polamarasetty srinu anna yuva sena

polamarasetty srinu anna yuva sena తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి

05/10/2024

మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రిక విలేకరుల సమావేశంలో పూసపాటి అశోక్ గజపతి రాజు గారితో పాటు పాల్గొన్న విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పొలమరశెట్టి శ్రీనివాసరావు గారు.

మీ
పొలమరశెట్టి యువసేన

అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చు అని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్రూలద్రోలి...భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసు...
02/10/2024

అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చు అని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్రూలద్రోలి...భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అప్పట్లో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అయితే, మహాత్మ గాంధీ అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించారు.ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చి ఎందరికో తన ఉద్యమస్ఫూర్తిని నింపిన...ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను...🙏🙏🙏

మీ
పోలమరశెట్టి శ్రీనివాసరావు
విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ....✌️

ICDS ప్రాజెక్ట్ విశాఖ అర్బన్ పౌష్టిక ఆహార మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మరియు పిల్ల...
29/09/2024

ICDS ప్రాజెక్ట్ విశాఖ అర్బన్ పౌష్టిక ఆహార మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మరియు పిల్లలకు అన్నప్రాసనలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోలమరశెట్టి శ్రీనివాసరావు గారు మరియు 40 వార్డ్ మాజీ కార్పొరేటర్ శ్రీ పొలమరశెట్టి నరస కుమారి గారు మరియు ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ P. విష్ణుకుమార్ రాజు గారి కుమార్తె
శ్రీ P. శ్యామల దీపిక గారు పాల్గొనడం జరిగింది

మీ
పోలమరశెట్టి యువసేన

Telugu Desam Party (TDP)

మాధవదార లో వెలిసినటువంటి అమ్మలగన్నమ్మ.  శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు భీమిలి న...
27/06/2024

మాధవదార లో వెలిసినటువంటి అమ్మలగన్నమ్మ. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ జగన్మాత ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరిపై ఉండాలని ప్రార్థించడం జరిగింది.

మీ
పొలమరశెట్టి శ్రీనివాసరావు
విశాఖ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడి మొదటిసారి విశాఖపట్నం విచ్చేయుచున్న మన ప్రియతమ నాయకులు మా అన్నయ్య పల్లా...
17/06/2024

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడి మొదటిసారి విశాఖపట్నం విచ్చేయుచున్న మన ప్రియతమ నాయకులు మా అన్నయ్య పల్లా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర గజమాలతో ఘన స్వాగతం పలకడం జరిగింది

మీ
పొలమరశెట్టి శ్రీనివాసరావు
విశాఖ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి
Palla Srinivasa Rao Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh

గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులుగా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మా అన్నయ్య పల్లా శ్రీనివాసరావు గారికి హృదయప...
07/06/2024

గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులుగా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మా అన్నయ్య పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మీ
పొలమరశెట్టి శ్రీనివాసరావు
విశాఖ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి

బొత్స పై కేసు పెట్టాలి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కా...
07/06/2024

బొత్స పై కేసు పెట్టాలి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఎన్నికల కోడ్ లో ఎటువంటి బదిలీ చేయకూడదని చెప్పారు
మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ పెద్ద దోపిడీ దారుడు అతని గత చరిత్ర ధ్వారా తెలుస్తుందని అన్నారు
టీచర్లను బదిలీ చేస్తామని 3 నుంచి 6 లక్షలు వసూలు చేశారు అక్రమంగా 50 నుంచి 100 కోట్లు కొట్టేశారు టీచర్లు ఇప్పటికే చాలామంది ఫిర్యాదు చేశారు అని అన్నారు బొత్సా అండ్ టీమ్ పై కేసు కట్టాలి
ఈ కుంభకోణంలో ఉన్న వారిని వదిలి పెట్టేది లేదు అని హెచ్చరించారు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఎపి ప్రజలు కూటమి చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా విజయం అందించారు అని ఆనందం వ్యక్తం చేశారు గాజువాక ప్రజలు నాకు రాష్ట్రంలోనే రికార్డ్ స్థాయిలో అత్యధిక మెజారిటీ ఇచ్చారు అని తెలిపారు టీచర్ల బదిలీ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన బొత్సా సత్యనారాయణ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు
టీచర్ల తరఫున మేమూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
తప్పనిసరిగా బొత్సా టీమ్ పై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు
అన్ని డిపార్ట్మెంట్ ల్లోనూ ఈ తరహా కుంభకోణాలు జరిగాయి వాటిపైనా దృష్టి పెడతాం అని పేర్కొన్నారు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు

మీ
పొలమరశెట్టి యువసేన

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన కూటమి విజయాన్ని ఆనందిస్తూ 53 వ వార్డు కార్యకర్తలు ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో...
05/06/2024

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన కూటమి విజయాన్ని ఆనందిస్తూ 53 వ వార్డు కార్యకర్తలు ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పొలమరశెట్టి శ్రీనివాసరావు గారు మరియు శ్రీ పొలమరశెట్టి నరసకుమారి గారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన శ్రీనివాసరావు గారు ఈ కూటమి విషయానికి అహర్నిశలు శ్రమించిన తెలుగుదేశం కార్యకర్తలకు మరియు జనసేన కార్యకర్తలకు మరియు బిజెపి కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది సంక్షేమం అభివృద్ధి సమపాలుగా నడిచే ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మారుస్తుందని అన్నారు

మీ
పొలమరశెట్టి శ్రీనివాసరావు
విశాఖ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి

విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల  సమావేశంలో ఉత్తరాంద్ర లో సి ఎస్ జవహర్ రెడ్డి అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు పై బ...
31/05/2024

విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో

ఉత్తరాంద్ర లో సి ఎస్ జవహర్ రెడ్డి అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు పై బాధితులతో కలసి మీడియా ముందుకు వచ్చిన జనసేన నాయకులు కార్పొరేటర్ పీతలమూర్తియాదవ్, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు,

జనసేన నాయకులు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ మాట్లాడుతూ

పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములు వైసీపీ నాయకులు, ముఖ్య అధికారులు దోచుకుంటున్నారు.

రాష్ట్ర సి ఎస్ జవహర్ రెడ్డి కుమారుడు బినామిలు పేరుతో అసైన్డ్ భూములు కొట్టేశారు.

జవహర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు రెవెన్యూ అధికారులు రైతులు భూములలో పోల్స్ వేయడానికి వచ్చారు.

రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు.

సి ఎస్ జవహర్ రెడ్డి ఆయన అనుచరులు పేద రైతులు భూములు కొట్టేయడానికి బరితెగిస్తున్నారు.

తమని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి రైతులు పక్షాన ఉంటుంది..బాధితులకు రక్షణ కల్పిస్తుంది.

బురాబంధులను కచ్చితంగా కటకటాల వెనక్కి పంపిస్తాం.

రైతులకు తెలీకుండా భూములు రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.

రెవెన్యూ విభాగం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని భూ దోపిడీలకు పాల్పడుతున్నారు.

సి ఎస్ జవహర్ రెడ్డి బినామీ త్రిలోక్ ను వెంటనే అరెస్టు చేయాలి.

పోలీసులు, రెవెన్యూ అధికారులు , జిల్లా కలెక్టర్

ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము.

అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.

జి ఓ రాకముందే అసైన్డ్ భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు.

మంత్రి మెరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి విడదల రజిని, ఐ ఏ ఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, జవహర్ రెడ్డి అనుచరులు చేసిన భూ దోపిడీలపై ఆధారలతో సహా బయట పెడతాం.


*బాధిత రైతు అప్పన్న మాట్లాడుతూ

సి ఎస్ జవహర్ రెడ్డి మా భూములు చూసి వెళ్లారు.

అనంతరం అధికారులు, వైసీపీ నాయకులు, రౌడీలు వచ్చి భూమి ని వదిలి వెళ్లాలని మమ్మల్ని బెదిరించారు.

కొత్త జీవో ప్రకారం భూమి మాది కాదు అని అధికారులు అంటున్నారు.

అన్నవరం పంచాయితీ పెద్దలు మాకు

*బాధితురాలు చిట్టితల్లి మాట్లాడుతూ

అధికారులు మా భూమిలో స్తంభాలు పాతాడానికి వస్తే మేము అడ్డుకున్నాం.

కోర్టు కు వెళ్లిన చెల్లదని అధికారులు, వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు.

అన్నవరం పంచాయితీ కి చెందిన నాయకులు భూమి మాది అని అంటున్నారు.

ఈనెల 20వ తేదీన మా భూములు చూసుకొని వెళ్లారు.

అన్నవరం సర్పంచ్, ఎమ్ పి టి సి లు రౌడీ ముఖాలను తీసుకువచ్చి మమ్మల్ని బెదిరించారు

తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి...అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ  జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగా...
28/05/2024

తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి...అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం.

క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్...తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారు.

ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం...ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం.


మీ
పొలమరశెట్టి శ్రీనివాసరావు
విశాఖ జిల్లా టిడిపి పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి

ఈ రొజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మ అన్న వదిన కి హృదయపూర్వక శుభాకాంక్షలుమీ అనుబంధం నిండు నూరేళ్లు ఇలాగే కొనసాగాలన...
22/05/2024

ఈ రొజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
మ అన్న వదిన కి హృదయపూర్వక శుభాకాంక్షలు
మీ అనుబంధం నిండు నూరేళ్లు ఇలాగే కొనసాగాలని
మానస వచ ఆ భగంతునికి నీ కోరుకుంటూ

మీ
పొలమరశెట్టి యువసేన

కూటమికి ఓటు వేసి ధర్మం వైపు నిలబడ్డ ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు...ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా...
14/05/2024

కూటమికి ఓటు వేసి ధర్మం వైపు నిలబడ్డ ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు...ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఎంతో నిబ్బరంతో ధైర్యంగా పోరాడిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన సైనికులకు వీరామహిళలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలుకు పేరు పేరున నా ధన్యవాదములు...మీ యొక్క అభిమానం అనిర్వచనం...రేపు రాబోయేది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే...ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు ఇచ్చే తీర్పు వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది...జై టీడీపీ జై జనసేన జై బీజేపీ...✊✊✊

మీ
పోలమరశెట్టి శ్రీనివాసరావు
విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when polamarasetty srinu anna yuva sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share