Warangal 365

Warangal 365 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Warangal 365, Medaram, Warangal.

గోళ్లుమన్న నర్సంపేట.. పెద్ది సుదర్శన్ రెడ్డికి వేలాదిగా అశ్రునివాళి 😥 👉గిర్నిబావి నుంచి నర్సంపేట మీదుగా నల్లబెల్లి వరకు ...
01/08/2026

గోళ్లుమన్న నర్సంపేట.. పెద్ది సుదర్శన్ రెడ్డికి వేలాదిగా అశ్రునివాళి 😥

👉గిర్నిబావి నుంచి నర్సంపేట మీదుగా నల్లబెల్లి వరకు ఉద్విగ్నంగా సాగిన అంతిమయాత్ర
👉కదిలివచ్చిన గులాబీ శ్రేణులు..
👉 అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం

Warangal 365 తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొని అశ్రునివాళులర్పించారు. శుక్రవారం ఉదయం గిర్నిబావి మొదలైన అంతిమయాత్ర నర్సంపేట మీదుగా నల్లబెల్లి వరకు చేరుకునే సరికి సాయంత్రం అయింది అంతమయాత్ర సందర్భంగా అడుగడుగునా ప్రజలు బారులు తీరి నిలబడి ఆయనకు తమ నేతకు వీడ్కోలు పలికారు.

అంతిమయాత్ర సందర్భంగా నర్సంపేట నియోజకవర్గమంతా శోకసంద్రంగా మారింది. గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి, వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. "పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ హై" అంటూ నినాదాలు చేస్తూ తెలంగాణ ఉద్యమానికి మరియు నర్సంపేట ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

అనంతరం నల్లబెల్లిలో రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.

ఉద్యమ 'పెద్ది'కి కన్నీటి నివాళులుWarangal 365 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని  ముందుండి నడిపించిన నాటి...
30/07/2026

ఉద్యమ 'పెద్ది'కి కన్నీటి నివాళులు

Warangal 365 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, నర్సంపేట సభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి ఇకలేరు ఈ నెల 26వ తేదీ ఉదయం తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్ రెడ్డిని వారు కుటుంబసభ్యులు హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుండి బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు, చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.50 నిమిషాలకు కన్నుమూశారు

పెద్ది సూదర్శన్ రెడ్డి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉద్యమాన్ని నడిపిస్తూ ప్రత్యేక తెలంగాణ కోసం వారు వేసిన అడుగులు సదా చిరస్మరణీయం సీమాంధ్ర పోలిసులు నిర్బంధాన్ని చేదిస్తూ అనేక రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, సకలజనుల సమ్మె, మహాగర్జన సభ‌, రాస్తారోకోలు, రైల్ రోకో వంటి ప్రతి కార్యక్రమంలోనూ ఆయన ఒక ఉద్యమ సైనికుడిగా, గులాబీ నాయకుడిగా ముందుండి నడిపించే వారు. స్వరాష్ట్రం వచ్చాక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుండి విజయం సాధించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి గారు భౌతికంగా దూరమైనా వారు నడిచిన అడుగు జాడలు, వారు వేసిన అభివృద్ధి బాట ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి, వారి మరణం వారి కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకే కాదు, నర్సంపేట ప్రాంతానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమకారులుకు మొత్తం తీరని లోటు.

జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి ✊

BRS Party

అవగాహన లోపంతో వడ దెబ్బ ద్వారా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందడం లేదు..
23/05/2026

అవగాహన లోపంతో వడ దెబ్బ ద్వారా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందడం లేదు..

ముఖ్యమంత్రిని కలిసిన లొంగిపోయిన మావోయిస్టులుతెలంగాణ రాష్ట్రంలో ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు...
27/02/2026

ముఖ్యమంత్రిని కలిసిన లొంగిపోయిన మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నాయకులు తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పుల్లూరి ప్రసాద్ (చంద్రన్న), బడే చొక్కారావు (దామోదర్), పోతుల కల్పన (సుజాతక్క), నూనె నర్సింహారెడ్డి (గంగన్న)లు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు.

వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక
26/02/2026

వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక

గోదావరి–కృష్ణా జలాలపై శాసనసభలో సమగ్ర చర్చ : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి, కృష్ణా నదీ...
22/02/2026

గోదావరి–కృష్ణా జలాలపై శాసనసభలో సమగ్ర చర్చ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగం, వివాదాలు మరియు ప్రాజెక్టుల పురోగతిపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నేడు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను సీఎం పరిశీలించి, ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

👉 రాష్ట్రంపై ఉన్న అప్పుల భారం నేపథ్యంలోనూ, వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు సమీకరిస్తామని తెలిపారు. సవరించిన అంచనాలకు మంత్రివర్గ ఆమోదం తీసుకుని పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

👉 కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తెలంగాణ ప్రజల ఆస్తి అని పేర్కొంటూ, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిర్మాణ సంబంధిత అంశాలపై సమగ్ర విశ్లేషణ జరిపి భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

👉 గోదావరి, కృష్ణా జలాలపై తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ, ప్రతిపక్షం సూచనలు స్వాగతించనున్నామని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే కేంద్రం, రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు లేదా న్యాయస్థానాల వద్దకు వెళ్లేందుకు సిద్ధమని తెలిపారు.

మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని అంత...
12/02/2026

మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని కోరారు. భూసేకరణ పూర్తయినందున నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో కార్గో మరియు ఎంఆర్ఓ (MRO) సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ పారిశ్రామిక అభివృద్ధి, సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాధాన్యత దృష్ట్యా ఈ విమానాశ్రయం వరంగల్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు కీలకంగా మారనుందని తెలిపారు. అదనంగా అవసరమైన 249.82 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు, ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన  ముఖ్యమంత్రి శ్ర...
09/02/2026

రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, అనంతరం దేవాలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించి దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.

సమాజ రక్షణకైప్రాణాన్నే అర్పించిననీ ధైర్యానికి సెల్యూట్ తల్లీ! 🙏
02/02/2026

సమాజ రక్షణకై
ప్రాణాన్నే అర్పించిన
నీ ధైర్యానికి సెల్యూట్ తల్లీ! 🙏

ముగిసిన మేడారం మహాజాతర👉 అడవిలోకి తరలిన సమ్మక్క సారలమ్మ👉 అంబరాన్ని తాకిన సంబురం 👉 ఉదిగ్నంగా సాగిన మహా జాతర
01/02/2026

ముగిసిన మేడారం మహాజాతర

👉 అడవిలోకి తరలిన సమ్మక్క సారలమ్మ
👉 అంబరాన్ని తాకిన సంబురం
👉 ఉదిగ్నంగా సాగిన మహా జాతర

Address

Medaram
Warangal
506344

Website

Alerts

Be the first to know and let us send you an email when Warangal 365 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share