04/10/2022
◆స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో అవార్డులు పొందిన కోరుట్ల మున్సిపాలిటీని అభినందించిన కేటీఆర్ గారు◆
#కోరుట్ల మున్సిపాలిటీకి నాలుగు కోట్ల నిధులు మంజూరు
స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో కేంద్ర ప్రభుత్వంచే అవార్డులు పొందిన మున్సిపాలిటీలను ఈరోజు MCHRD, హైదరాబాద్ లో గౌరవ పురపాలక శాఖ మాత్యులు శ్రీ కె.తారక రామారావు గారు, అభినందన సభ ఏర్పాటు చేసినారు. ఇట్టి కార్యక్రమంలో 2 అవార్డులు పొందిన కోరుట్ల మున్సిపాలిటీని పురపాలక శాఖ మంత్రి KTR గారు, మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రేటరీ అరవింద్ కుమార్ IAS గారు, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ N. సత్యనారాయణ IAS గారు ప్రత్యేకంగా అభినందించినారు. అనంతరం అవార్డులు పొందిన ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినారు. కోరుట్ల మున్సిపాలిటీ 2 అవార్డులు పొందినందున రెండు కోట్ల చొప్పున 2 అవార్డ్ లకు మొత్తం నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దేశం మొత్తంలో ఎక్కువ అవార్డులు పొంది తెలంగాణ సత్తా చాటినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఇట్టి కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ K. తారక రామారావు గారు, మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ IAS గారు, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ N. సత్యనారాయణ IAS గారు, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి J. అరుణ శ్రీ గారు, చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య గారు, కమిషనర్ శ్రీ MD అయాజ్ గారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ G. మహేష్ గారు పాల్గొన్నారు.