కుందుర్పి YSRCP పార్టీ

కుందుర్పి YSRCP పార్టీ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from కుందుర్పి YSRCP పార్టీ, Kundurpi.

14/06/2022
05/11/2020

రాత..... మొదలైంది!
( కుందుర్పి మండలం లోని ప్రధాన పార్టీల కార్యకర్తలు ఆవేదన )

గౌరవనీయులైన మీకు నమస్కారములతో....🙏

కార్యకర్తలతో పబ్బం గడుపుకుని, పక్కకు పెడుతున్న నాయకులు! అవసరమైనప్పుడు నాయకులు ప్రసంగాల్లో :-- ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయండి! విజయం వరిస్తుంది! రాబోయే రోజులు మీవే..... అని ఉత్తేజ భరితమైన మాటలు చెబుతారు! ఇది నిజమేనని నమ్మి, కార్యకర్తలు అధినాయకుడు మీద ఉన్న అభిమానంతో ఎన్నికలలో పోరాటం చేస్తారు! పట్టుదలతో సైనికుల్లా పోరాడుతూ..... ఎన్నికలలో ఇప్పుడు గెలవకపోతే, ఇంకెప్పుడు గెలవలేము, అని పార్టీ ప్రతిష్ఠను, తన వ్యక్తిగత ప్రతిష్ట గా మార్చుకొని, ప్రత్యర్థి పార్టీలతో కక్షలు కార్పణ్యాలు పెంచుకొని, కష్టనిష్ఠూరాలు మూటకట్టుకుని, ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బంధువులను స్నేహితులను అందరినీ వదులుకొని, మనకు ఈ ఎన్నికలు "చావో - రేవో " అన్నట్లుగా అన్నీ తానై పోరాడి, అందరి సమిష్టి కృషితో,
అందరి సహాయ సహకారాలతో విజయము చేకూర్చితే.....
ఆ విజయానందంలో తన పరిధిలోని నిరుపేదలకు చిన్నచిన్న పనులు చేయిస్తామని హామీలు ఇచ్చి, మన గవర్నమెంట్ వచ్చింది! ఇక మనకి భయంలేదు! అని 'కాలర్'ఎగరేసి, మీసాలు తిప్పిన ప్రధాన పార్టీ కార్యకర్తలు.... ఇప్పుడు కనుమరుగై పోతున్నారు!
😭కారణం:- కార్యకర్తలను విభజించి, స్థానిక నాయకులు తమ ఆధిపత్యం కోసం వర్గపోరు నడిపిస్తున్నారు, ఇది అందరికీ తెలిసిన
"బహిరంగ రహస్యం" కాని ఎవరూ బయటపడటం లేదు, నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కార్యకర్తల పరిస్థితి చాలా దయనీయంగా ఆగమ్యగోచరంగా ఉంది! ప్రస్తుతం కార్యకర్తలు చడీచప్పుడు లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు!
*అమ్మ పెట్టదు.అడుక్కోనివ్వదు* అనేచందంగా ఉంది ప్రస్తుత పరిస్థితి! ఈ పరిస్థితి పై నియోజకవర్గ స్థాయి నాయకులు దృష్టి పెట్టగలరని విన్నపం!
*ఏరు దాటాక ...తెప్ప తగలేసే నట్టుగా* కార్యకర్తలను కనీసం పలకరించే నాయకుడే లేడు! కార్యకర్తలను పట్టించుకోకపోవడం పోయినా పర్వాలేదు వారిని ఇబ్బంది పెట్టకపోతే చాలు!
ఎందుకంటే "కార్యకర్త"అనేవాడు అల్పసంతోషి... నాయకుడు భుజం మీద చేయివేస్తే ఉబ్బితబ్బిబ్బై పోతాడు!
ఇలాగే కొనసాగితే ఎంతటి బలమైనపార్టీ అయినా కూడా కార్యకర్తల ఆగ్రహానికి బలైపోతుంది!
కార్యకర్తల కళ్ళల్లో "ఆనందం" చూసినవారే దీర్ఘకాలంగా నాయకుడుగా ఏలుతారు!
👍లీడర్... క్యాడర్..... ఓటర్....
లకి తేడా తెలియని కొంతమంది "నాయకులం" అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నారు! నిజాయితీగా గెలుపు కోసం కష్టపడ్డా కార్యకర్తలను ' గేలి ' చేస్తూ, పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు కూడా పిలువకుండా అవమాన పరుస్తున్నారు!
తమ భజనపరులకు మాత్రమే పిలుస్తారు!
😭కుందుర్పి మండలంలోని సోషల్ మీడియాలో "అడ్మిన్"(ADMIN)ఉన్నవారు మాత్రమే పోస్ట్ పెట్టాలి అని నిబంధన! దీనివల్ల ప్రజలకు నాయకులకు, వాస్తవాలు, స్థానిక సమస్యలు తెలియనీయకుండా కట్టడి చేసి ఉత్సాహంగా ఉన్న కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు!
* నేనే..... అని అహం వీడండి! మనం ....అనే పదం వాడండి!! విమర్శించడం.... మానవనైజం! ఆత్మవిమర్శ...... చేసుకోవడం మహానాయకుల నైజం!!
ఇది వాస్తవం.... అనుకుంటేనే
లైక్ చేయండి!
షేర్ చేయండి! .. ఓపికగా చదివినందుకు
🙏ధన్యవాదములు🙏
మీ శ్రీనివాస్
కుందుర్పి

22/04/2020

దయచేసి షేర్ చేయండి 🙏🙏

వైయస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు YS Vijayamma గారికి, గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి YS.Bharathi Reddy FC గారికి నమస్కారాలు 🙏🙏

అమ్మా....పెద్దాయన మరణానంతరం జరిగిన పరిణామాలతో, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి,సొంతంగా పార్టీ పెట్టి,డిల్లీని ఎదురించిన కుటుంబం మీది,ఆ తరువాత కక్షసాధింపు కోసం మీపై పెట్టిన కేసులు,విచారణలు జైలు అంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలని ఓర్చుకున్నారు, పత్యర్ధులు సూటిపోటి మాటలు అంటుంటే, ఆ బాధను దిగమింగుతూ ఎన్ని నిద్రలేని రాత్రుల్లు గడుపుంటారో మేము ఊహించగలము...

ఆ కష్టకాలంలో మీతో ఉన్న నాయకులు కొందరు,మిమ్మల్ని వదులుకున్న నాయకులు కొందరు, మీ ఉప్పు తిని,మీరు రాజకీయ బిక్ష పెట్టిన కొందరు విశ్వాసం లేకుండా మాట్లాడిన మాటలు మాక్కూడ గుర్తు ఉన్నాయమ్మా,,,నాయకులని పక్కన పెడితే, మీతో మొదటినుంచి నడిచింది, కాంగ్రెస్ ని కాదని, మీ కుటుంబం ఏపార్టీలో ఉంటే అదే మాపార్టీ అనుకుని వచ్చిన కార్యకర్తలు అమ్మా...

మీతో పాటు నడిచారు,కేసులు పెట్టించుకుని బాధపడ్డారు, జగనన్నని ముఖ్యమంత్రి ని చేసుకోవాలనే సంకల్పంతో ఎన్నో బాధలుపడ్డారు, దురదృష్టవశాత్తు 2014లో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో, వాళ్ళ కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి, టిడిపి గవర్నమెంట్లో కూడ ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడ్డారు, కానీ మీ కుటుంబాన్ని మాత్రం వదలలేదు, దానికి కారణం మీ కుటుంబం పై నున్న నమ్మకం...

ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ పార్టీ కోసం సర్వం త్యాగంచేసిన కార్యకర్తలను మాత్రం పట్టించుకునే నాధుడే లేడమ్మా, జగనన్నకి చెప్పుకుందామంటే, కార్యకర్తలకు అందనంత దూరం అయిపోయాడమ్మా జగనన్న, మొన్నటి దాక మామధ్య ఉంటూ, మామధ్యే తిరుగుతూ, వేలకిలోమీటర్లు తిరిగిన జగనన్నని, ఈరోజు మాకు వినపడేంత దగ్గరలో ఉన్నా,కనపడనంత దూరం అయిపోయాడమ్మా....

ఈరోజు జగనన్న తరువాత అని చెప్పుకునే నాయకులు, విజయసాయిరెడ్డి లాంటి వారు కూడ కార్యకర్తలని పట్టించుకునే పరిస్థితి లేదమ్మా, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి పధవులు,వాళ్ళకి భజన చేసేవాళ్ళకి ఉద్యోగాలు,ఇచ్చుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఓ ప్రైవేట్ సైన్యం స్రుష్టించుకుంటున్నారేమో అని అనుమానంగా ఉందమ్మా??

పార్టీ పార్టీ అంటూ 9ఏళ్ళు కష్టపడిన ఏకార్యకర్తని పట్టించుకోవడం లేదు, అధికారం వచ్చాక పక్కపార్టీ గోడలుదూకే వాళ్ళకే విలువ ఇస్తున్నారు, విజయసాయిరెడ్డి లాంటి వారివల్ల పార్టీకి ఆయువుపట్టు లాంటి సోషల్ మీడియా కూడ బ్రష్టు పట్టిపోయింది, పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసే మహిళా కార్యకర్తల కష్టాలు వర్ణణాతీతం, దానికి కారణం ఆయనకి అనుకూలంగా ఉండే ఎందుకు పనికిరాని, ఓ అసమర్దుడిని సోషల్ మీడియాకి ఇంచార్జిని చేసారు..

ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, జగనన్నకి చెప్పుకుందామంటే, గేటు దాటనిచ్చే పరిస్థితే లేదు, పెద్దాయన ఉన్నప్పుడు పరిస్థితి ఇలా లేదమ్మా, మా పెద్దాయన పార్టీ కార్యకర్తలకి ఎంతో విలువ ఇచ్చేవాడు, కార్యకర్తల తరువాతే ఏదైనా అంటూ భరోసా ఇచ్చేవాడు, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదమ్మా...

ఇక పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానీ పరిస్థితి పార్టీలో ఉంది, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు సరిగ్గా లేవు,సంక్షేమ కార్యక్రమాలు జనాల్లోకి సరిగ్గా వెళ్ళడం లేదు, అందరూ పార్టీలో మేము గొప్పంటే మేము గొప్ప అని గుర్తింపు పొందడానికి తప్ప పనిచేసే వాళ్ళు కనపడటం లేదు, కార్యకర్తలు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటూ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదమ్మా ...

మీకు ఇవన్నీ తెలియవనే అనుకుంటున్నాం?? మీరు చొరవతీసుకుని, పార్టీలో మేమే గొప్ప అనుకునే వాళ్ళను ఎంతలో పెట్టాలో అంతలో పెట్టి, పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా,,,మీరు తలుచుకుంటే ఓ సామాన్య కార్యకర్తని నాయకుడిని చేయగలరు, కానీ ఆ నాయకుడు కార్యకర్తలా పనిచేయలేడమ్మా, ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీచేతుల్లోనే ఉందమ్మా,మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యకర్తలను దూరంచేసుకోరని ఆశిస్తూ...

సదా మీ కుటుంబ శ్రేయస్సు కోరే, ఓ సామాన్య పార్టీ కార్యకర్త.....

Copyed by facebook లింగారెడ్డి రాజశేఖరరెడ్డి ✍️✍️✍️ post}

అన్నా....సోషల్ మీడియా లో కాస్త మార్పులు చెయ్యండి....మీరు అడగాల్సిన అవసరం లేదు....ఎవరికి వారే స్వచ్ఛందంగా చెయ్యటానికి ముం...
04/08/2019

అన్నా....సోషల్ మీడియా లో కాస్త మార్పులు చెయ్యండి....

మీరు అడగాల్సిన అవసరం లేదు....ఎవరికి వారే స్వచ్ఛందంగా చెయ్యటానికి ముందుకు వస్తారు...

మన సోషల్ మీడియాలో కొందరు వాట్సాప్ మెసేజ్ లు,వాట్సాప్ కాల్ చేసి బెదిరించి..బెదిరించినట్లు....దెబిరిస్తున్నారు....ఆఫ్ కోర్స్...పిల్లి అరుపులకు బయపడం...

ఇప్పుడున్న కొందరు నేను లోపలికి వెళ్తే మీ సంగతి చూస్తా.... సిస్టంలోకి రానివ్వను...అంటూ బెదిరిస్తున్నారు...ఏంటన్న ఇది...?

వాళ్ళు నామినేటెడ్ పోస్టుల్లో దూరతారట...అందరూ త్యాగం చేయాలట...వాళ్ళు త్యాగం చేయొచ్చుగా....?

సోషల్ మీడియాలో కష్టపడ్డవారికి మీరు ఏదో ఒకటి చెయ్యాలి...చేస్తే బాగుంటుంది కూడా....
అందరికీ అవసరం లేదు...అందరికీ చెయ్యటం సాధ్యం కాదు కూడా....

కానీ అందరి కష్టాన్ని తమ స్వార్థం కోసం కొంతమంది ఉపయోగించుకున్నారు....అది తప్పు కదా? అలాంటి వారిని గుర్తించి మీరే దూరం పెట్టాలి....మా బాధ అదే...ఎంత వాగీనా..జగన్ ఇంటి గోడ కూడా ఆ మాట తాకదని అఫీషియల్ సోషల్ నెట్ వర్క్ వారే అంటున్నారు...

అలాంటప్పుడు మేం ఎంత చించూకున్నా వేస్ట్ కదా..? మీరే ఒక్కసారి ఆలోచించండి....

అందుకే కాస్త దూరంగా ఉండాల్సి వస్తుంది...

మీరు గెలిచిన మరుక్షణమే...అప్పటి వరకు ఎంత మదన పడ్డామో... ఆ భారమంతా దిగిపోయింది....మన వాడు గెలిచాడు అనే తృప్తి చాలు...

మీరు ఏర్పాటు చేస్తున్నారో...లేక తమకు ఇతరులు పోటీ వస్తున్నారనో...సొంతగా సోషల్ మీడియా మీట్ అంటూ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు.....ఇది ఎంతవరకు సమంజసం?

వాళ్ళ అవసరం ఉంటే సోషల్ మీడియా మీట్ అని సొల్లు చెప్పటం...ఎందుకన్నా ఇది?

మీరు ఒక్క పావు గంట సమయం కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుంది....

మేము జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేస్తాం కానీ....మరేవరికొసమో కాదు...

సోషల్ మీడియాలో మార్పులు చేస్తే మేం పని చేస్తాం...మార్పులు రాకపోతే ఆత్మాభిమానం చంపుకోలెం కదాన్నా....ఒక్కసారి ఆలోచించండి...

వైద్యం చేతగాని డాక్టర్ ఉంటే...ఎంత... పోతే ఎంత..అతన్ని నమ్మి వైద్యం చేయించుకుంటామా?

మార్పు మంచిదే.....

12/07/2019

తెలుగుదేశం సోషల్ మీడియా పుల్ యాక్టివ్ లోకి వచ్చింది,,,

మనది మాత్రం 25% మాత్రమే వర్క్ చేస్తున్నారు,,

త్వరలో వీళ్ళుకూడ జనగణమన పాడేసేట్టు ఉన్నారు,,

నేను కోరుకున్నట్లు జరగ్గపోతే, నేనుకూడ రాజకీయ పోస్టులకు మంగళం పాడేసి, నాదారి నేను చూసుకుంటా,,

టిడిపి వాళ్ళు, జగన్ని, వాళ్ళ ప్యామిలీని నీచంగా తిడుతుంటే, హ్యాఫిగా కూల్ లస్సీ తాగుతూ, మీ మాదిరే,మేము కూడ ఎంజాయ్ చేస్తాము,,

కందకు లేని దురద,కత్తికి ఎందుకన్నట్లు, దెంగులు తినే వాళ్ళకి లేని నొప్పి,మా కెందుకబ్బా?

అసలే కూలికి పోతే కుండ కాలాల,లేకపోతే ఎండగాలాల అన్నట్లు ఉంది మా పరిస్థితి,,

పార్టీకే సోషల్ మీడియా అంటే చిన్న చూపు ఉన్నప్పుడు, ఎవడెవడితోనో అమ్మనాభూతులు తినే అవసరం మాకేంటి?

గుడ్ నైట్

Address

Kundurpi

Alerts

Be the first to know and let us send you an email when కుందుర్పి YSRCP పార్టీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share