Ap State Urdu Academy

Ap State Urdu Academy Official page of AP State Urdu Academy.

promotion & Preserving of Urdu language, poets, students, literature, culture, scholarships, and community development & programs across Andhra pradesh

15/04/2026
15/04/2026

మైనారిటీల అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల సమగ్ర అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ మరియు ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ అకాడమీ కేంద్రాలకు సుమారు 300 నూతన కంప్యూటర్లను కేటాయిస్తూ, మైనారిటీ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు ప్రారంభించింది

15/04/2026
మైనారిటీల అభివృద్ధికి చారిత్రాత్మక అడుగుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల సమగ్ర అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ మరియు ప్రో...
15/04/2026

మైనారిటీల అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల సమగ్ర అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ మరియు ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ అకాడమీ కేంద్రాలకు సుమారు 300 నూతన కంప్యూటర్లను కేటాయిస్తూ, మైనారిటీ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, విద్యాభివృద్ధి మరియు సాంకేతిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ గౌస్ పీర్ గారు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ గారు కూడా పాల్గొని ప్రసంగించారు.
ఈ నిర్ణయం ద్వారా ఉర్దూ అకాడమీ కేంద్రాలు సాంకేతికంగా మరింత బలోపేతం అవుతాయని, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు మరియు ఆధునిక విద్యా అవకాశాలను పొందగలరని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మైనారిటీ యువతకు సమాన అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అలాగే, మైనారిటీ అభివృద్ధి కార్యక్రమాల విజయవంతమైన అమలులో ఆంధ్రప్రదేశ్ న్యాయ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ గారి మార్గదర్శకత్వం మరియు నిరంతర సహకారం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మైనారిటీల పట్ల ఉన్న నిబద్ధత వల్లే ఇలాంటి వినూత్న నిర్ణయాలు సాధ్యమవుతున్నాయని, ఉర్దూ భాష అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు.

20/01/2026

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చరిత్రలో మొదటి సారి ఉర్దూ అకాడమీ తరపున ఉర్దూ భాషకు మతాలకు అతీతంగా సేవలందించిన ఉర్దూ పండితులను స్మరించుకుంటూ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు కడప పట్టణం నందు మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ NMD ఫరూఖ్ గారి చేతుల మీదుగా విడుదల చెయ్యటం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గోవర్ధన్ రెడ్డి గారు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుస్సేన్, టీడీపీ నాయకులు NMD ఫయాజ్ గారు, షేక్ కార్పొరేషన్ చైర్మెన్ ముక్తియార్ గారు, MHPS సలహాదారులు నాజర్ బాషా గారు, ఇఫ్తకార్ జమాల్ గారు, మురాదీయ దర్గా ముతవల్లి సయ్యద్ తాహిరుల్ల ఖాద్రి గారు తదితర నాయకులు పెద్దలు పాల్గొన్నారు.

20/01/2026

ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ భేష్: కర్ణాటక నుండి విచ్చేసిన భాష ప్రత్యేక బృందం

కర్ణాటక నందుతులు భాషను అధికారిక భాష హోదా ఎలా ఇవ్వాలి అన్న నేపథ్యంలో మరియు ఆంధ్రరాష్ట్రంలో ఉర్దూ భాషను ఎలా రెండవ అధికార భాషగా అమలుచేస్తున్నారు తెలుసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నుండి ఒక ప్రత్యేక బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి విచ్చేసి మైనారిటీ వెల్ఫేర్ గౌ" కార్యదర్శి శ్రీధర్ ఐఏఎస్ గారి అధ్యక్షతన సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ గారు మరియు డైరెక్టర్/ సెక్రెటరీ మొహమ్మద్ గౌస్ పీర్ గారు పాల్గొన్నారు.

సమావేశం నందు గౌ మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శి శ్రీ శ్రీధర్ ఐఏఎస్ గారు ప్రభుత్వం ఉర్దూభాషభివృదికి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వివరించారు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ గారు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం నందు జీవిస్తున్న ఉర్దూభాషభిమానులు అదృష్టవంతులని దానికి కారణం గౌ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు & మైనారిటీ & న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ NMD ఫరూఖ్ గారు అని స్కూల్ వ్యవస్థలో కేజీ నుండి యూనివర్సిటీ చదువుల వరకు ఉర్దూ భాషకు ప్రోత్సాహం సంస్కృతి, సంప్రదాయాలు & విద్యా పరంగా పుష్కలంగా అందించటమే దీనికి కారణం అని వివరించారు.

తదనంతరం కర్ణాటక నుండి విచ్చేసిన ప్రత్యేక బృందం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాషపై చూపుతున్న ప్రత్యేక చొరవకు మరియు అకాడమీ చైర్మెన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు తెలుసుకొని భేష్ అని కితాబిచ్చాడు.

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Ap State Urdu Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share