్దు చేయడం జరిగింది.*

- *ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండ దయానంద్ ఎన్నిక.*

తేదీ: 07/03/2026 రోజున అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర చైర్మన్ అధ్యక్షులు ఎం. జావేద్ లతీఫ్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగంలో లేని కన్వినర్ పోస్టును రాష్ట్ర కమిటీ అనుమతి లేకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ గారు కీ|| శే ||లు బండ సురేందర్ రెడ్డి సంతాప సభలో ప్రకటించిన కన్వినర్ పోస్టును ఏకగ్రీవంగా రద్దు చేయడం జరిగింది.

ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగం ప్రకారం నూతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పార్టీ సీనియర్ నాయకులు కొండ దయానంద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర కమిటీ కీ||శే|| లు బండ సురేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో 28/09/2024 లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో 13 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

తేదీ: 07/03/2026 రోజున 8మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. 1) రాష్ట్ర ఛైర్మెన్/అధ్యక్షులు ఎం. జావేద్ లతీఫ్, 2) రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టంగూరి బుచ్చి రెడ్డి, 3) రాష్ట్ర కార్యదర్శి కొండ దయానంద్, 4) ఆర్థిక శాఖ కార్యదర్శి కె. నరేందర్, 5) రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మూర్తి, 6) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు పరంగి రాము, 7) రాష్ట్ర కమిటీ సభ్యులు సాగి అజిత్ కుమార్ రావు, 😎 కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి శేఖర్ లు పాల్గొన్నారు. మెజారిటి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎనిమిది మంది ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కొండ దయానంద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ ఐ ఎఫ్ బి (AIFB) రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడిన కన్వినర్ పోస్టును రద్దు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ రెండు తీర్మానలను ఏకగ్రీవంగా అమోదించడం జరిగింది. మిగితా (తేదీ: 28/09/2024) రోజున రాష్ట్ర మహాసభల్లో ఎన్నిక అయినా రాష్ట్ర కమిటీ యాదవిధిగా కొనసాగుతుంది.

నోట్: రాష్ట్ర కమిటీలో నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల పార్టీ ప్రధాన కార్యదర్శిలు, అధ్యక్షులు మరియు ప్రజా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు, అధ్యక్షులు రాష్ట్ర కమిటీ ఎక్స్-అఫీషియో సభ్యులు గా ఉన్నారు, ఒకరు జాతీయ కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీకి ఆహ్వానీతులుగా ఉన్నారు. విరివిగా రాష్ట్ర కమిటీలో ఏదైనా ఎన్నిక జరిగితే వీరి ఓట్లను పరిగణలోకి తీసుకోబడవు.

ఇట్లు

తెలంగాణ రాష్ట్ర కమిటీ

Dt:26/02/2026, కరీంనగర్ - నగర్ కర్నూల్ పసిపాపను చంపిన దుండగులను  కఠినంగా శిక్షించాలి.- కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహా...
26/02/2026

Dt:26/02/2026, కరీంనగర్
- నగర్ కర్నూల్ పసిపాపను చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలి.
- కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి.
- కుటుంభంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.

- ⁠ఏఐఎఫ్ బి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
-----------------------
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఒక ప్రకటన విడుదల చేస్తు మాట్లాడుతూ నగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో బీసీ చాకలి కుటుంభం పై దాడిచేసి ,రెండు నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల ఆహాకారులైన శ్రీధర్ రెడ్డీ , మద్దుసుదన్ రెడ్డీ , శ్రీకాంత్ రెడ్డీ , విష్ణు వర్ధన్ రెడ్డీ లతో పాటు నిందితులందరిపై మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాహాలని ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్స్ చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని ,కుటుంభంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం , పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేయడం చూస్తుంటే రాజ్యం ఎవ్వరి వైపు ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పసిపాప అని కనీస కనికరం లేకుండా కాలితో తన్ని హత్యచేసిన నిందులను వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్స్ చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయంపాయి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్స్ చేశారు. సర్పంచ్ కాంగ్రెస్ వారు కావడమే అరెస్టు వెనుకాల జాప్యమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్.ఎస్.టి .బీసీ ల ప్రాణాలకు విలువలేదా అని ప్రశ్నించారు . పసిపాపను చంపినా నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలనీ , బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని, కుటుంభంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, కేసులో నిర్లక్ష్యం గా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో బండారి శేఖర్ డిమాండ్ చేశారు .

మీ ...............
బండారి శేఖర్
AIFB ప్రధాన కార్యదర్శి
కరీంనగర్ జిల్లా

12/02/2026

- బిజెపి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి.
- ప్రభుత్వ హాస్పిటల్ లో సార్వత్రిక సమ్మెను జయప్రదం.
- ⁠హాస్పిటల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్

తేదీ: 12-02-2026, కరీంనగర్ - *బిజెపి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి.* - *ప్రభుత్వ హాస్పిటల్ లో సార్వత్రిక సమ్...
12/02/2026

తేదీ: 12-02-2026, కరీంనగర్
- *బిజెపి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి.*
- *ప్రభుత్వ హాస్పిటల్ లో సార్వత్రిక సమ్మెను జయప్రదం.*
- ⁠హాస్పిటల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్
- ⁠ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్& ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పటల్ కార్మికులు మంచిర్యాల చౌరస్తా నుండి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించి హాస్పటల్ వద్ద ధర్నా చేయడం జరిగింది.
- ⁠అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ బిజెపి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై టియుసిసి ట్రేడ్ యూనియన్ కో-ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
- గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల ఒక్క నెల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ హాస్పటల్ ఏజెన్సీల ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి.కనీస వేతనం రూ.26,000/-లుగా నిర్ణయించాలి. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి. వి.బి.జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలి.
విద్యుత్ (సవరణ) బిల్లు - 2025 ను రద్దు చేయాలి.
ఇన్సూరెన్స్ రంగంలో 100 % ఎఫ్ఎఐని రద్దు చేయాలి.
ప్రభుత్వరంగ సంస్థలను, ప్రరిశ్రమలను ప్రైవేటీకరించరాదని అన్నారు.
ఎం.వి.యాక్ట్ - 2019 సవరించాలని తదితర డిమాండ్స్ తో సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రంలో యూనియన్ అధ్యక్షులు పి అరుణ్, కార్యదర్శి కళావతి, నాయకులు రాజు, స్వరూప, రాజయ్య, శేఖర్, సంపత్, రమేష్, తిరుపతి, 100 మంది పాల్గొన్నారు.

మీ
బండారి శేఖర్
యూనియన్ గౌరవ అధ్యక్షులు
ప్రభుత్వ హాస్పిటల్ కరీంనగర్

Dt :06-02-2026, కరీంనగర్ లోని 62వ డివిజన్ దిండిగాల శ్రీదేవి రమేష్ గార్ల సింహం గుర్తుకే మన ఓటు - ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక...
06/02/2026

Dt :06-02-2026,
కరీంనగర్ లోని 62వ డివిజన్ దిండిగాల శ్రీదేవి రమేష్ గార్ల సింహం గుర్తుకే మన ఓటు
- ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రచారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 62వ డివిజన్ అభ్యర్థి దిండిగాల శ్రీదేవి రమేష్ జోరుగా ఎన్నికల ప్రచారం.. ఇంటింటి ప్రచారంలో అంబటి జోజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ దీండిగాల మహేష్, బండారి శేఖర్

- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నగరంలో జోరుగాప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కన్వినర్ అంబటి జోజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, మాజీ కార్పొరేటర్ దీండిగాల మహేష్ తో కలసి 62వ డివిజన్ అభ్యర్థి *దిండిగా శ్రీదేవి రమేష్* కలసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సింహం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.

బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి
కరీంనగర్
ఫోన్ :9652228294

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when బండారి శేఖర్ అన్న సైన్యం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share