17/02/2026
రాష్ట్ర అభివృద్ధి – సంక్షేమ భవిష్యత్తుకు బ్లూప్రింట్ లాంటి బడ్జెట్ : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి
ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బీ గెస్ట్ హౌస్ నందు 2026–2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై గౌరవ ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,
“ఈ బడ్జెట్ గణాంకాల పుస్తకం మాత్రమే కాదు, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశా, దశా చూపించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబడింది” అని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీరు, విద్య, వైద్యం, పర్యాటకం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం వంటి రంగాల బలోపేతానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం అభినందనీయమన్నారు.
మొత్తం రూ. 3,32,205 కోట్లతో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఆర్థిక శాఖ మంత్రిని ఎమ్మెల్యే అభినందించారు.
బడ్జెట్‌లోని ముఖ్య కేటాయింపులు:
• వ్యవసాయ అనుబంధ రంగాలకు – రూ.13,598 కోట్లు
• పాఠశాల విద్యకు – రూ.32,308 కోట్లు
• ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లకు – రూ.27,719 కోట్లు
• వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి – రూ.11,000 కోట్లు
• గృహ నిర్మాణ శాఖకు – రూ.6,357 కోట్లు
• వైద్య శాఖకు – రూ.19,306 కోట్లు
• పౌర సరఫరా శాఖకు – రూ.3,821 కోట్లు
• పురపాలక శాఖకు – రూ.14,538 కోట్లు
• అన్నదాత సుఖీభవ పథకానికి – రూ.6,600 కోట్లు
గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పులు చేయగా, కూటమి ప్రభుత్వం ఆ వడ్డీ రేటును 9%కు తగ్గించడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమన్నారు.
వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాల బలోపేతంతో పాటు యువతకు ఉపాధి కల్పించే పెట్టుబడులను ఆకర్షించేలా బడ్జెట్ రూపొందించబడిందని పేర్కొన్నారు. విషన్ 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే దిశగా ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఎమ్మెల్యే గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, ఏఎంసీ చైర్మన్, మండల మరియు పట్టణ కమిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.