21/05/2026
ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ బస్సుల విప్లవం వేగంగా ముందుకు సాగుతోంది! 🚌⚡
ప్రస్తుతం గుంటూరు-2, నెల్లూరు-2 డిపోలు తమ డీజిల్ బస్సులను ఇతర డిపోలకు పూర్తిగా మార్చి ఎలక్ట్రిక్ బస్సుల డిపోలుగా మారుతున్నాయి. మంగళగిరి డిపోలో కూడా సగానికి పైగా బస్సులు ఇప్పటికే మార్పిడి అయ్యాయి.అనంతపురం, కడప, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి, కర్నూలు, సింహపురి, గాజువాక డిపోలలో ప్రతి డిపోకు 50 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నారు.
గుంటూరు, నెల్లూరు మరియు విద్యాధరపురం డిపోలలో ప్రతి డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.పర్యావరణ పరిరక్షణ, తక్కువ కాలుష్యం, ప్రశాంతమైన ప్రయాణం వైపు APSRTC మరో ముందడుగు వేస్తోంది. 🌱⚡
Pic credit respected owner's ❤️🙌