Ward 54 corporator

Ward 54 corporator Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ward 54 corporator, Nellore.
(1)

నెల్లూరు నగరంలోని 14వ డివిజన్‌ ఏ.సి.నగర్, బాలాజీనగర్, పద్మావతి నగర్, శ్రీనగర్, అలాగే 54 డివిజన్ లక్ష్మీపార్వతి నగర్, తది...
07/05/2024

నెల్లూరు నగరంలోని 14వ డివిజన్‌ ఏ.సి.నగర్, బాలాజీనగర్, పద్మావతి నగర్, శ్రీనగర్, అలాగే 54 డివిజన్ లక్ష్మీపార్వతి నగర్, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి *ఎండి.ఖలీల్‌అహ్మద్‌* గారు వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ, కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీని బలపరచి మీ బిడ్డగా *నన్ను*, నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి అయిన *వేణుంబాక విజయసాయిరెడ్డి* గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, షేక్ సఫియా బేగం, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు షేక్ జమీర్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు నగరంలోని 44వ డివిజన్‌ మధ్వపతివారి అగ్రహారం, రాయాజివీధి, మధ్వపతివారి వీధి, యడ్లవారివీధి,  తదితర ప్రాంతాలలో నగర న...
15/03/2024

నెల్లూరు నగరంలోని 44వ డివిజన్‌ మధ్వపతివారి అగ్రహారం, రాయాజివీధి, మధ్వపతివారి వీధి, యడ్లవారివీధి, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎండి.ఖలీల్‌అహ్మద్‌ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగనన్న చేసిన రాష్ట్రాభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాలతో ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధంగా వున్నారన్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా నాడు-నేడు కింద మునిసిపల్స్‌ స్కూల్స్‌ను ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మీ బిడ్డగా వుండి సేవ చేసుకుంటానని, ఎప్పుడూ అందుబాటులో వుంటానని ఒక్క అవాకశం ఇచ్చి ఆశీర్వదించాలని, అలాగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి గారిని, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానన్నారు.


15/03/2024

నెల్లూరు నగరంలోని 11వ డివిజన్‌ పల్లిపాళెం, ఆర్చి సెంటర్, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎండి.ఖలీల్‌అహ్మద్‌ గ...
12/03/2024

నెల్లూరు నగరంలోని 11వ డివిజన్‌ పల్లిపాళెం, ఆర్చి సెంటర్, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎండి.ఖలీల్‌అహ్మద్‌ గారు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇంటింటికి చేకూరుతుండడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా వున్నారన్నారు. కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలోనే వచ్చి మేమున్నామని చెప్తుంటారు తప్ప, ప్రజలకు ఇబ్బందులు వున్నప్పుడు ఏరోజూ కనిపించలేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి గారిని, నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు.

12/03/2024



నెల్లూరు నగరంలోని 5వ డివిజన్‌ బర్మాషెల్‌గుంట, అహ్మద్ నగర్, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎండి.ఖలీల్‌అహ్మద్‌...
09/03/2024

నెల్లూరు నగరంలోని 5వ డివిజన్‌ బర్మాషెల్‌గుంట, అహ్మద్ నగర్, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎండి.ఖలీల్‌అహ్మద్‌ గారు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వలంటరీ వ్యవస్థ వచ్చిన తరువాత ఒకటో తేదీ ఉదయాన్నే ప్రతి ఇంటికి వచ్చి పింఛన్లు అందిస్తుండడం, అలాగే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇంటింటికి చేకూరుతుండడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా వున్నారన్నారు. నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, పార్కుల అభివృద్ధి, నూతనంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను నిర్మించడం.. ఇలా అనేక కార్యక్రమాలు చేశారన్నారు. కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలోనే వచ్చి మేమున్నామని చెప్తుంటారు తప్ప, ప్రజలకు ఇబ్బందులు వున్నప్పుడు ఏరోజూ కనిపించరని తెలియజేస్తున్నానన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి గారిని, నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు.


నెల్లూరు నగరంలోని 53వ డివిజన్‌ వారధి సెంటర్‌, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎండి.ఖలీల్‌అహ్మద్‌ ఇంటింటికి వె...
09/03/2024

నెల్లూరు నగరంలోని 53వ డివిజన్‌ వారధి సెంటర్‌, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎండి.ఖలీల్‌అహ్మద్‌ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సామాన్యుడైన నాకు ఒక అవకాశం ఇచ్చి, నగర నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇంటింటికి చేకూరుతాయన్న సంతోషంలో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో వుంటానని.. ఎవరికి ఏమి అవసరమొచ్చినా ముందుండి పరిష్కరిస్తానన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డిని, నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు.


23/02/2024

Address

Nellore

Telephone

+919010990075

Website

Alerts

Be the first to know and let us send you an email when Ward 54 corporator posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ward 54 corporator:

Share