01/06/2026
#ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడమే ప్రభుత్వ సంకల్పం
ఉదయం 5 గంటలకే ఇంటి వద్ద పెన్షన్ అందిస్తున్న సచివాలయ వ్యవస్థ అభినందనీయం
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
పార్వతీపురం నియోజకవర్గంలో సోమవారం 14వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 5 గంటలకే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం గొప్ప విషయమని, ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో అనే ఆందోళన లబ్ధిదారుల్లో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. పెన్షన్ పొందుతున్న ప్రతి వృద్ధుడు, ప్రతి వికలాంగుడు, ప్రతి వితంతువు ముఖంలో కనిపిస్తున్న ఆనందమే కూటమి ప్రభుత్వ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
పెన్షన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ధన్యవాదాలు తెలిపారు.