CPI Vijayawada

CPI Vijayawada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPI Vijayawada, Political Party, Vijayawada.

07/06/2026
*విజయవాడ*..... భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు కామ్రేడ్  *చండ్ర రాజేశ్వరరావు గారి 112 వ జయంతి*సందర్భంగా *యుద్ధాలు- ప...
06/06/2026

*విజయవాడ*..... భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు కామ్రేడ్ *చండ్ర రాజేశ్వరరావు గారి 112 వ జయంతి*సందర్భంగా *యుద్ధాలు- పర్యవసానాలు - చమురు సంక్షోభం* పై స్మారకోపన్యాసం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ టి. లక్ష్మీ నారాయణ వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య, మాజీ శాసనమండలి సభ్యులు జల్లి విల్సన్, ప్రొఫెసర్ సి. నరసింహారావు,జిల్లా పార్టీ కార్యదర్శి దోనేపూడి శంకర్, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నగర పార్టీ కార్యదర్శి జి.కోటేశ్వరరావు,సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, పాల్గొన్న కామ్రేడ్స్....




*విజయవాడ* : భూ పోరాట యోధులు,భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత *కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు* 112 వ జయంతి సందర్భంగా సిపిఐ వి...
06/06/2026

*విజయవాడ* : భూ పోరాట యోధులు,భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత *కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు* 112 వ జయంతి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన సి.ఆర్.విగ్రహానికి నివాళి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి.ఈశ్వరయ్య,జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటసుబ్బయ్య, నగర పార్టీ సహాయ కార్యదర్శిలు లంకా దుర్గారావు,నక్కా వీరభద్ర రావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివరావు,K.V. భాస్కరరావు,తాడి పైడియ్య,పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు,సంగుల పేరయ్య, కార్యవర్గ సభ్యులు, డి.వి.రమణబాబు,సింగరాజు సాంబశివరావు,దోనేపూడి సూరిబాబు,లంక గోవిందరాజులు ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్.పిచ్చయ్య, చంద్ర నాయక్,విజయ టాక్స్ సొసైటీ నాయకులు జల్ది చిన్నారావు,తదితరులు పాల్గొన్నారు.





05/06/2026
*మహిళా రిజెర్వేషన్ చట్టం నారి శక్తి వందన్ అధినీయం 2023 అమలుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి...​ఏపీ మహిళా సమాఖ్య (NF...
05/06/2026

*మహిళా రిజెర్వేషన్ చట్టం నారి శక్తి వందన్ అధినీయం 2023 అమలుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి...​ఏపీ మహిళా సమాఖ్య (NFIW)*

మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించి 2023 లో పార్లమెంట్లో ఆమోదం పొందిన నారి శక్తి వందన్ అధినీయం 2023 (NSVA 2023)బిల్లుని చట్టరూపంలో అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ అందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా మహిళా రిజర్వేషన్ త్వరితగతిన అమలుకు సహకరించాలని రాష్ట్రంలోని ప్రజా ప్రతినిదులు వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా NTR జిల్లా అధ్యక్షులు Ch.దుర్గా కోటేశ్వరీరావు నేతృత్వం లోని ప్రతినిధి బృందం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామేహశ్వరావు గారిని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భముగా దుర్గంబ మాట్లాడుతూ ​NSVA 2023 చట్టం అమలు కోసం 'జనగణన (సెన్సస్)' మరియు 'నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)' అనే రెండు షరతులతో ఆమోదించబడింది. ​దీని అర్థం జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయినప్పుడు మాత్రమే NSVA అమలు చేయబడుతుంది ఈ ప్రక్రియ వలన మహిళా రిసర్వేషన్ నిరవధికంగా ఆలస్యమవుతుందని, ​NSVAతో జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెట్టడం అనవసరమని, దశాబ్దాలుగా దీని కోసం పోరాడుతున్న భారతీయ మహిళలకు ఇది ఖచ్చితంగా అన్యాయం చేస్తుందని మా మహిళా సమాఖ్య NFIW సంస్థ భావిస్తుందని. జనాభాలో దాదాపు సగభాగంగా ఉన్న మహిళలను పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల వంటి నిర్ణయాధికార సంస్థలకు దూరంగా ఉంచడం వల్ల ప్రజాస్వామ్యం అర్థరహితంగా మారుతుంది. ​కాబట్టి, పార్లమెంటులో NSVA నుండి జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజనను వేరు చేస్తూ (de-link), ఈ చట్టాన్ని తక్షణమే అమలు చేసేలా బిల్లు కోసం ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి మీరు సహకరించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసినదిగా కోరండం జరిగిందని. అలాగే ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా అభ్యర్దించడం జరిగింది.

దానిపై గౌరవ ఎంఎల్ఎ సానుకూలంగా స్పందించి రానున్న అసెంబ్లీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి సానుకూల తీర్మానం జరిగే విధముగా తనవంతు ప్రయత్నం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారని ఆమె తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగర నాయకులు డి.సీతారావమ్మ, డి. పుష్పవతి,శాంత,Ch.అనిత, వెళంగిని రాణి తదితరులు పాల్గొన్నారు.




సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె.రామకృష్ణ
04/06/2026

సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె.రామకృష్ణ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య
04/06/2026

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య




సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె.రామకృష్ణ
04/06/2026

సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె.రామకృష్ణ




విజయవాడ......  భారత జాతీయ మహిళా సమాఖ్య 72 వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ పేట దాసరి భవన్ వద్ద నగర కార్యదర్శి పంచదార్ల ...
04/06/2026

విజయవాడ...... భారత జాతీయ మహిళా సమాఖ్య 72 వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ పేట దాసరి భవన్ వద్ద నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేస్తున్న మాజీ నగర అధ్యక్షులు కొరగంజి దుర్గాంబ, పాల్గొన్న జిల్లా అధ్యక్షులు Ch.దుర్గాకోటేశ్వరరావు, నగర నాయకులు డి.రమణమ్మ,డి. సీతా రావమ్మ,నిలాపు భాగ్యలక్ష్మి, D.పుష్పవతి,అండిమాని నాగమణి,చింతాడ పార్వతి, బి.శాంత,R.అనసూయ, Ch.అనిత,G.మణి, కుమారీ, వెళంగిని రాణి, గుణసుందరి, కళ్యాణి ,మురళి సాయి మణి,నిర్మల తదితరులు పాల్గొన్నారు.





Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share