Task force Tirupati ,Our Nation-our Tirupati-our responsibility

  • Home
  • India
  • Tirupati
  • Task force Tirupati ,Our Nation-our Tirupati-our responsibility

Task force Tirupati ,Our Nation-our Tirupati-our responsibility This group/association is formed to help needy people/covid patients and front line warriors.

Charity work by our Task force Tirupati..Many more to Go..jai Hind
26/05/2021

Charity work by our Task force Tirupati..Many more to Go..jai Hind

మూగజీవాలను, గోమాతల ను కాపాడుకుందాం.కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్(మన దేశం, మన తిరుపతి - మన బాధ్యత) కన్వీనర్ ముని సుబ్రమణ్యం పిల...
25/05/2021

మూగజీవాలను, గోమాతల ను కాపాడుకుందాం.

కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్(మన దేశం, మన తిరుపతి - మన బాధ్యత) కన్వీనర్
ముని సుబ్రమణ్యం పిలుపు.

కరోనా బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఈ నేపథ్యంలో మూగజీవాలకు, గోమాతలకు అవసరమైన ఆహారాన్ని అందించి వాటిని కాపాడుకోవాలని కోవిద్ 19 టాస్క్ ఫోర్స్ కన్వీనర్ ముని సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. నృసింహ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ గుడి వద్ద నుంచి పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవిందుడు కొలువుదీరిన తిరుపతి నగరంలో పశుసంపద ఎక్కువగా ఉందని అన్నారు. ఒకవైపు కరువు, మరోవైపు కరోనా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ తాజాగా ఎల్లో ఫంగస్ ప్రజల ప్రాణాలను తీస్తూ తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. ఇది పశుపక్ష్యాదులకు ఆహారం అందని పరిస్థితి కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలోనే తాము పశుపక్ష్యాదులకు ఆహారం అందించాలని నిర్ణయించుకున్నా మన్నారు. అందులో భాగంగానే దాతల సహకారంతో ప్రతిరోజు ఓ వాహనంలో పశువులకు అవసరమైన గడ్డి, ఇతర జంతువుల ఆకలి తీర్చడానికి వివిధ రకాల ఆహారం, పండ్లు, కూరగాయలను అందిస్తామని చెప్పారు. తొలిరోజు టేప్ నాయకులు ఆర్ ఆర్ శ్రీనివాసులు అలాగే తాను కూడా పశుపక్ష్యాదులకు అవసరమైన ఆహారాన్ని అందించడానికి నిర్ణయించామన్నారు. ఇందులో ఎవరైనా భాగస్వాములు కావచ్చని తెలిపారు. అలాగే ప్రజలు తమ ఇళ్ల వద్ద గోవులకు అవసరమైన ఆహారాన్ని అందించాలని కోరారు. తిరుపతి నగరంలోని కరోనా వారియర్స్ కు అవసరమైన పౌష్టికాహారాన్ని, పండ్లు అందించడానికి తాము సిద్ధమవుతున్నట్లు చెప్పారు. కరోనా తొలిదశలో ఫ్రెండ్స్ అసోసియేషన్ తరపున తిరుపతి నగరంలో నిరుపేదలకు విస్తృతంగా నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, కులమతాలకతీతంగా అందించామని చెప్పారు. ప్రస్తుతం కరోనా రెండో దశ మరింత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ముని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ లీల పారాయణ దాస్, ఆర్ఎస్ఎస్ నాయకులు గౌతమ్, గణపతి సింగ్, సేవా భారతి నాయకులు మునిరత్నం, అవిలాల శ్రీధర్, nsf నాయకులు నగేష్, మౌల తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం మరిచిపోతే మనుగడ లేదుకోవిద్ 19 టాస్క్ ఫోర్స్ కన్వీనర్ ముని సుబ్రమణ్యం తిరుపతి,  ఈరోజు మే 24 న covid-19 టాస్క్ ఫో...
24/05/2021

మానవత్వం మరిచిపోతే మనుగడ లేదు
కోవిద్ 19 టాస్క్ ఫోర్స్ కన్వీనర్ ముని సుబ్రమణ్యం

తిరుపతి, ఈరోజు మే 24 న covid-19 టాస్క్ ఫోర్స్ (మన దేశం, మన తిరుపతి, మన బాధ్యత) ఆధ్వర్యంలో TAPE నాయకులు ఆర్ ఆర్ శ్రీనివాస్, ముని సుబ్రహ్మణ్యం దాతృత్వం తో టాస్క్ ఫోర్స్ రెండవ కార్యక్రమం జరిగింది. కరోనా విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో మానవత్వంతో ప్రతి ఒక్కరు స్పందించాలని, అది మరచి పోతే మానవ మనుగడ లేదని కోవిద్ 19 టాస్క్ ఫోర్స్ కన్వీనర్ ముని సుబ్రమణ్యం అన్నారు. కరోనా బారిన పడి మృతి చెందిన వారి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరు ముందుకు రాకున్నా... తిరుపతి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనాధ శవాలకు వారి వారి సంప్రదాయానుసారం అంత్యక్రియలు నిర్వహిస్తున్న , వారిని అభినందించారు. సోమవారం స్థానిక ఎంఆర్ పల్లి లోని షాది మహల్ వద్ద తిరుపతి ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎస్ కె బాబు, అధ్యక్షుడు ఇమామ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌస్ తో పాటు వారి కార్యవర్గ సభ్యులు 20 మందిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే వారికి అవసరమైన దాదాపు రూ. 2 లక్షలు విలువ చేసే మెడికల్ పి పి కిట్లు, శానిటైజర్, మాస్కులు, గ్లౌజ్లు అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ ముని సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 708 మృతదేహాలకు వారి వారి సంప్రదాయానుసారం అంత్యక్రియలు నిర్వహించి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మతసామరస్యాన్ని, మానవత్వానికి తిరుపతి ముస్లిం జేఏసీ నాయకులు ప్రతీకగా నిలిచారని అభినందించారు. మన దేశం, మన తిరుపతి, మన బాధ్యత నినాదంతో కోవిద్ 19 టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వారిని అభినందించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో తమ ఆధ్వర్యంలో కరోనా వైరస్ తో బాధపడుతూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి అవసరమైన ఆహారం, మందులు ఇతర అవసరాలను గుర్తించి అందజేస్తామన్నారు. అలాగే మంగళవారం నుంచి తిరుపతిలో ఆకలితో అల్లాడుతున్న మూగజీవాలకు అవసరమైన ఆహారాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1800 రూపాయలు విలువచేసే ఆయుర్వేద మందుల కిట్ను సేవా భారతి ఆధ్వర్యంలో అందజేస్తామన్నారు. కరోనా వైరస్ అంతమయ్యేవరకు ముందుండి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ యాదవ్, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ సుబ్రమణ్యం, నగేష్, సేవా భారతి నాయకులు మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

*Covid 19 టాస్క్ ఫోర్స్ సేవలు అభినందనీయం*  ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమ వం...
22/05/2021

*Covid 19 టాస్క్ ఫోర్స్ సేవలు అభినందనీయం*

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమ వంతు సేవ చేయడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని covid 19 టాస్క్ ఫోర్స్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే, ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మనదేశం- మన తిరుపతి - మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు, రుయా హాస్పటల్లో కోవిడ్ వారియర్స్ అయిన వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బంది కి మెడికల్ పిపి కిట్లు, శానిటైజర్, మాస్కులు, గ్లౌజ్లను అందించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకే తలమానికమైన రుయా హాస్పిటల్ వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి సేవాభారతి ఇస్కాన్ టెంపుల్ సౌజన్యంతో టాస్క్ఫోర్స్ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్యం వితరణతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. టాస్క్ ఫోర్స్ కన్వీనర్ ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేస్తూ అలాగే ప్రజలు ప్రభుత్వం మనకేం చేసింది అని కాకుండా మన కోసం పని చేస్తున్న కోవిడ్ వారియర్స్కు అండగా నిలబడాల్సిన సమయం ఇదే అన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చే రోగులకు, కరోనా బాధితులు కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి ప్రతి ఒక్కరు తామున్నామని భరోసా కల్పించాలని చెప్పారు. కోవిడ్ వారియర్స్ కనిపించే దేవుళ్ళుగా అభివర్ణించారు. వారికి అవసరమైన వస్తువులను అందించడం తమకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలిగించిన మహా అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. ఇకపై టాస్క్ఫోర్స్ కార్యక్రమాలు తిరుపతి నగరంలో నిరంతరాయంగా నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ సుబ్రమణ్యం గారు, డాక్టర్ శ్రీహరి గారు, ఇస్కాన్ టెంపుల్ లీలా పారాయణ దాస్ గారు,TAPE నాయకులు ఆర్ ఆర్ శ్రీనివాసులు గారు, ఎన్జీవో సంఘం నాయకులు సురేష్ గారు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్ కె బాబు గారు, గౌస్ గారు, nsf నాయకులు నగేష్ గారు, సేవ భారతి నాయకులు ముని రత్నం గారు, అవిలాల శ్రీధర్ గారు,రుయా హాస్పటల్ సూపరింటెండెంట్ భారతి గారు, నోడల్ ఆఫీసర్ శ్రీహరి గారు తదితరులు పాల్గొన్నారు.

నమస్కారాలతో
ముని సుబ్రహ్మణ్యం
కన్వీనర్
Covid 19 - టాస్క్ ఫోర్స్.

22/05/2021

కోవిడ్-19 తిరుపతి టాస్క్ ఫోర్స్.

మన దేశం,మన తిరుపతి- మన బాధ్యత.

ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని కాకుండా మనము భాగస్వాములం అవుదాము.

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీ మరియు వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలు,,NGO లు, ప్రైవేట్ సంస్థలు, కార్మిక సంఘాలు, ప్రజల ఆలోచనలతో ఈ టాస్క్ ఫోర్స్ నిర్మాణం జరిగింది
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు గౌరవ సలహాదారులు గా, ఎస్. ముని సుబ్రహ్మణ్యం టాస్క్ ఫోర్స్ కన్వీనర్ గా, వివిధ రంగాల నుండి, వివిధ పార్టీల నుండి పార్టీలకతీతంగా ఈ సంస్థ పని చేస్తుంది.

తిరుపతి నగరవాసులకు మరియు కోవిడ్ వారియర్స్ కు మెరుగైన వైద్య సదుపాయాల కోసం, వివిధ రంగాల ప్రజల సహకారంతో నిధుల సమీకరణ, మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో భాగస్వామ్యం.

కోవిడ్ -19 ఫ్రంట్ లైన్ వారియర్స్ మరియు తిరుపతి నగర ప్రజానీకానికి సేవలు మొదటి ప్రాధాన్యత.

పర్మనెంట్ ఆక్సిజన్ ప్లాంట్స్, వెంటిలేటర్స్, ఐసియు సౌకర్యాలు, మెడిసిన్స్, పి పి కిట్స్ కోసం నిధుల సమీకరణ.

తిరుపతిలోని కరోనా బాధితులకు పౌష్టికాహారం పర్యవేక్షణ అనే లక్ష్యాలు తో (బాధ్యతలతో) పనిచేస్తుంది. కోవిడ్ నివారణ చర్యల్లో covid-19 (మన దేశం,మన తిరుపతి- మన బాధ్యత) కరోన నివారణా కార్యక్రమాలు అనే లక్ష్యాలతో పనిచేస్తుంది

నాన్ కోవిడ్- కోవిడ్ కు ప్రత్యేక సదుపాయాలు కలిగిన వైద్య భవనాల ఓ పి బ్లాక్లులు కొరకు కృషి చేయడం. అన్ని ఆరోగ్య సమస్యలను ఈ రెండు ఓ పి ల ద్వారా తిరుపతి వాసుల ఆరోగ్య సమస్యలు తీర్చడం . ఆ భవనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కొరకు ప్రభుత్వ సంస్థలతో కలసి- ప్రజల యొక్క సహకారాన్ని జోడించి కరోనా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం, covid - 19 టాస్క్ ఫోర్స్ (మన దేశం,మన తిరుపతి - మన బాధ్యత) కృషి చేస్తుంది

Address

SMS TOWERS. 20/5/715-A TIRUMALA Bypass ROAD KORLAGUNTA JUNCTION TIRUPATI
Tirupati
517501

Telephone

+919866147189

Website

Alerts

Be the first to know and let us send you an email when Task force Tirupati ,Our Nation-our Tirupati-our responsibility posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Task force Tirupati ,Our Nation-our Tirupati-our responsibility:

Share

Category