02/06/2026
Union Textiles Minister Giriraj Singh praised Brandix as a model of women’s empowerment, highlighting its role in providing employment to thousands of women. During his visit to the Brandix campus at Achyutapuram SEZ, he appreciated the world-class manufacturing standards, employee welfare measures, and positive work environment. He congratulated the Brandix management, stating that organizations like Brandix not only create jobs but also transform the region’s economic landscape.
మహిళా సాధికారతకు సజీవ రూపం 'బ్రాండిక్స్':
కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసలు
వేలాది మహిళా ఉద్యోగుల శ్రమకు గౌరవం..
'బ్రాండిక్స్' యాజమాన్యానికి అభినందనలు
వేలాది మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ, వారి సాధికారతకు బ్రాండిక్స్ సంస్థ వేస్తున్న బాటలు అత్యంత స్ఫూర్తిదాయకమని కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ (SEZ) లోని 'బ్రాండిక్స్' ప్రాంగణాన్ని సందర్శించిన కేంద్ర మంత్రికి సంస్థలో జరుగుతున్న నాణ్యమైన వస్త్రోత్పత్తి, ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల విధివిధానాలను, మహిళా ఉద్యోగులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవా కార్యక్రమలాను బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్, భారతీయ భాగస్వామి దొరస్వామి క్షుణ్ణంగా వివరించారు.
బ్రాండిక్స్ పరిశ్రమలో ఉద్యోగుల పనితీరును కేంద్రమంత్రి అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. ఫ్యాక్టరీ అంతటా స్వయంగా కలియదిరిగి.. మహిళా ఉద్యోగులు పని చేస్తున్న తీరును, వారి అంకితభావాన్ని చూసి . సిబ్బందికి సంస్థ అందిస్తున్న అత్యుత్తమ వసతులు, కల్పిస్తున్న ఆహ్లాదకరమైన పని వాతావరణం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం, భద్రతా చర్యల పట్ల యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.